Today Horoscope: ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచన.. వివిధ రాశుల ఫలితాలు

Today Horoscope : ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచన.. వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు

SREE KRUPA (03-09-2021) రాశి ఫలితాలు

మేషం –  03-09-2021

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక  లావాదేవీలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది.

వృషభం –  03-09-2021

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు   బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలుచేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కార దిశగా  సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

మిధునం –  03-09-2021

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దైవ సేవ  కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగ వాతావరణం  గంధరగోళంగా ఉంటుంది నిరుద్యోగ  ప్రయత్నాలు మందగిస్తాయి.

కర్కాటకం –  03-09-2021

గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులకు శుభ కార్య ఆహ్వానాలు అందిస్తారు.   చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన  లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.

సింహం –  03-09-2021

గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.  ఇంటాబయటా అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.   ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు.

కన్య –  03-09-2021

దీర్ఘకాలిక రుణాలు తీర్చాగలుగుతారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి.

తుల –  03-09-2021

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో ఒక కొల్లిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు.  నిరుద్యోగ ప్రయత్నాలు  అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం –  03-09-2021

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలోఅధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు –  03-09-2021

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది l ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు. బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మకరం –  03-09-2021

నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో వివాదాల సర్దుమణుగూతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత  ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం –  03-09-2021

ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి  సన్నిహితుల సాయం అందుతుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను  పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత  ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత  పెరుగుతుంది.

మీనం –  03-09-2021

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి  ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి.

 

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)