Bigg Boss 5 Telugu Nominations : డోస్ పెంచిన బిగ్‌‌బాస్ .. నామినేషన్స్ షురూ..!

Bigg Boss 5 Telugu Nominations : టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ గా నిన్న మొదలైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ అయితే కలర్ఫుల్ గా కళకళలాడుతుంది. అలా కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళారో లేదో నామినేషన్స్(Bigg Boss 5 Telugu Nominations ) ఘట్టం మొదలైపోయింది.

Bigg Boss 5 Telugu Latest Promo: First Week Nominations Started - Sakshi

అవును ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమోతో డోస్ పెంచాడు బిగ్ బాస్.. కౌంటర్ లతో, ఏడుపులతో హౌస్ ని వేడెక్కించినట్టుగా కనిపిస్తుంది. అందరూ తాము పలానా కంటెస్టెంట్ ని ఎందుకు నామినేట్‌ చేయాలనుకుంటున్నామో చెబుతూ.. ఆ వ్యక్తి ఫేస్‌ ఉన్న బ్యాగును మందున్న చెత్తడబ్బాలో వేయాలి.

అయితే దీనిని కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే మరికొందరు రివర్స్ కౌంటర్లు వేశారు. ముందుగా రవిని నామినేట్‌ చేస్తూ నీ యాటిట్యూడ్‌ నీ దగ్గర పెట్టుకో అంటూ లోబో అన్నాడు. తనవంతూ వచ్చాక రవి.. నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. మిమ్మల్ని చూస్తుంటే స్ట్రిక్ట్‌గా అనిపిస్తోందని రవి చెప్పగా, వెంటనే నాకు నటించడం రాదంటూ నటరాజ్‌ మాస్టర్‌ ఎదురుదాడికి దిగాడు.

ఇక విశ్వ, జెస్సీల మధ్య కాస్త మాటల యుద్దమే నడిచింది. ఆ తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ ఇలా అమాయకత్వంగా ఉంటే తొక్కేస్తారు అంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. దీనితో జెస్సీ ఏడ్చేశాడు. మాటలు, కౌంటర్, ఏడుపులతో షో పైన బిగ్ బాస్ కాస్త హైప్ అయితే పెంచాడనే చెప్పాలి చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో.

Also read :