Diabetese Fruits : షుగర్ పేషెంట్లు ఈ ఆరు పండ్లను తినొచ్చా? 

Diabetese Fruits : శరీరానికి కావలసిన పోషకాలను అందించేవాటిలో ప్రథమ తాంబూలం పండ్లదే. నీరు, విటమిన్లు, ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది. అందుకే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సహజ చక్కెర శరీరానికి నష్టం కలిగించదు. కాకపోతే రోజూ ఏఏ రకాల పండ్లను ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకునేవారు.. ఏ పండ్లలో చక్కెర (Diabetese Fruits) ఎక్కువగా ఉందో తెలుసుకోవాలి. అలాంటివాటిని తినకూడదు.  డయాబెటిస్ ఉన్నవారు.. ఏ పండునైనా సరే తినాలంటే.. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.

మామిడి పండ్లు
మామిడి అంటే అందరికీ ఇష్టమే. కానీ మామిడిలోని.. మీడియం సైజు పండ్లలో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకున్నా.. లేదా షుగర్ ఎక్కువున్న మామిడి పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒకటీ అరా ముక్కలు తినాలనుకున్నా వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

ద్రాక్ష
ఒక కప్పు ద్రాక్షలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. తక్కువగా తినాలనుకున్నా.. తక్కువ షుగర్ మాత్రమే ఉండాలనుకున్నా.. వాటిని సగానికి కట్ చేసుకుని తింటే సరిపోతుంది. మీరు స్మూతీలు, షేక్స్ మరియు వోట్ మీల్స్‌లో ఉపయోగించడానికి వీలుగా ద్రాక్షను ముక్కలుగా చేసి డీప్ ఫ్రీజ్ చేయవచ్చు. ద్రాక్షను ఏ పరిమాణంలో తీసుకోవచ్చో వైద్యులు సూచిస్తారు.

చెర్రీస్
ఒక కప్పు చెర్రీస్‌లో దాదాపు 18 గ్రాముల చక్కెర ఉంటుంది. పైగా మీరు ఎన్ని తింటున్నారో, మీ దగ్గర ఎన్ని ఉన్నాయో వాటిని ఈజీగా గుర్తించొచ్చు. అందుకే చెర్రీస్ తినడానికి కూర్చునే ముందు, వాటిని లెక్కబెట్టుకుంటే.. ఎన్ని తిన్నారో తొందరగా తెలుస్తుంది. వీటిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నందువల్ల వీటిని కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

బేరి
ఒక మధ్య తరహా పియర్‌ ఫ్రూట్ లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు చక్కెరను తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే దీనిని పూర్తిగా తినకపోవడం మంచిది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో లేదా మీకు ఇష్టమైన సలాడ్ పైన కొన్ని ముక్కలుగా వేసుకుని తీసుకోవచ్చు. అది కూడా షుగర్ తో సమస్య లేదనుకుంటేనే సుమా!

పుచ్చకాయ
వేసవి కాలంలో పుచ్చకాయలను చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువ. పైగా వీటిలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. పుచ్చకాయలో ఎలక్ట్రోలైట్స్ అని పిలిచే ప్రత్యేక ఖనిజాలు ఉంటాయి. అది మీ శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి చాలా అవసరం. ఒకేసారి రెండు ముక్కల కన్నా ఎక్కువ వద్దు. ఒంట్లో చక్కెర సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.

అరటి
అరటిపండ్లు శక్తికి కేంద్రం. శరీరానికి మంచి శక్తినిస్తాయి. ఒక మధ్య తరహా అరటిలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు ఉదయం తీసుకునే తృణధాన్యాలలో సగం అరటిని ముక్కలు చేసి తీసుకోవచ్చు. లేదా మీ పీనట్ బటర్ శాండ్‌విచ్ మధ్యలో కొన్ని ముక్కలుగా వేసుకుని తినవచ్చు. కానీ షుగర్ పేషెంట్లు డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు.

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page