Nabha Natesh : సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ…!
Cinema Latest

Nabha Natesh : సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ…!

Nabha Natesh : సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నభా నటేష్(Nabha Natesh). ఇక పూరీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగింది. తర్వాత ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం నితిన్‌కు జోడీగా నటించిన ‘మ్యాస్ట్రో’తో అలరించనుంది.

Image

ఇదిలావుండగా నభాకి క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది, మహేశ్‌బాబు హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా పూజా హేగ్దే ఎంపికైంది. ఇందులో మరో హీరోయిన్ కి స్కోప్ ఉండడంతో ఆ అవకాశం నభా నటేశ్‌కు దక్కిందని సమాచారం.

Image

అయితే ప్రస్తుతం దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదే నిజం అయితే నభా పంట పండినట్లే.. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబో రీపీట్ కాబోతుంది.

Also Read :