2024-07-27 10:17:57
Shikhar Dhawan తో విడాకులు.. అసలు ఎవరీ అయేషా ముఖర్జీ ? – Sirimalli.com

Shikhar Dhawan తో విడాకులు.. అసలు ఎవరీ అయేషా ముఖర్జీ ?

Shikhar Dhawan : టీంఇండియా కిక్రెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan), అయేషా ముఖర్జీ తమ ఎనమిది సంవత్సరాల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పేశారు.. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అయేషా ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అయేషా ముఖర్జీ ఇప్పటివరకు రెండుసార్లు విడాకులు తీసుకున్నారు.

2012లో క్రికెటర్ ధావన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయేషా.. శిఖర్, అయేషా దంపతులకి 2014లో జోరవర్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఎప్పుడూ సంతోషంగా,హుషారుగా కనిపించే కనిపించే ఈ జంట నుంచి ఇలాంటి ప్రకటన రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కాగా విడాకుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

“మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డానని, ఏదో తప్పు చేస్తున్నాని,జీవితంలో నేనేదో కోల్పోయినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు,పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. జీవితంలో నేను నేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది” అంటూ పేర్కొంది.

ఎవరీ అయేషా ముఖర్జీ అని నెటిజన్లు సెర్చ్ మొదలుపెట్టేశారు.. అయేషా ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌కి చెందింది. అయితే ఆమె 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆమె కుటుంబం.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది. అక్కడ కిక్ బాక్సింగ్‌ నేర్చుకున్న అయేషా.. జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో అక్కడ ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలున్నారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

శిఖర్ ధావన్ తో ప్రేమ, పెళ్లి..

టీంఇండియా కిక్రెటర్ శిఖర్ ధావన్ కి అయేషా ఫేస్ బుక్ ద్వారా పరిచయం.. వీరిద్దరికీ హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్.. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే శిఖర్ ధావన్ కంటే అయేషా పదేళ్ళు పెద్దది. దీనితో ధావన్ ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇంటినుంచి బయటకు వచ్చి అయేషాని పెళ్లి చేసుకున్నాడు ధావన్.

అయేషా ఇద్దరు కూతుళ్ళ బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిన ఫ్యామిలీతోనే వెళ్తూ ఉంటాడు ధావన్.. క్రికెట్ లేకపోతే ఎక్కువగా ఫ్యామిలీ తోనే గడుపుతుంటాడు. ఇలా ఎంతో ప్రేమగా ఉండే వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది అభిమానులకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కాగా ఇంకా విడాకుల పై గబ్బర్ స్పందిచలేదు.

Also Read :