Bigg Boss 5 Telugu: లోబోతో కలిసి దమ్ముకొట్టిన హమీదా, సరయూ..!
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss 5 Telugu: లోబోతో కలిసి దమ్ముకొట్టిన హమీదా, సరయూ..!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్లకి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్ధాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారు షో నిర్వాహకులు(Bigg Boss 5 Telugu). అలాగే ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్ ని ఏర్పాటు చేస్తారు.

స్మోకింగ్ రూమ్ లో కంటెస్టెంట్లకి తమవ్యూహాలకి, ఆలోచనలకి పదును పెడుతుంటారు. ఇక్కడే గాసిప్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. అయితే తాజాగా స్మోకింగ్ రూమ్ లో లోబోతో పాటుగా హమీదా, సరయూ దమ్ముకొడుతూ కనిపించారు.

అక్కడ ఘాటుగా పొగలు వదులుతూ ఇంటి సభ్యుల తీరు గురించి మాట్లాడుకున్నారు. హౌజ్ లో ఇంటి సభ్యులతో కనెక్ట్ అవ్వడం కష్టం.. బయట అయితే ఒకే నని, విశ్వ త్వరగా కనెక్ట్ అయ్యాడని సరియు అంటే, మీతో మాజక్ చేసినట్టు ప్రియతో చేయలేనని లోబో అన్నాడు.

వీరి సంబాషణ వింటూ హమీదా ఎంజాయ్ చేసింది. చివరికి సిగరెట్లను భద్రంగా దాచుకుంటూ కనిపించారు. అన్‌సీన్‌ ఎపిసోడ్‌లో ప్రసారం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read :

https://www.instagram.com/p/CTglDF-JCrr/