2024-07-27 09:36:09
Nivetha Thomas: ఆవు పాలు పితికిన హీరోయిన్‌.. పెద్ద సాహసమేనట..! – Sirimalli.com

Nivetha Thomas: ఆవు పాలు పితికిన హీరోయిన్‌.. పెద్ద సాహసమేనట..!

Nivetha Thomas: సెలబ్రిటీలు ఏది చేసిన అవి చేసిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులోనూ సినీ సెలబ్రిటీలు అయితే అవి క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా హీరోయిన్ నివేదా ధామస్(Nivetha Thomas) చేసిన ఓ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. బ్లాక్‌ కలర్‌ జాకెట్‌ వేసుకొని డైరీ ఫామ్‌కి వెళ్ళిన నివేదా అక్కడ స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… జాయ్ అనే ట్యాగ్ ని జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

May be an image of 2 people

ఈ వీడియోని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడుతారు..వెళ్లినా.. పాలు పితికే ధైర్యం చేయలేరు.. నువ్వు పెద్ద సాహసమే చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1,81,458 లైక్స్ వచ్చాయి.

ఇక నివేదా సినిమాల విషయానికి వస్తే.. ‘నాని’ హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత నిన్ను కోరి, జై లవకుశ, వి సినిమాలలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలను చేయడమే నివేదా స్పెషాలిటీ.

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ముందుకు వెళ్తుంది ఈ బ్యూటీ.

https://www.instagram.com/reel/CTgx82SHlTo/?utm_source=ig_web_copy_link

Also Read :