Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..
Cinema Latest

Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..

Krithi Shetty: ఇంతకు ముందు నటీనటులు ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా.. వారికి గుర్తింపు వస్తుందో రాదో అన్న గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.. డెబ్యూ మూవీ హిట్ అయితే చాలు.. స్టార్ స్టేటస్.. స్టార్లతో ఛాన్స్ ఈజీగా వచ్చేస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికే ఆ స్టార్ స్టేటస్‌ను అనుభవించేస్తున్నారు. అందులో ఒకరు కృతి శెట్టి (Krithi Shetty).

Krithi Shetty
Krithi Shetty

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో పాటు డెబ్యూ చేసింది కృతి శెట్టి. లాక్‌డౌన్ తర్వాత విడుదలయిన ‘ఉప్పెన’.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ను సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్, మనసుకు హత్తుకుపోయే లవ్ స్టోరీగా ‘ఉప్పెన’ చాలామందికి ఫేవరెట్ అయిపోయింది కూడా. అందులోనూ ముఖ్యంగా ఉప్పెనతో కృతి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అందుకే ఆఫర్లన్నీ తనకోసం, తన డేట్ల కోసం క్యూ కడుతున్నాయి.

Krithi Shetty
Krithi Shetty

రెండు సినిమాలు వరకు కృతి శెట్టి రెమ్యునరేషన్ కూడా ఓ డెబ్యూ హీరోయిన్‌కు ఉన్నట్టుగానే ఉంది. కానీ ఉన్నట్టుండి మూడో సినిమా నుండి ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ భామ. కృతి శెట్టి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు కూడా పారితోషికానికి ఏమీ వెనకాడట్లేదు అని సమాచారం. పైగా కృతి తన రెండో సినిమా నుండే బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ చేయడానికి వెనకాడకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.

Krithi Shetty
Krithi Shetty

ఇప్పటికే కృతి మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించగా.. ఆ మూడు సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. దీంతో కుర్ర హీరోలంతా కృతినే కావాలని అనుకుంటున్నారు. తాజాగా మరో యంగ్ హీరోతో కూడా కృతి నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన చేతిలో ఉన్న సినిమాలతో నిమిషం కూడా ఖాళీ లేకుండా గడిపేస్తున్న కృతి.. మరో సినిమా సైన్ చేయడం అంటే మామూలు విషయం కాదని ఫిల్మ్‌నగర్‌లో టాక్.

Also Read: https://www.sirimalli.com/samantha-and-pooja-hegde-gets-trolled-for-misspelling-success/

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో క్లీన్ హిట్‌ను అందుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు శర్వానంద్. ప్రస్తుతం తన చేతిలో ‘ఒకే ఒక జీవితం’ సినిమా మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తెరకెక్కబోయే తన అప్‌కమింగ్ చిత్రం కోసం కృతి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేసిందట మూవీ టీమ్. యంగ్ హీరోలతోనే జతకడుతూ కృతి టాప్ ప్లేస్‌కు చేరుకుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.