2024-06-23 03:43:36
Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 22-08-2021 నుంచి 28-08-2021 వరకు – Sirimalli.com

Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 22-08-2021 నుంచి 28-08-2021 వరకు

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (Weekly Horoscope) అనగా 22-08-2021 నుంచి 28-08-2021 వరకు కింది విధంగా ఉన్నాయి.

వార ఫలాలు – మేషం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. అన్నిరంగాల వారికి ఉత్సహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యటంకములు కలుగుతాయి. దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమౌతాయి. గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి స్వల్ప. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.కొన్ని పనులలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది అన్నిరంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్ధిరాస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్యలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు అందుతాయి.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. స్ధిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారంలో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అన్నిరంగాలవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి నవగ్రహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశకలిగిస్తాయి. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమున ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్ధిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. అన్నిరంగాల వారికీ అదనపు పనిఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారి యత్నాలు ముందుకు సాగవు. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహమున చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. సుబ్రమణ్య స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరుతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాలవారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు తొలగుతాయి.అనారోగ్య సమస్యలు నుండి బయట పడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్నిరంగాల వారి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (22-08-2021) నుండి (28-08-2021) వరకు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికీ కొత్త సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి పొందుతారు. సోదరుల నుంచి సహాయ సహకార అందుతాయి హయగ్రీవ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : H2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం

Also Read : మీ పిల్లలకు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ఇస్తే.. ఆరోగ్యం, హుషారు రెండూనూ!

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

sirimalli facebook page