Life Style

Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..

Romantic Love Story :  Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ట్రైన్  ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు…. వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది.

What Is True Love – How To Capture True Love

చిట్టిబాబుకన్నా ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే.. ఆయన తల్లిదండ్రులు ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు.

Best love story for Monday || romantic love story in hindi

నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. (అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి)  కాలేజీ కి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా body gaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని.

Romantic Animated Love Story Whatsapp Love Status Video

నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో propose చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఎదో వెలితి గానే ఉండేది. నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.

21, Brown and in Love with the Man I will be Marrying

ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో. ఆ తర్వాత మా నాన్నగారికి transfer అవటంతో మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు.

beautiful hearts hd wallpaper by Jac_KY - b9 - Free on ZEDGE™

ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే… ఉద్వేగంతో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే…. Yes అతనే, సీరియస్ గా Suit Case సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు.

couple hearts - mobile9 | Heart wallpaper, Heart images, Love images

నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం, full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబెట్టుకుంటూ చూస్తున్నా. ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు.

LOVE BELIEVES ALL THINGS | International Church of Christ Nigeria

చిట్టిబాబు అలా చూడగానే.. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, BP పెరిగింది. ఒకటి రెండు… అంకెలు లెక్క పెడుతున్నా.. హఠాత్తుగా అన్నాడు అతను…

” ఆంటీ, మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా కింది బెర్త్ తీసుకోండి” అని.

నాకు గుండె ఆగినంత పనైంది.

దొంగ సచ్చినోడు..
చెత్త వెధవ..
పండు గెడ్డం గాడు..
వాడి గుడ్లు పీక..
వాడికి డాష్ డాష్ రానూ..

Best Short Sad Love Stories | Tragic Ending of Love story

ఇక ఈ తిట్లకు అడ్డూఅదుపు ఉండదులెండి.. ట్రైన్ తో పాటు అవి కూడా అలానే సాగిపోతున్నాయి.

రొమాంటిక్ ఫన్నీ లవ్ స్టోరీలు.. అందులోనూ ట్రైన్ లో లవ్ స్టోరీలు ఇలానే ఉంటాయిలెండి.

ఇవి కూడా చదవండి : 

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

Also Read : ఈ అమ్మడు.. అందాలతో కుమ్మేసింది..!

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Ananya Nagalla Latest Pics

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage