2024-07-27 04:59:00
h2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం – Sirimalli.com

h2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం

h2o :

గెలవాలంటే లక్ష్యం కావాలి
జీవించాలంటే స్ఫూర్తి కావాలి
ప్రేమించాలంటే నమ్మకం కావాలి
బతకాలంటే లౌక్యం తెలియాలి

ఇవన్నీ కావాలన్నా.. సాధించాలన్నా కసి ఉండాలి. పట్టుదల చూపించాలి. నిరంతర ప్రయత్నం జరగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. స్ఫూర్తి కలుగుతుంది. నమ్మకం కుదురుతుంది. లౌక్యం తెలుస్తుంది. ఆ విషయం శ్రీలత కోరాడకు బాగా తెలుసు. ఎందుకంటే పుస్తకాల్లో పాఠాలే ఉంటాయి. కానీ జీవితంలో అనుభవాలు ఉంటాయి. అవి ఎంత విలువైనవో చెప్పడానికి ఆమె జీవితమే ఉదాహరణ. అందుకే ఉద్యోగం కోసం దేశం దాటినా.. కుటుంబం నేర్పించిన విలువలను మర్చిపోలేదు. సాయం చేసే సహజ గుణాన్నీ విడిచిపెట్టలేదు. ఎక్కడి శ్రీకాకుళం.. ఎక్కడి అమెరికా. 20 ఏళ్ల కిందటే ఆమె అమెరికాకు విమానం ఎక్కినా.. అంతా సమానం అనే సూత్రాన్ని వదలలేదు. అందుకే 2017లో H2O (Help to others) మన కళ్లముందు నిలిచింది. అప్పటి నుంచి పేదలకు చేయూతనిస్తోంది. ఎందరికో అండగా నిలుస్తోంది. మరెందరికో స్ఫూర్తిని ఇస్తోంది.

h20 help to others srilatha korada
h20 help to others srilatha korada

గౌతమబుద్ధుడు చెప్పినట్టుగానే : గౌతమబుద్ధుడు ఓ మాట అంటాడు. అన్ని విషయాలను తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఏది గుర్తుంచుకోవాలో, ఏది వదిలేయాలో తెలిపేది వివేకం. అందుకే వివేకం లేని జ్ఞానం.. వ్యర్థం. అది శ్రీలత కోరాడకు బాగా తెలుసు. దీనికోసమే పరోపకారం చేసే విషయంలో ఎవరు ఏమన్నా పట్టించుకోరు. పైగా వాటిని పునాదులుగా మలుచుకుని అందనంత ఎత్తుకు ఎదుగుతారు. శ్రీలత కోరాడ స్వస్థలం శ్రీకాకుళం దగ్గరలో ఉంటుంది. ఆ తరువాత వాళ్ల కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. ఆమె నాన్నగారు సివిల్ ఇంజనీర్. అందుకేనేమో ఆమె ఐడియాలన్నీ చాలా కనస్ట్రక్టివ్ గా, స్ట్రాంగ్ గా ఉంటాయి.

h20 help to others srilatha korada
h20 help to others srilatha korada

కుటుంబం అండదండలు :  శ్రీలత భర్త సాయిబాబా కోరాడ ఐటీ ఆర్కిటెక్ట్. వీరికి ఇద్దరు ఆణిముత్యాల్లాంటి అబ్బాయిలు. ఇద్దరూ స్కూల్ స్టడీస్ లో ఉన్నారు. తల్లిదండ్రుల మనసును బట్టే పిల్లలూ నడుచుకుంటారు. భార్య ఉద్యోగం చేసి జీతం తెస్తే చాలు అనే భర్తలున్న ఈరోజుల్లో.. భార్యకున్న సేవాగుణాన్ని గౌరవించి, ఆమె పనులకు వనరులు సమకూర్చి, చేయూతనిస్తూ, చేదోడువాదోడుగా నిలిచారు సాయిబాబా. తల్లిదండ్రుల మాట, బాట ఒకటే అయినప్పుడు పిల్లల రూటు కూడా అదే అవుతుంది. వీరి కుటుంబంలోనూ అదే జరిగింది.

h20 help to others srilatha korada
h20 help to others srilatha korada

సేవ చేసేవారికే స్నేహ హస్తం : సేవ చేస్తామంటే.. వీర తిలకం దిద్ది, స్వాగతం పలికి, పూల దండలు వేసి, చప్పట్లు కొట్టి అభినందించే రోజులు కావివి. సేవ చేస్తారా.. అంటే మీకేదైనా పర్సనల్ ప్రాఫిట్ ఉంటుందా అంటూ సవాలక్ష ప్రశ్నలు, కోటి సందేహాలతో చూసే కాలమిది. అయినా సరే.. ఆలోచన మంచిదైతే అవరోధాలు వచ్చినా వజ్ర సంకల్పంతో వాటిని అధిగమించవచ్చు. సమాజానికి సేవ చేయాలనుకున్న శ్రీలతకు ఇది అనుభవంలో అర్థమైంది. సేవ చేయాలంటే డబ్బు కావాలి. మనీ కోసం వాక్ థాన్, మ్యూజికల్ షో ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసేవాళ్లు. అలా సమకూరిన మొత్తాన్ని అర్హులకు అందజేయడం అసలైన పరీక్ష. ఎందుకంటే డబ్బుందని తెలిస్తే.. రాబందులు వాలిపోతాయి. అందుకే సామాజిక సేవ చేసేవారినే స్నేహితులుగా చేసుకున్నారు. మన దేశంలో సాయం చేసే మనసున్న మహానుభావులకు స్నేహహస్తం అందించారు.

May be an image of 18 people

ఒంటరిగానే తొలి అడుగు : మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిగానే పడుతుంది. వెనుక వచ్చేవారికి అది బాటగా మారుతుంది. శ్రీలత తొలి అడుగు అలాగే పడింది. ఐదేళ్ల కిందట ఆమె సాయం వ్యక్తిగతంగానే ఉండేది. తొలుత వాలంటీర్ గా వెళ్లి తనకు చేతనైనంత సహాయం చేసేవారు. ఆమె సేవామార్గాన్ని చూసి.. మిగిలినవాళ్లూ తలో చేయి వేశారు. అలా స్వచ్ఛందంగా, సేవాస్ఫూర్తితో వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆ తరువాత కొలంబస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్లు. ఆపై సర్వీస్ వింగ్ పెడతామని అడిగిందే తడవు.. వాళ్లు ఓకే చెప్పారు.

h20 help to others
h20 help to others

h20 ఆవిర్భావం : సాయానికైతే అందరూ ముందుకు వచ్చారు. డబ్బూ సమకూరింది. మరి దానిని ఎవరికి అందించాలి? ఎలా అందించాలి? ఇది చాలా పెద్ద పరీక్ష. అందుకే భారత్ లో ఉన్న స్కూల్స్ తోపాటు, మిగిలినవారికి సహాయం చేద్దామని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి.. దానికి H2O అని పేరు పెట్టారు. ఈ సంస్థలో ఒక్కో ఏడాది ఒక్కో టీమ్ మారిపోతుంది. దీనివల్ల సేవా కార్యక్రమాలకు ఇబ్బంది రాకూడదని తలచి.. ఈ సంస్థను రిజిస్టర్ చేశారు. ఫౌండర్ మెంబర్ గా ఆమే ముందడుగు వేశారు.

h20 help to others  h20 help to others

జీరో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ : h20 help to others జీరో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తో వెళ్లడమే H2O ధ్యేయం. దీనివల్ల మిగిలే ఒక్క డాలరైనా, ఒక్క రూపాయి అయినా మరొకరికి ఉపయోగపడుతుందన్నదే శ్రీలత ఆశ, ఆశయం. డబ్బిస్తారు అంటే అర్హత లేకపోయినా అర్రులు చాచే వాళ్లకు కొదవేలేదు. భారత్ లోనూ ఇలాంటివారు ఎందరో. ఎన్ఆర్ఐలకు ఫేక్ ఫోటోలను పంపించి డొనేషన్స్ ను వసూలు చేసుకునేవాళ్లూ తక్కువేం కాదు. ఇలాంటి మోసాల బారిన పడకుండా.. ప్రతీ రూపాయిని అర్హులకు అందించేందుకు అన్ని జాగ్రత్తలను తీసుకుంది శ్రీలత కోరాడ టీమ్.

h20 help to others  h20 help to others

h20 help to others

బాధితులకు నేరుగా సాయం  : సాయం చేసేవాళ్లు, ఆ సహాయాన్ని అందుకునేవారు.. ఇద్దరికీ బాధ్యత ఉండాలి. అందుకే శ్రీకాకుళం జిల్లాలో కొంతమందికి జీవనోపాధి కోసం ఆవులను ఇచ్చారు. తాము ఆ ఆవులను అమ్మబోమని, కేవలం వాటిద్వారా వచ్చే పాడిని మాత్రమే జీవనావసరాలకు ఉపయోగించుకుంటామని ముందుగానే వాళ్ల నుంచి హామీ తీసుకున్నారు. ఇక్కడ ఈ ఇద్దరి మధ్యా ఉండాల్సింది నమ్మకం. అది ఉంది కనుకే.. ఈ యజ్ఞంలో ఒక్కో అధ్యాయం.. దిగ్విజయంగా నడుస్తోంది. మరో సందర్భంలో ఓ బాధితురాలు ఫ్లోర్ మిల్లు కావాలని కోరింది. దీంతో ఆ మిల్లును తయారుచేసే కంపెనీతో నేరుగా మాట్లాడి.. వాళ్లకే ఆర్డర్ ఇచ్చి.. బాధితురాలు కోరుకున్న చోట దానిని ఏర్పాటుచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. ఎక్కడా అర్హులకు వీళ్లు నేరుగా డబ్బులు ఇవ్వరు. కేవలం వస్తురూపంలో మాత్రమే సహాయం చేస్తారు. అది కూడా వీళ్ల టీమ్ సభ్యులే స్వయంగా వెళ్లి ఆ సహాయాన్ని అందిస్తారు. అందుకే ఎక్కడా అవకతవకలకు చోటే లేదు.

No photo description available.May be an image of 4 people

 

 

 

 

 

 

 

 

 

 

 

భారత్ లో సహాయం ఎలా అంటే : మిణుగురు పురుగు రెక్కచాటు వెలుగుకు.. కాళరాత్రి అయినా వెన్నుచూపాల్సిందే. కాంతిరేఖ దారిచూపాల్సిందే. అందుకు అలుపెరుగని శ్రీలత ప్రయత్నమే నిదర్శనం. ఖమ్మం దగ్గర కల్లూరు ఫారెస్ట్ లో తోపుడు బండి నిర్వాహకులు ద్వారా.. ఆ ప్రాంతంలో విద్యుత్, మంచినీటి వసతి లేనివారికి పౌష్టికాహారంతోపాటు ఇతర సదుపాయాలను సమకూర్చారు. మంచినీటికోసం ఓ బృహత్తర యజ్ఞాన్నే కొనసాగించారు. కొన్ని గ్రామాలకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికీ ప్లాన్ చేశారు.

May be an image of 3 people, people standing and outdoors  May be an image of 6 people, people standing and outdoors

మంచి నీటి కోసం మహా యజం : అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆకలితో ఉన్నవారికి పెడితే అది అమృతంతో సమానం. అందుకే నిజామాబాద్ లోని ఫుడ్ బ్యాంక్ సంస్థ ద్వారా కూలీలకు భోజనాలు, మంచినీటిని అందించారు. ఏజెన్సీల్లో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. వారికి ట్రైనింగ్ ఇప్పించారు. దీంతో వాళ్ల జీవితాలే మారిపోయాయి. ఇప్పుడు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడ్డారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు.

కరోనా కష్టకాలంలోనూ :  ప్రభుత్వాలు, పెద్ద మనుషుల సాయం ఆగిపోయిన దగ్గర వీళ్ల సహాయం మొదలవుతుంది. అది ఎంతోమంది పేదవారికి బతుకుబాట చూపుతోంది. ఆకలి తీరుస్తోంది. అండగా నిలుస్తోంది. దీనివల్లే కరోనా కష్టకాలంలో కూడా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ లు, మిగిలిన సదుపాయాలను కల్పించడానికి ప్రయత్నించారు. ఎంతోమంది బాధితులకు సాయం చేశారు.

May be an image of 6 people

ఆశయ రథ సారధులు : ఆలోచన మంచిదైతే ఆచరణకు పంచభూతాలు సహకరిస్తాయి. ఇక్కడా అదే జరిగింది. ఐటీ మేనేజర్ గా చేస్తున్న శ్రీలత కోరాడ ఈ సంస్థలో ఫౌండర్ మెంబర్ గా ఉన్నారు. ఆమెతోపాటు ఆమె భర్త సాయిబాబా కోరాడ, ఇంకా శ్రీకాంత్, శ్రీలత.ఆర్ కూడా ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. సాయిబాబా కోరాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తున్నారు. కొలంబస్ నుంచి స్వప్న, విష్ణు అవినాష్, కనిక, ఆనంద్ టీం మెంబర్స్ గా ఉన్నారు. అట్లాంటా నుంచి శ్రీకాంత్, సునీత, శ్రీవల్లి సభ్యులుగా ఉన్నారు. మానస్ కోరాడ యూత్ వింగ్ ని లీడ్ చేస్తున్నారు. భారత్ లో సాయి, వాసు, జగత్, రామయ్య నిజామాబాద్ నుంచి విజయానంద్.. శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వనజ, రత్నకుమారి ఈ టీమ్ లో సభ్యులుగా ఉన్నారు. అవసరాన్ని బట్టి, కార్యక్రమాలను బట్టి మరికొందరు బృహత్తర యజ్ఞంలో భాగస్వాములవుతారు.

h20 help to others srilatha korada
h20 help to others srilatha korada

మహిళ తలచుకుంటే  : జీవితం అంటే మనల్ని మనం తెలుసుకోవడం మాత్రమే కాదు.. మనల్ని మనం నిర్మించుకోవడం. ఓ ఇంజనీర్ కుమార్తెగా, ఓ ఐటీ ఆర్కిటెక్ట్ భార్యగా, ఐటీ మేనేజర్ గా శ్రీలత కోరాడకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తనని తాను తీర్చిదిద్దుకుంటూ, తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ, H2Oని విస్తరిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది ఆమె లైఫ్ జర్నీ. శ్రీలత కోరాడ తన పయనంలో మరిన్ని విజయాలు సాధించాలని, అవి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని sirimalli.com మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

May be an image of 2 people and people smiling

H2O Facebook Link : https://www.facebook.com/HelpToOthersUSA/

Founding members: Srilatha, Saibaba, Srikanth, Srilatha R

Current team: Srilatha Korada – founder, president, voice

Saibaba Korada : Executive Director

Suneetha Potnuru – Atlanta chapter lead

Swapna Jilkar – Columbus chapter lead

Vishnu – Event Lead

Manas Korada – Youth lead

Atlanta team: Suneetha, Srikanth, Srivalli

Columbus Team: Swapna, Vishnu. Avinash, Kanika, Aanand

India team: Vijayanand, Ratnakumari, Vanaja, Sai, Jagath, Ramaiah

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (01-08-2021 నుంచి 07-08-2021 వరకు)

Also Read : Today Horoscope : 02-08-2021 సోమవారం… నేటి రాశిఫలాలు..

Also Read : Today Panchangam : 02-08-2021 సోమవారం … నేటి పంచాంగం…