Womens Day : ఆమె ఆశలకు అతడి సంకెళ్లెందుకు?

Womens Day : అమ్మాయి నుంచి పరిపూర్ణమైన మహిళగా మారే క్రమంలో ఎన్నో సవాళ్ళు.. మరెన్నో  ఒడిదొడుకులు. తల్లిదండ్రులు, తోబుట్టువులు సమక్షంలో పెరిగిన అమ్మాయిలకి జీవితం పూలపాన్పులానే ఉంటుంది. కానీ పసికందుని కూడా వదలని  క్రూరమృగాలు ఉన్న సమాజంలో ఆదరణ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి?

ఆడదయితే చాలు Good Morning, Good Night.. తిన్నావా అంటూ messages చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎప్పుడయినా అడిగి ఉంటారా?  గర్భధారణ, పీరియడ్స్  టైమ్ లో శారీరక, మానసిక మార్పులు ఎన్నో వస్తాయి. (hormone imbalance, mood swings). ఎంతమంది ఆ పరిస్థితిని అర్దం చేసుకుని support ఇచ్చి ఉంటారు?

కుటుంబం కోసం గడపదాటి వెళ్ళేదారిలో, పనిచేసే దగ్గర ఇంకా మారని ఎన్నో దారుణాలు. ఇదంతా ఒకపక్కన అయితే రెండవ వైపు.. ఎంతోమంది మహనీయులు.. మహిళకి సమానహక్కులు కావాలని పోరాడిన ఫలితమే.. ఈ రోజున ఎంతోమంది మహిళలు కలలని సాధించగలగడం.

మగవారు కొంతమంది ఇంట్లో చాలా support ఇస్తున్నారు. అలా అని వారినెత్తిమీద తాండవం చేయకండి. అర్దం చేసుకుని అన్యోన్యంగా ఉండండి. ఇందులో ఎవరు ఎక్కువ, తక్కువ కాదు. మన పురాణాలు కూడా అదేగా చెబుతున్నాయి. అర్ధనారీశ్వరులని ఉదాహరణగా తీసుకుంటే అదేగా అర్దం. ఇగోలకు పోకుండా అందరు సంతోషంగా ఉండండి.

నాది పల్లెటూరు అయినా నా తల్లితండ్రులు ఎప్పుడూ నాకు ఎలాంటి హద్దులు పెట్టలేదు.స్వేచ్ఛ అనే రెక్కల్ని ఇచ్చారు. చాలా గర్వంగా ఉంటుంది.  మంచి మనస్సున్న నా అమ్మ, నాన్నని తలచుకున్నప్పుడు. నా తోటి మహిళలు అందరికి Happy International Women’s Day 💐💐

– Srilakshmi Yalavarthi

 

Also Read : 

Suma Kanakala: ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్..

Suma Kanakala: ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్..

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page