Divya Agarwal: బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్..

Divya Agarwal: సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డివర్స్, రెండు బ్రేకప్. ఎంతోకాలం నుండి డేటింగ్‌లో ఉన్న ప్రేమికులు అయినా.. పెళ్లయి చాలాకాలం కలిసున్న భార్యభర్తలు అయినా.. మనస్ఫర్థలు వస్తే.. మరో నిమిషం ఆలోచించకుండా విడిపోవడం ఇప్పట్లో ఫ్యాషన్. అయితే వారి దారిలోనే వెళ్తానంటూ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పింది బిగ్ బాస్ విన్నర్.

బిగ్ బాస్ ముందుగా హిందీలో ప్రారంభమయ్యింది. సక్సెస్‌ఫుల్‌గా 15 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే తాజాగా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ విన్నర్ అయిన దివ్య అగర్వాల్ (Divya Agarwal) తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

దివ్య అగర్వాల్.. బాలీవుడ్‌లో పలు మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయిన నటి. ‘స్ల్పిట్స్ విల్లా’, ‘రోడీస్’లాంటి పలు రియాలిటీ షోలతో పాపులర్ అయ్యింది దివ్య అగర్వాల్. అలా హిందీ బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లో చోటు సంపాదించుకోవడమే కాకుండా విన్నర్‌గా కూడా నిలిచింది. ప్రస్తుతం తాను పలు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న దివ్య బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్తూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.

2018లో ‘రోడీస్’ అనే షోలో తనతో పాటు చేసిన వరుణ్ సూద్ అనే నటుడిని దివ్య ప్రేమించింది. అప్పటినుండి వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే తాజాగా తాను వరుణ్ సూద్‌తో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దివ్య. ‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్‌ లవ్‌ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది ?’

Divya Agarwal Breakup Post: https://www.instagram.com/p/Cawe8HqJVMW/?utm_source=ig_web_copy_link

‘నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ సింపుల్‌గా తన బ్రేకప్‌ను ప్రకటించింది దివ్య.