KCR : ఢిల్లీకి సంతోష్ రావు వెళ్లారు.. మరి హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు?
Latest Politics

KCR : ఢిల్లీకి సంతోష్ రావు వెళ్లారు.. మరి హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు?

KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రెండు రోజుల ముందే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.

ముహూర్త సమయానికి సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి భూమిపూజ‌ చేశారు. అంత బాగానే ఉంది కానీ ఫ్రేమ్ లో ఎదో చిన్నబోయింది. అదే మంత్రి హరీష్ రావు.. పార్టీ పుట్టినప్పటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్.. పార్టీ శంకుస్థాప‌న‌ భవన్ కి హాజ‌రుకాక‌పోవ‌డం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

May be an image of 5 people and people standing

హరీష్ కావాలనే డుమ్మా కొట్టారా? లేక‌ ఆయన్ని ప‌క్కన పెట్టేశారా? అన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఢిల్లీకి ఎంపీ సంతోష్ రావుతో కలిసి వెళ్ళిన కేసీఆర్… హరీష్ రావును మాత్రం తీసుకెళ్ళలేదు. దీనితో సంతోష్ రావుకి ఉన్న విలువ హరీష్ రావుకి లేదా? అన్నది హాట్ టాపిక్ అయింది. పార్టీ ఆవిర్భావం నుంచి హరీష్ పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ లో నెంబర్ 2 హరీష్ అన్న పేరు కూడా ఆయనకీ ఉంది.

ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనే టాస్క్ ని హరీష్ పైన పెట్టారు కేసీఆర్. ఆ పనుల్లో బీజీగా ఉన్న హరీష్ అందుకే ఢిల్లీలో పార్టీ భవన్ పూజ కార్యక్రమానికి వెళ్ళలేదన్నది పార్టీ కార్యకర్తల మాట.

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page