2024-07-27 09:41:47
Today Horoscope : 23-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 23-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 23-08-2021 సోమవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (23-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.ఆప్తుల నుండి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

వృషభ రాశి (Taurus) :

చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మిధున రాశి (Gemini) :

సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక సమస్యలుకలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటక రాశి (Cancer) :

ఇంటా బయట పని ఒత్తిడి అధికమై మానసిక సమస్యలు కలుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది.

సింహ రాశి (Leo) :

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సఖ్యతగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి (Virgo) :

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra)

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. గృహమున విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకర రాశి (Capricorn) :

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశకలిగిస్తుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి.

కుంభ రాశి (Aquarius) :

నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ప్రయత్నాలు సాగిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. సంతానం వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీన రాశి (Pisces) :

ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి.ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read :Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 22-08-2021 నుంచి 28-08-2021 వరకు

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage