2024-07-18 02:02:05
పక్కా ప్రూఫ్స్‌తో దొరికిపోయిన లోబో.. నెటిజన్లు ఫుల్ ట్రోల్స్‌ – Sirimalli.com

పక్కా ప్రూఫ్స్‌తో దొరికిపోయిన లోబో.. నెటిజన్లు ఫుల్ ట్రోల్స్‌

బుల్లితెర ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 5 అట్టహాసంగా నిన్న మొదలైంది. కింగ్ నాగార్జునే మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించడం షో స్పెషాలిటీ. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు మొదలైన ఈ షోలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు లోబో.. కట్టుబొట్టు, మాట తీరులో విభిన్నంగా కనిపించే లోబో కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. వాస్తవానికి లోబోకి గతంలో బిగ్‌బాస్‌ ఆఫర్ వచ్చింది.. కానీ తన ఎంట్రీని ముందుగానే లీక్‌ చేయడంతో నిర్వాహకులు తనను షోలోకి తీసుకోలేదు. అయితే ఓ మీడియా ఛానల్‌‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌‌బాస్ పైన అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా..’బిగ్‌బాస్‌ షోకు ఓ దండం. అది నా టేస్ట్‌ కాదు. షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు’ అంటూ కామెంట్స్ చేశాడు లోబో. ః

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్లు లోబోని కామెంట్స్‌‌తో ఆడుకుంటున్నారు. ఛాన్స్ వస్తే పొగడడం, రాకపోతే తిడుతూ ఇలా ప్లేటు ఫిరాయించడం కామనే అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలావుండగా పక్కా హైదరాబాదు భాషలో యాంకరింగ్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న లోబో బిగ్ బాస్ లో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి మరి.

Also Read :