Off Beat

International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే..

International Yoga Day : ఒక ఆసనం.. వెన్నెముకకు ఊతమిస్తుంది. మరో ఆసనం.. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. ఇంకో ఆసనం.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి లక్షల కొద్దీ ఆసనాలు యోగాలో ఉన్నాయి. అందుకే జాతి, కుల, మత, లింగ భేదం లేకుండా.. యోగాకు పట్టం కట్టింది భారతావని. ప్రపంచమంతా.. క్యాలండర్ లో ఒక రోజును కేటాయించేలా చేసింది. అదే యోగా (International Yoga Day) ప్రత్యేకత.

International Yoga Day 2021: Theme, history, significance, how to  celebrate, quotes and everything you need to know - Information News

5000 ఏళ్ల క్రితమే మన జీవనవిధానంలో అంతర్భాగమైన అపూర్వ నిధి.. యోగ. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే.. వాటికి ప్రతీకలుగా యోగాలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అలాంటి యోగాకు పుట్టినిల్లు భారతదేశం. ఈ చిన్ని దేహంతో లక్షల కొద్దీ ఆసనాలు వేయగలమా అంటే.. వేయగలం. మన పూర్వికులు వేసి చూపించారు. నేడు ప్రపంచమంతా అనుసరిస్తున్న మోడ్రన్ యోగాకు ఫాదర్ గా చెప్పే వ్యక్తి.. తిరుమలై కృష్ణమాచార్య. ఆయనతోనే దేశంలో యోగాకు మళ్లీ పూర్వవైభవం సాధ్యమైంది. అందుకే ప్రపంచమంతా దానికి సలాం చేస్తోంది.

Father of Modern Yoga - Sri. T Krishnamacharya

 

యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. యోగా అంటే అర్థం.. ఐక్యం. మనసును శరీరంతో మిళితం చేసి ఆత్మకు చేరువ కావడమే యోగ. పౌష్టికాహారంతో శరీరాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. మరి మనసుని ఎలా? శరీరాన్ని, మనసును ఐక్యం చేయడం యోగాతోనే సాధ్యం. ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగాను ప్రస్తావించారంటే.. దాని చరిత అర్థమవుతుంది. అదే మన భవితకు పునాదులు వేస్తోంది.

Yoga's Power to Cure Depression - The Light Of Yoga

మనిషికి బతుకంటేనే భారం. పుట్టుకతోనే పుట్టెడు రోగాలు. ఇక అలాంటప్పుడు ఆరోగ్యభారతం ఎలా సాధ్యమవుతుంది? దీనికి రుజుమార్గమే యోగా. పతంజలి మహర్షి సిద్ధం చేసిన అష్టాంగ యోగ మూలం నుంచి ఈ యోగా.. విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడంటే హఠయోగ, క్రియా యోగ.. ఇలా రకరకాల పేర్లతో యోగాసనాలు వచ్చాయి. కానీ వీటన్నింటికీ మూలం.. పతంజలి మహర్షి యోగ సూత్రాలే ప్రామాణికం.

8 Incredible health benefits of Surya Namaskar - GOQii

యోగాజ్ఞాన పరోన్నిత్యం.. స యోగీ న ప్రణశ్చతే… యోగం, జ్ఞానం ఈ రెండూ కలిస్తేనే మోక్ష మార్గం. భగవద్గీతలో కిట్టయ్య చెప్పిన యోగసారం ఇదే. యోగాకు జాతి, మత, కుల, లింగ భేదం లేదు. ఇది అందరిది. అందుకే దీని లోతుపాతులను చూసి.. శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంచుకోవడానికి ప్రపంచమంతా పరితపిస్తోంది.

Benefits of Surya Namaskar (Sun Salutation) - India Parenting English |  DailyHunt

తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల మధ్యలో యోగా చెయ్యాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత అయితే కనీసం రెండు గంటలపాటు ఆగి చేయాలి. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఆహారం తీసుకున్న నాలుగు గంటల తరువాత మాత్రమే ఆచరించాలి. ద్రవపదార్థాలు తీసుకున్న తరువాత అయితే కనీసం 15 నిమిషాలు ఆగాలి.

Part 1 - Introduction to Patanjali's Yoga | Ekhart Yoga

పతంజలి యోగాలో ఎనిమిది పాదాలుంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాలో రాజ్, హఠ్, విక్రమ్, అయ్యంగార్, కుండలినీ, అష్టాంగ్, పవర్, విన్యాస్.. ఇలా చాలా రకాలున్నాయి. ఇందులో మన దగ్గర ఎక్కువగా అష్టాంగ యోగాను అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Fathers Day : నాన్న.. నిన్ను అర్థం చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది.. కానీ ఇప్పుడు…

Also Read : Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage