International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. మీ ఆయుష్షును చెప్పే యోగ.. అదెలా అంటే..

International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. ఎంతకాలం బతుకుతారో చెప్పడం.. యోగాతోనే సాధ్యం. ఎక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ ఆయుష్షని, తక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ ఆయుర్దాయమని అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది. కోపంతో ఉంటే శ్వాస పెరుగుతుంది. గతంలో నిమిషానికి పది నుంచి పన్నెండు సార్లు శ్వాసిస్తే.. ఇప్పుడు నిమిషానికి ఇరవైసార్లు దాటుతోంది. దీనిని నియంత్రణలో పెట్టే శక్తి యోగాకే (International Yoga Day) ఉంది.

Yoga Day 2020 : యోగాలో బెస్ట్ ఆసనాలు ఇవే...మీరూ ట్రై చేయండి

యోగాతో రక్తపోటు, వెన్నెముక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఊబకాయాన్ని నియంత్రించడంలో యోగాకు ఎదురులేదని.. ఉత్తరప్రదేశ్ లోని సీసీఎం మెడికల్ యూనివర్సిటి చెప్పింది. కాలేయ, గుండె సంబంధ వ్యాధులకు చెక్ పెడుతుంది. యోగసాధకుల్లో డీఎన్ఏ చాలా చైతన్యంగా ఉంటుందని పరిశోధకులు ఎప్పుడో చెప్పారు. సూర్యనమస్కారాలు, తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటి చక్రాసనాల సాధనతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. సెలబ్రెటీలు సైతం శక్తి కోసం యోగానే ఆశ్రయిస్తారు.

Tadasana or Samasthiti | Vikasa

యోగాలో ప్రాణాయామ, యోగనిద్ర, మెడిటేషన్ ద్వారా క్యాన్సర్ లాంటి రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా సాధన వల్ల మన శరీరంలోని నిరోటిన్ ధాతువు వృద్ధి చెంది మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిషన్‌ను క్రమబద్దీకరిస్తుంది. శాస్త్రవేత్తలు చెప్పేదీ ఇదే. ఎండోక్రెనాల్ గ్రంథి పనితీరు సరిగా ఉండాలంటే.. యోగా వల్లే సాధ్యం. యోగా… రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతోంది యూనివర్సిటీ ఆఫ్‌ మియామీలోని టచ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌. వెన్నెముక సమస్యలకు పరిష్కారం ఉందంటోంది బెంగళూరులోని వివేకానంద యోగా విశ్వవిద్యాలయం.

10 Meditation Prompts That'll Challenge You to Think Bigger | Inc.com

తిరుమలై కృష్ణమాచార్యుల తరువాత యోగాను విశ్వవ్యాప్తం చేసినవారిలో మరొక ప్రముఖుడు బీకేఎస్ అయ్యంగార్. ‘అయ్యంగార్ యోగా’ అనే ప్రత్యేకమైన పద్దతితో ప్రపంచ ప్రాముఖ్యతను సంపాదించిన యోగా గురు ఈయన. విదేశాల్లో వంద శాఖలతో మంచి పేరు సంపాదించారు. అందుకే ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో సత్కరించింది.

Iyengar Yoga,
                                                           Iyengar Yoga,

 

గురుముఖంగా యోగా చేయాలనేది నియమం. అందుకే గురువు తప్పనిసరి. ఎందుకంటే.. యోగాలో భంగిమను తప్పుగా వేస్తే.. ఫలితం రాదు. పైగా లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు.. కొన్ని రకాల ఆసనాలు వేయకూడదు. దీనికోసమే గురువు సమక్షంలో మాత్రమే యోగా చేయాలి. ఇక ఎనిమిదేళ్ల వయసు నుంచి యోగాను చేయవచ్చు. పిల్లలకు, పెద్దలకు, వ్యాధిగ్రస్తులకు వేర్వేరు ఆసనాలు ఉంటాయి.

Maharishi Patanjali -
                                                             Maharishi Patanjali

క్రీస్తుపూర్వం రెండు, లేదా మూడో శతాబ్దానికి చెందిన పతంజలి మహర్షి అందించిన యోగ సూత్రాలు.. ప్రపంచానికి లభించిన గొప్ప వరం. రుషులు శరీర దారుఢ్యం కోసం చేసే అనేక ఆసనాలను ఒక్కచోట చేర్చి.. వాటిని సామాన్యులకు అందించిన ఘనత పతంజలి మహర్షిదే. ఆయన దృష్టిలో యోగా అంటే వ్యాయామం కాదు. జీవనశైలిలో ఓ భాగం.

ఇవి కూడా చదవండి : 

Also Read : International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే..

Also Read : Fathers Day : నాన్న.. నిన్ను అర్థం చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది.. కానీ ఇప్పుడు…

Also ReadSatya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage