Latest Off Beat

Fathers Day : నాన్న.. నిన్ను అర్థం చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది.. కానీ ఇప్పుడు…

Fathers Day : రోజూ ఉదయాన్నే 5.00 గంటలకే నిద్రలేచే నాన్నను చూసి.. ఇంకాసేపు పడుకోవచ్చు కదా నాన్న అంటే.. నవ్వేసి ఊరుకునేవారు. అప్పుడు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి జీవితంలో పడ్డ కష్టాలు.. ఆయనకు అలా క్రమశిక్షణను అలవాటు చేశాయని. ఆయనను చూస్తూ నేర్చుకునే మనకు.. దానిని అలవాటు చేస్తాయని. నాన్న (Fathers Day) నిజంగా గ్రేట్.

Celebrate Father's Day with these dining deals | AZ Big Media

కాన్వెంట్ లో జాయిన్ చేసినప్పుడు :
చిన్నప్పుడు కాన్వెంట్ లో (1980ల్లో) జాయిన్ చేసినప్పుడు స్కూల్ కి వెళ్లనని మారాం చేస్తే.. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది… సంతోషంగా బతకొచ్చు అని చెప్పినప్పుడు అర్థం కాలేదు.. తను పడ్డ కష్టం తన బిడ్డ పడకూదని.. అదే ఆయన కోరుకుంటున్నారని. నన్ను స్కూల్ కి పంపించడానికి, ఫీజులు కట్టడానికి ఎంతగా కష్టపడ్డారో తెలుసుకుంటే చాలా బాధేస్తుంది.

Father's Day 2020: Wish your dad with these lovely messages and make him feel special | Culture News | Zee News

వాచ్ కొన్నప్పుడు :
ఇంటర్మీడియట్ లో వాచ్ కొనమని అడిగాను. నాకప్పుడు బ్రాండ్ల గురించి తెలియదు. షాపులో ఉన్న ఓ షోకేస్ లో ఉన్న మంచి వాచ్ ని చూపించాను. కానీ అది ఓ ప్రముఖ కంపెనీది. గోల్డ్ కలర్ లో ఉంటుంది (ఇప్పటికీ అది ఇంట్లోనే ఉంది). అయినా అంత ఖరీదైనది ఎందుకు అని కోప్పడలేదు. షాపువాడికి కొంత డబ్బిచ్చారు. అబ్బాయికి ఆ వాచ్ ఇవ్వండి.. ఇంటికెళ్లి మిగిలిన డబ్బులు పంపిస్తాను అని మాత్రమే ఆ షాపు వారికి చెప్పారు. అప్పుడు అర్థం కాలేదు.. నేనేది కోరినా లేదు, కాదు అని చెప్పడానికి ఆయన ఇష్టపడరని.

When is Father's Day 2021 and why do we celebrate it? | Dorset Echo

ఎంబీఏ చదువుతానని చెప్పినప్పుడు :
డిగ్రీ అయ్యాక మేనేజ్ మెంట్ స్టడీస్ ఇష్టమని ఎంబీఏలో చేరతానని అడిగితే.. అప్పుడు మాత్రం ఒక్క మాట చెప్పారు. అంత ఫీజులు కష్టం రా అని. ఎప్పుడు నేను ఏది అడిగినా కాదనకుండా సరే అనే నాన్న.. ఒక్కసారిగా ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. పొరపాటున మధ్యలో ఫీజులు కట్టలేకపోతే అంతవరకు చదివిన చదువు వృథా అవుతుందని.. అకడమిక్ ఇయర్ లాస్ అవుతుందన్నదే నాన్న భయం. కావాలంటే.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకోమని మాత్రం చెప్పారు. కానీ ఆయన మనసును కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ కోర్సులో జాయిన్ అవ్వలేదు.

When is Father's Day 2020 and why do we mark the date? | London Evening Standard | Evening Standard

నా సంపాదన మొదలైనా సరే :
సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ కోర్సులైతే తక్కువ ఖర్చులోనే పూర్తిచేయవచ్చని తెలిసి వాటివైపు ఆసక్తి చూపించాను. కానీ వాటికీ కోచింగ్ కోసం విజయవాడ వెళ్లాలని తెలిసి ఆగిపోయాను. తరువాత ఇష్టమైన రంగాన్నే ఎన్నుకుని అందులో మంచి పొజిషన్ కు చేరుకోగలిగాను. ఇప్పుడు మంచి ఉద్యోగం, శాలరీ ఉన్నాయి. అయినా నాన్న కష్టపడడం ఆగలేదు. చిన్నప్పుడు ఎప్పుడైతే ఇంటి బాధ్యతలను భుజానకెత్తుకుని శ్రమయేవ జయతే అన్న మాటను నిజం చేయడం మొదలుపెట్టారో.. ఇప్పటికీ దానినే కొనసాగిస్తున్నారు.

A True Story of a Father and His Son | About Islam

నాన్న అలవాటే నాకు జీవితాన్ని ఇచ్చింది :
నాన్నకు పేపర్లు, పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ ను కచ్చితంగా చదివేవారు. పనంతా అయ్యాక..ఎంత రాత్రయినా సరే.. ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేసి.. పుస్తకాలు చదివేవారు. దానివల్ల చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. నేనూ ఆయననే ఫాలో అయ్యాను. అదే ఇప్పుడు మాకు అన్నం పెడుతోంది.

I'm your dad forever”: Single dad who adopted five siblings says what we all need to hear - Denison Forum

నువ్వు పనిచేయద్దు అని నాన్నని అన్నప్పుడు :
ఏ కొడుకైనా, కూతురైనా సరే.. తన సంపాదన మొదలుపెట్టాక.. తల్లిదండ్రులను విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. నేనూ అలాగే చెప్పాను. నా మనసు కష్టపెట్టడం ఇష్టం లేక.. సరేరా అని అప్పటికి చెప్పినా.. ఆయన మాత్రం కష్టపడడం ఆపలేదు. చాలాసార్లు కోపమొచ్చేది.. నేను సంపాదిస్తున్నా కదా.. ఇంకెందుకు మీకంత కష్టం.. మీ ఆరోగ్యం, మీ సుఖం నాకు అక్కర్లేదా.. అందుకోసమే కదా నేను చెబుతున్నా అని చాలాసార్లు చెప్పి చూశాను. అయినా ఫలితం లేదు. కాలు, చెయ్యి ఆడినంతవరకు పనిచేస్తాను.. తరువాత దేవుడి దయ అని సింపుల్ గా ఓసారి చెప్పారు.

Father Son Walking Stock Photos and Images - 123RF

నాన్నతో గట్టిగా మాట్లాడినా సరే.. :
చిన్నప్పుడు సినిమాకు వెళ్లాలన్నా.. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ప్రిపేర్ అయ్యి నాన్ను పర్మిషన్ అడిగేవాడిని. అలాంటిది.. ఇప్పుడు ఏ విషయాన్ని అయినా గడగడమని ఆయన ముందు మాట్లాడేస్తున్నా. నా మాటలు ఆయనకు కోపం తెప్పిస్తాయా.. బాధపెడతాయా అని కొన్ని సార్లు ఎమోషన్ వల్ల ఆలోచించలేకపోయాను. అయినా ఆయన బాధపడలేదు. నా బిడ్డ ఎదిగాడు అని సంతోషపడ్డారంతే. నాన్న మనసు ఎందుకంత విశాలంగా ఉంటుందో అప్పుడు అర్థం కాలేదు. నేను నాన్ననయ్యాక.. నా బిడ్డను పెంచుతున్నప్పుడు ఒక్కో విషయం అర్థమవుతోంది. నాన్న అని నా బిడ్డ పలికినప్పుడు తెలుస్తోంది.. ఆ పిలుపులో ఉన్న ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో.

Father and son planting a tree. Sunrise. Silhouette. Spring. Stock Footage,#planting#tree#Father#son | Father and son, Sons, Men boys

అప్ డేట్ కానిది నాన్నలా.. బిడ్డలా?
చిన్నప్పుడు బిడ్డలందరికీ నాన్నే హీరో. పెరిగి పెద్దయ్యాక.. సంపాదన మొదలయ్యాక.. నాన్నెందుకో వెనుకపడ్డాడని అనిపిస్తుంది. కాలంతోపాటు అప్ డేట్ కావట్లేదని కోపమొస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏ పనిలోనూ నాన్న అవసరం ఉండదు కదా. కానీ ఇక్కడ అప్ డేట్ కానిది నాన్న కాదు.. బిడ్డలే. తండ్రీ బిడ్డల మధ్య ఉండేది మనీ రిలేషన్ కాదు.. ఎమోషన్. అనుబంధాల విలువ తెలిస్తేనే.. ఆ బంధం.. ప్రేమ అనే పునాదిపై ఎంత బలంగా నిలబడిందో అర్థమవుతుంది. దీనిని తెలుసుకున్నవారికి.. నాన్న ఎప్పటికీ హీరోనే. అది తెలుసుకోలేని బిడ్డలెప్పుడూ జీరోనే.

Father's Day 2021: Want to send virtual wishes to your dad? Here's how you  can send GIFs, stickers, quotes and more. - Information News

నాన్నంటే అంత ఎమోషన్ ఎందుకు?
నాన్నంటే నిజంగానే ఓ ఎమోషన్. అమ్మలా నవమాసాలు మోయరు. కానీ వందేళ్ల జీవితాన్ని బుడిబుడి అడుగులతో ఎలా మొదలుపెట్టాలో.. ఎలా దానిని గమ్యంవైపు చేర్చాలో ఆయనకు తెలుసు. బిడ్డ వేసే ప్రతీ అడుగు వెనుక నాన్న కష్టం ఉంది. బిడ్డ సాధించే ప్రతీ విజయం వెనుక నాన్న శ్రమ ఉంది. బిడ్డ కష్టంలో, నష్టంలో, సుఖంలో, బాధలో అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. కానీ అన్నింటిలోనూ చేదుగా ఉండే కష్టాన్ని, నష్టాన్ని ఆయన తీసుకుంటారు. సుఖాన్ని, లాభాన్ని మాత్రమే మనకు పంచిపెడతారు. అందుకే ఈ జన్మలోనే కాదు.. ఎన్ని జన్మలెత్తినా నాన్న రుణం తీర్చుకోలేం. మళ్లీ జన్మంటూ ఉంటే.. ఆయన బిడ్డగానే పుట్టాలి. ఆ ప్రేమను మళ్లీ పొందాలి.

ఇవి కూడా చదవండి : 

Also Read : Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

Also Read : Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage