Nag vs Venky : 11 సార్లు పోటీ.. ఎవరిదీ పైచేయి…!
Cinema Latest

Nag vs Venky : 11 సార్లు పోటీ.. ఎవరిదీ పైచేయి…!

Nag vs Venky : కింగ్ నాగార్జున, వీక్టరీ వెంకటేష్ ల సీనీ కెరీర్ ఒకేసారి మొదలయింది. అదే 1986లో(Nag vs Venky : )..  నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున.. విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వగా.. బడా ప్రోడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు వారసుడిగా కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఈ రెండు సినిమాలు వారికి మంచి విజయాన్ని అందించాయి. ఒకేటైమ్ లో ఇద్దరు ఇండస్ర్డీకి వచ్చారు కాబట్టి పోటీ అనేది సహజంగానే ఉంటుంది. వరుసుకి నాగార్జున, వెంకటేష్ ఇద్దరు బావాబావమరిది అన్న సంగతి తెలిసిందే.

వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పోటీలేనప్పటికీ సినిమాల విషయంలో మాత్రం ఇద్దరు మాత్రం 11 సార్లు పోటీపడ్డారు. ఇందులో నాగార్జునకి అయిదు హిట్లు ఉండగా, వెంకటేష్ కి ఆరు హిట్లు ఉన్నాయి. యంగ్ హీరోలుగా ఇద్దరూ పేరు తెచ్చుకుంటున్న టైంలో అంటే 1987లో మొదటిసారిగా పోటీపడ్డారు.

  • 1987లో ఆగస్టు 12వ తేదిన నాగార్జున అగ్నిపుత్రుడు రిలిజై ప్లాప్ అయింది. ఆగస్టు 14న రిలిజైన వెంకటేష్ విజేత విక్రమ్ కూడా ప్లాప్ అయింది.
  • 1989లో జనవరి 12న వెంకటేష్ ప్రేమ ప్లాప్ అవ్వగా, జనవరి 19న వచ్చిన నాగార్జున విజయ్ కూడా ప్లాప్ అయింది.
  • 1989 మే12న నాగార్జున గీతాంజలి సూపర్ హిట్ అయింది. మే 18 న విడుదలైన వెంకటేష్ ఒంటరి పోరాటం హిట్ అయింది.
  • 1990లో నాగార్జున ఇద్దరు ఇద్దరే చిత్రం సెప్టెంబర్ 5 న రిలీజై ప్లాప్ అవ్వగా, సెప్టెంబర్ 14న వెంకటేష్ బొబ్బిలిరాజా రిలిజై సూపర్ హిట్ అయింది.
  • 1991లో సెప్టెంబర్ 5న వెంకటేష్ సూర్య IPS రిలీజై ప్లాప్ అవ్వగా, సెప్టెంబర్ 19 న రిలీజైన నాగార్జున శాంతిక్రాంతి కూడా ప్లాపైంది.
  • 1992లో జనవరి10వ తేదిన ఇద్దరి సినిమాలు ఒకేరోజున విడుదలయ్యాయి. అవే వెంకటేష్ చంటి, నాగార్జున కిల్లర్…ఇందులో చంటి ఇండస్ట్రీహిట్ కొట్టగా, కిల్లర్ యావరేజ్ గా మిగిలింది.
  • 1993లొ సెప్టెంబర్ 30న వెంకటేష్ అబ్బాయిగారు రిలీజై జస్ట్ హిట్ అనిపించుకోగా, వారంరోజుల గ్యాప్ లో వచ్చిన నాగార్జున అల్లరి అల్లుడు సూపర్ హిట్ అయింది.
  • 1996లో అక్టోబర్ 4 వ తేదిన రిలీజైన నాగార్జున నిన్నే పెళ్ళాడుతా సెన్సేషనల్ హిట్ అవ్వగా, అక్టోబర్ 17న వచ్చిన వెంకటేష్ పవిత్రబంధం సూపర్ హిట్ అయింది.
  • 2000లో సెప్టెంబర్ 29న వచ్చిన నాగార్జున అజాబ్ చిత్రం జస్ట్ హిట్ అవ్వగా, వారం గ్యాప్ లో వచ్చిన అక్టోబర్ 7 న వచ్చిన వెంకటేష్ జయం మనదేరా సూపర్ హిట్ అయింది.
  • 2010 డిసెంబర్ 16న వెంకటేష్ నాగవల్లి రిలీజై ప్లాప్ అవ్వగా, డిసెంబర్24 న నాగార్జున రగడ జస్ట్ హిట్ అనిపించుకుంది.
  • 2013 ఏప్రిల్ 26న వెంకటేష్ షాడో రిలీజై ఫ్లాప్ అవ్వగా, మే 03వ తేదిన రిలీజైన నాగార్జున గ్రీకువీరుడు కూడా ప్లాపైంది.

Also Read :