2024-07-27 05:20:12
Nagababu ON Biggboss 5 : వాళ్ళందరూ నాకు క్లోజ్… కానీ నా మద్దతు ఆమెకే..! – Sirimalli.com

Nagababu ON Biggboss 5 : వాళ్ళందరూ నాకు క్లోజ్… కానీ నా మద్దతు ఆమెకే..!

Nagababu ON Biggboss 5 : బుల్లితెర పై అతి పెద్ద రియాల్టీషో గా పేరు తెచ్చుకుంది బిగ్‌బాస్‌ (Nagababu ON Biggboss 5)… నార్త్ నుంచి సౌత్ వరకు వచ్చిన ఈ షోకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. తెలుగులో కూడా నాలుగు సక్సెస్ఫుల్ సీజన్స్ ని కంప్లీట్ చేసుకొని తాజాగా ఐదో సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఊహించని ట్విస్టులతో సరికొత్త టాస్క్ లతో ప్రేక్షకులను మరింతగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దమయ్యాడు బిగ్‌బాస్‌… ఎన్నడూ లేనంతగా ఈసారి ఏకంగా 19 మందిని బిగ్‌బాస్‌ హౌస్ లోకి తీసుకొచ్చారు షో నిర్వాహకులు. ఇందులో పదిమంది అబ్బాయిలు ఉండగా, తొమ్మిది మంది అమ్మాయిలున్నారు. షోకి మొదటిరోజు నుంచే హైప్ తీసుకొచ్చారు.

ఇక అభిమానులు కూడా తమ కంటెస్టెంట్ లు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌ సీజన్ 5 పై స్పందించారు. హౌజ్ లో ఉన్న యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియా, నటరాజ్ మాస్టర్ లు తనకి బాగా క్లోజ్ అని అయితే.. తన పూర్తి మద్దతు మాత్రం ట్రాన్స్ జెండర్ ప్రియాంకకే ఉంటుందని వెల్లడించాడు.

Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ  గోల్డెన్ ఛాన్స్ | Jabardasth sai teja priyanka singh in bigg boss 5 telugu  | TV9 Telugu

ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌ లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. అయితే అమే విన్నర్ అవుతుందో, లేదో తెలియదు కానీ.. తన పూర్తి మద్దతు అమేకేనని స్పష్టం చేశారు. ఇక ప్రియాంక విషయానికొస్తే.. అమేది శ్రీకాకుళం.. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also Read :