KCRకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి..?

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ కాస్త జోష్ పెంచారు. యమ దూకుడుగా వెళ్తున్నారు. మరోపక్కా ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలుపెట్టారు.

టీఆర్ఎస్ పైన గుర్రుగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా, రాజకీయంగా మంచి పట్టున్న తుమ్మల నాగేశ్వరరావుని పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారని,అందుకు తుమ్మల కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన తుమ్మల.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మంలో పోటీ చేసిన తుమ్మల పువ్వాడ అజయ్ పై ఓడిపోయారు.

KCR congratulates Thummala on Palair win

ఆ తర్వాత సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి మంత్రిని చేశారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల. ఇక 2018 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నడిచిన తుమ్మల మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో మీరు వేసిన ఓటు బురదలో వేసినట్టే అయిందని ఆ మధ్య కామెంట్స్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు తుమ్మల.

Also Read :

తాజాగా పార్టీ కార్యక్రమాలకి కూడా ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు. మరోవైపు జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో.. తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనికి తోడు… పాలేరులో జరిగిన ఓ సభలో తుమ్మల తనయుడు మాట్లాడుతూ.. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా విమర్శలు చేశారు.

ఈ విమర్శలు తుమ్మల పార్టీ మారుతారనే ఊహాగానాలకి మరింత బలం చేకురుస్తున్నాయి. మరి టీఆర్ఎస్ కి మొండి చేయి చూపించి హస్తం వైపు వెళ్తారా లేదా అన్నది చూడాలి.