2024-07-27 15:39:51
Pooja Hegde: అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా.. అలా చేస్తే ట్రోలింగే! – Sirimalli.com

Pooja Hegde: అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా.. అలా చేస్తే ట్రోలింగే!

Pooja Hegde:  మామూలుగా ఎవ్వరైనా నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు తడబడడం సహజం. అలా తడబడినప్పుడు ఒక్కొక్కసారి మాటల్లో తప్పులు జరగొచ్చు. అలాగే ఇలాంటివి నటీనటులకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా రెడీగా ఉంటోంది.

Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/

ఇంతకు ముందు కూడా నటీనటులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగానే ఉండేది కానీ.. అన్నీ గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా వారికి సహాయపడుతుంది. అందుకే నటీనటులు చేసే చిన్న పొరపాట్లను కూడా మళ్లీ మళ్లీ చూపిస్తూ వారిని ట్రోల్ చేస్తున్నారు. అలా.. ఒకప్పుడు సమంత (Samantha), ఇప్పుడు పూజా హెగ్డే (Pooja Hegde) ఓ పదాన్ని పొరపాటున తప్పుగా పలికారు. అంతే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

పూజా హెగ్డే ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో బిజీగా సిటీలన్నీ చుట్టేస్తోంది. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలకు, ఈవెంట్లకు అటెండ్ అవుతోంది. ప్రభాస్‌తో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం పాటు తాను కూడా పలు బాలీవుడ్ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను సాగిస్తోంది. తాజాగా అలా అటెండ్ అయిన ఓ ఇంటర్వ్యూలో పూజా తడబడుతూ మాట్లాడిన ఓ అసభ్యకర పదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Pooja Hegde Interview Video: https://www.instagram.com/tv/CauclOruNQO/?utm_source=ig_web_copy_link

సక్సెస్‌కు బదులుగా పూజా.. ఓ అసభ్యకర పదాన్ని వాడడం చూసి అందరూ తనను తెగ ట్రోల్ చేస్తున్నారు. అది పొరపాటున వచ్చిన మాటే అయినా.. దానిని పదే పదే చూపిస్తూ సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇంతకు ముందు సమంత కూడా ఓ ఈవెంట్‌లో సక్సెస్‌కు బదులుగా ఇదే అభ్యంతకర పదాన్ని ఉపయోగించడం గుర్తుచేసుకుంటున్నారు. మొత్తానికి నటీనటులు చాలా అలర్ట్‌గా ఉండకపోతే ట్రోలింగ్స్‌కు గురవ్వాల్సిందే అని మరోసారి ప్రూవ్ అయ్యింది.