Telugu Heroines : రచ్చ గెలిచి ఇంట గెలిచిన హీరోయిన్లు వీళ్లే…!
Cinema Latest

Telugu Heroines : రచ్చ గెలిచి ఇంట గెలిచిన హీరోయిన్లు వీళ్లే…!

Telugu Heroines : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి తమిళ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు కొందరు భామలు.. అలా అక్కడ ఫేం సాధించి మళ్ళీ తెలుగు(Telugu Heroines )లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి హీరోయిన్ లపై ఓ లుక్కేద్దాం.

అప్పటి అనందినే.. ఇప్పటి సోడాల శ్రీదేవి..

Image

మారుతి తెరకెక్కించిన ఈరోజుల్లో చిత్రంలో ఓ పాటలో కనిపించింది ఆనంది. ఆ తర్వాత బస్ స్టాప్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. నాయక్ సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైకి చెక్కేసింది. అక్కడ వరుస అవకాశాలు అందిపుచ్చుకొని కాయల్ ఆనందిగా గుర్తింపు తెచ్చుకుంది. మళ్ళీ తెలుగులో జాంబిరెడ్డితో రీఎంట్రీ ఇచ్చి తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సోడాల శ్రీదేవిగా నటించి మెప్పిచింది.

టెన్త్ క్లాస్ భామే.. ఈ రాజరాజ చోరుడి భార్య..

Image

‘కుమార్‌ వర్సెస్‌ కుమారి’తో హీరోయిన్‌గా పరిచయమైంది నటి సునైనా.. టెన్త్ క్లాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి ఫేం సంపాదించుకుంది. ఫేం వచ్చింది కానీ అవకాశాలు రాలేదు. దీనితో కోలీవుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాలు అందిపుచ్చుకుంది. అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ‘నీర్పరవై’ చిత్రంలో నటనకు గాను ఫిలింఫేర్‌ నామినేషన్‌ దక్కించుకుంది. తిరిగి ‘రాజ రాజ చోర’ సినిమాలో శ్రీవిష్ణు భార్య విద్యగా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించి సూపర్‌హిట్‌ కొట్టింది.

సుబ్రహ్మణ్యపురం స్వాతి.. అక్కడే ఫస్ట్ హిట్..

Image

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత మనసారా సినిమాతో హీరోయిన్ గా మారింది స్వాతి. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత 2008లో కోలీవుడ్ లో నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఆమెకి సూపర్‌ సక్సెస్‌ ని ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ లో స్వాతిది మెయిన్ రోల్ అని చెప్పాలి. దీనితో తెలుగులో మళ్ళీ అవకాశాలు అందిపుచ్చుకుంది ఈ నటి. అష్టా చమ్మా, కార్తికేయ, స్వామిరారా, గోల్కొండ హై స్కూల్ లాంటి సక్సెస్ లు ఆమెకి ఉన్నాయి.

ఈ లిస్టులో అంజలి, బిందుమాధవి లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.

Also Read :