Varsha Bollamma: అలాంటి సినిమా చేయడం చాలా కష్టం: వర్ష బొల్లమ్మ
Cinema Latest

Varsha Bollamma: అలాంటి సినిమా చేయడం చాలా కష్టం: వర్ష బొల్లమ్మ

Varsha Bollamma: ఒకప్పుడు నటీనటులు తమ క్యారెక్టర్ సెలక్షన్‌కు కొన్ని పరిధులు పెట్టుకునేవారు. ఒకవేళ కొత్త క్యారెక్టర్ ఏదైనా చేయాలన్నా.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంలో ఉండేవారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థుతులు మారిపోయాయి. అందుకే ఓ యంగ్ బ్యూటీ కమెడియన్‌గా నటిస్తూ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.

Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/

వర్ష బొల్లమ్మ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే.. అరె.. ఎవరు ఈ అమ్మాయి..? అచ్చం నజ్రియాలాగా ఉందే అనిపించుకుంది. మెల్లగా తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. చెప్పుకోవడానికి పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు ఏమీ తన ఖాతాలో లేకపోయినా.. తన క్యూట్‌నెస్‌తో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వర్ష చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందులో ఒక మూవీలోని క్యారెక్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన వర్ష.. కొన్నాళ్లకు కమర్షియల్ సక్సెస్ రాక సెకండ్ హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలను కూడా వదులుకోలేదు. తెలుగు, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది వర్ష. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’లో తను చేసిన పాత్రను తెలుగు రీమేక్‌ ‘జాను’లో కూడా చేసింది. అలా తెలుగువారికి పరిచమయ్యింది.

‘జాను’లో వర్ష క్యూట్ లుక్స్‌కు ఇంప్రెస్ అయిన మేకర్స్.. తనకు యంగ్ హీరోల సరసన ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో జతకట్టిన తర్వాత ప్రస్తుతం వర్ష.. బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్‌‌తో సినిమా చేస్తోంది. ఈ గ్యాప్‌లో రాజ్ తరుణ్‌తో ‘స్టాండప్ రాహుల్’ అనే యూత్‌ఫుల్ మూవీలో నటిస్తోంది.

రాజ్ తరుణ్ ప్రస్తుతం సినిమాలు చేయడంలో చాలావరకు స్పీడ్ తగ్గిపోయింది. ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ఇందులో హీరో మాత్రమే కాదు.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా స్టాండప్ కమెడియన్‌గానే కనిపించనుంది. అయితే ఈ సందర్భంగా కామెడీ చేయడం చాలా కష్టమంటూ వర్ష చెప్పుకొచ్చింది. వెన్నెల కిషోర్‌లాంటి నటుడితో కలిసి కామెడీ చేయడమంటే అంత ఈజీ కాదని తెలిపింది. ఇప్పటివరకు ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్‌గా నటించి ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు వర్ష ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది.