Off Beat

Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

Satya Nadella : హైదరాబాదీ కుర్రాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా ఎదిగారు. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్లో చదివిన సత్య నాదెళ్ల ప్రపంచంలోనే టాప్‌ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఛైర్మన్ సీట్లో కూర్చోవడమంటే మాటలు కాదు. చదువుకూ ఉద్యోగానికి సంబంధం లేకపోయినా అత్యున్నత స్థాయికి ఎదిగారు ఈ తెలుగు బిడ్డ. పడిపోతున్న కంపెనీని నిలబెట్టడమే కాదు దాన్ని నెంబర్ వన్ స్థాయికి చేర్చారంటే సత్య నాదెళ్ల (Satya Nadella) టాలెంట్‌ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది.

Nadella Satyanarayana Chowdary bio - data - Politics and Daily News - NFDB

సత్య నాదెళ్లకు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగింది, చదవింది హైదారబాద్‌లోనే. కానీ ఆయన తండ్రి స్వగ్రామం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి యుగంధర్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. వివిధ శాఖల్లో కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ముస్సోరిలోని ఐఏఎస్‌ ట్రైనింగ్‌ అకాడమికీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా ఉన్నారు. సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి సంస్కృత లెక్చరర్. ఇక సత్య నాదెళ్ల భార్య అనుపమ. ఆమె తండ్రి… అంటే సత్య మామ… కేకే వేణుగోపాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారే. నలుగురు ప్రధాన మంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసిన ఘనత వేణుగోపాల్‌ది. సత్య నాదెళ్ల హాబీస్ విషయానికి వస్తే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

Sad Satya Nadella - Vtwctr

కోరుకున్న కెరీర్ దక్కకపోతే కుంగిపోయే వాళ్లను చూస్తుంటాం. ఏమీ సాధించలేమని బాధడుతుంటారు. మరికొందరు లక్ష్యాన్ని మధ్యలో వదిలేసి రూటు మార్చుకుంటారు. సత్య నాదెళ్ల మాత్రం అలా చేయలేదు. ఏదో సాధించాలనే తపన ఆయనది. ఎంతోమంది స్టూడెంట్స్‌లాగే ఆయన కూడా ఐఐటీలో సీటు కోసం కలలు కన్నారు. కానీ అవి నెరవేరలేదు. అంతమాత్రం చేత ఆయన దిగులుపడలేదు. ఎందుకంటే ఐఐటీయే జీవితం కాదనే విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే కర్నాటకలోని మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రీకల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. తన గమ్యం ఏంటో నిర్ణయించుకున్నారు.

What do you think of Satya Nadella's comments on Citizenship Amendment Act of India(CAA)? - Quora

హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదివినవారెందరో ఉన్నారు. అయినాసరే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ స్థాయికి ఎలా ఎదిగారు? ఇదే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే దానికి సత్య నాదెళ్ల దగ్గర మాయలు మంత్రాలు ఏమీలేవు. విజయానికి షార్ట్ కట్ ఉండదు అనేది ఆయన విశ్వాసం. ఆయన పనితీరు, కమిట్మెంట్, వినూత్న ఆలోచనా విధానం… సంస్థ యాజమాన్యానికి బాగా నచ్చాయి. అందుకే సత్యకు 2014లో సీఈఓ పదవి కట్టబెట్టింది మైక్రో సాఫ్ట్ యాజమాన్యం. ఆ పదవి చేపట్టిన నాటి నుంచి ఏడేళ్లలో ఏకంగా ఛైర్మన్‌ స్థానాన్నే అప్పగించిందంటే సత్యపై యాజమాన్యానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.

Microsoft Corporation Headquarters Address, CEO Email, & More

పని బోర్‌ కొడుతుందని ఫీలయితే ఎదుగూబొదుగూ ఉండదు. కానీ సత్య నాదెళ్ల అలా కాదు. చేసే ప్రతిపనిలో కొత్తదనం వెదికారు. సంస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే మార్గాల గురించి ఆలోచించారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ దృష్టిలో పడడానికి ఇదే కారణం. అందుకే ఒకనాడు బిల్‌గేట్స్ కూర్చున్న సీటు ఇప్పుడు మన తెలుగు బిడ్డ సత్య నాదెళ్లకు దక్కింది. ఏడేళ్ల క్రితం ఆయనకు సీఈవోగా బాధ్యతలు అప్పగించగానే మన తెలుగు తేజానికి సముచిత స్థానం దక్కిందని సంబరపడ్డాం. అయితే సత్యకు మాత్రం అప్పటికి అదేమీ పూల పాన్పు కాదు. ఎందుకంటే సీఈవోగా బాధ్యతలు చేపట్టేనాటికి మైక్రోసాఫ్ట్ పరిస్థితి అంత గొప్పగా లేదు.

Microsoft names CEO Satya Nadella as chairman of the board, Technology News | wionews.com

పడిపోతున్న కంపెనీని సత్య నిలబెడతాడని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం వాళ్ల ఆలోచనలను తలకిందులు చేశారు. దాని గురించి ఆలోచించడం పక్కనపెట్టి కొత్త అవకాశాలను వెదికారు. భవిష్యత్తులో కీలకం కాబోతున్న క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఫోకస్ పెట్టారు. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మలిచారు. ఆరోజు నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం సంస్థను నెంబర్‌ వన్ స్థానంలో నిలబెట్టాయి. రాబడులూ పెరిగాయి. నాస్‌డాక్‌లోనూ కంపెనీ షేర్లు హాట్‌హాట్‌గా మారాయి. సత్య నాదెళ్ల సారధ్యంతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ షేర్ల మార్కెట్‌ విలువ రెండు లక్షల కోట్ల డాలర్లు. మన కరెన్సీలో ఆ విలువ 148 లక్షల కోట్లు. ఇంత ఘనత సాధించారు కాబట్టే ఆ సంస్థలో అత్యున్నత స్థానమైన ఛైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టారు. దానితోపాటే సీఈవో బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించాలి. ప్రతి ఇంట్లో, ప్రతి చోటా మైక్రోసాఫ్ట్‌ భాగం కావాలి అనేదే సత్యనాదెళ్ల తపన. ఇక ప్రపంచానికి పనికొచ్చే పని చేద్దాం అనేది ఆయన తారక…

ఇవి కూడా చదవండి : 

Also Read : Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage