2024-07-14 01:07:15
Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా.. – Sirimalli.com

Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

నలభై కొస్తే బండి బోరింగ్ కు వచ్చేస్తోంది ఎందుకు ?

షుగర్ , బిపి , కిడ్నీ సమస్యలు , లివర్ సమస్యలు , గుండె సమస్యలు థైరాయిడ్ , అధిక బరువు , కాన్సర్ , అంటు రోగాల భయం ….. నలబై లో పడితే ఈ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి . (Immune Food )

Average male lifestyle Stock Photos - Page 1 : Masterfile

చదువు , ముగించుకొని ఉద్యోగం సంపాదించి లేదా వ్యాపారం ప్రారంభించి , పెళ్లి చేసుకొని ఒకరో ఇద్దరో పిల్లలకు జన్మ నిచ్చి కాస్త జీవితం లో స్థిరపడ్డాము అనుకొనే లోపే నలబై వచ్చేస్తుంది . ఈ లోగా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఒకటో రెండో చుట్టుముడతాయి . ఇక అటుపై జీవితాంతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మందులు మింగుతూ బోనస్ గా మరో ఒకటో రెండో ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం పరిపాటిగా మారుతోంది .

రోగం వస్తే ఆసుపత్రులు .. మందులు .. తప్పవు . వ్యాధి నివారణ చికిత్స కన్నా మంచిది కదా ? ఆరోగ్యమే మహా భాగ్యము . ఆరోగ్య జీవన విధానాన్ని అనుసరించలేరా ?

పెద్దగా ఖర్చులేకుండా మీ ఆరోగ్యం కోసం మీరు తప్పకుండ పాటించాల్సిన దినచర్య .

ఇది కేవలం నలబై లో పడిన వారికే కాదు . అన్ని వయసుల వారికీ !

1 . పెందలకడ నిద్ర పోండి. ఎప్పుడో ఒకసారి అయితే లేట్ నైట్ పరవాలేదు . కనీసం 10 గంటలకు నిద్ర పొయ్యేలా చూడండి . కనీసం ఎనిమిది గంటల నిద్ర పెద్దలకు అవసరం . వేకువ జామున లేవండి . మైండ్ ఫ్రెష్ గా వుంటుంది . ఆ రోజు మీరు చెయ్యాల్సిన విషయాల గురించి ఆలోచించండి . చక్కటి నిర్ణయాలు తీసుకొనే వీలుదొక్కుతుంది . పాజిటివ్ థాట్స్ వస్తాయి . బాగా నిద్ర పోయి వేకువ జామున లేస్తే ఇమ్మ్యూనిటి బలపడుతుంది .

Itamar's new capabilities include disposable sleep apnea test, subjective sleep data | MobiHealthNews

2 . రాత్రి పడుకొనే టప్పుడే మీ బెడ్ రూమ్ లో రాగి చెంబు లేదా కాపర్ వాటర్ బాటిల్ లో ఒక లీటర్ నీరు ఉంచండి . పొద్దున్న లేచిన వెంటనే కనీసం అర లీటర్ నీరు తాగండి . దీని వల్ల మలవిసర్జన సులభం అవుతుంది . రోజుకు కనీసం నాలుగు లీటర్ ల నీరు తాగాలి . పిలల్లు రెండు లీటర్ లు . నూటికి తొంబై శాతం మంది తగినంత నీరు తాగరు. అనేక ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం .

3 . సగటున మనిషికి రోజుకు ఒక టీ స్పూన్ ఉప్పు అవసరం . పొద్దున్న సాంబార్ / చట్నీ తో మొదలు పెట్టి రాత్రి కర్రీ దాక మీ శరీరం లోకి కనీసం నాలుగు స్పూన్ ల ఉప్పు వెళుతోంది . నూటికి తొంబై అయిదు మంది అధిక ఉప్పు తీసుకొంటున్నారు . బీపీ మొదలు కాన్సర్, హృద్రోగం .. ఇలా అనేక అనారోగ్యాలను కొని తెచ్చుకొంటున్నారు . ఉప్పు తగ్గించండి . ఉప్పు లేని కూర లు తిన లేము . నిజమే . కానీ ఇలా చెయ్యండి .

Immune Food :
Immune Food :

పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కు వారం లో కనీసం రెండు మూడు రోజులు మొలకెత్తిన పెసలు తినండి . ఇందులో ఉప్పు ఉండదు . మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్ ఇంకా విటమిన్లు, పోషక విలువలు , పీచు సమృద్ధిగా వుంటుంది . వారం లో మరో రెండు రోజులు మిల్లెట్ అన్నం లేదా బ్రౌన్ రైస్ సద్ది తినండి . రాత్రి వండిన అన్నం చల్లారాక నీరు పోయండి . అన్నం రాత్రంతా నీటిలో నానడం వల్ల ఆర్సెనిక్ లెవెల్స్ తగ్గిపోతాయి . మన ఉదరానికి అవసరం అయిన మేలు చేసే బాక్టీరియా అందులో చేరుతుంది . మలేషియా యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో సద్ది అన్నం వల్ల గుండె సమస్యలు , డయాబెటిస్ , కాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుందని నిరూపితం అయ్యింది .

జామ కాయ మామిడి కాయ తినేటప్పుడు వాటిని అలాగే ఎంజాయ్ చెయ్యండి . ఉప్పు కలపొద్దు . పెరుగు అన్నం బాగా నమిలి తింటే ఉప్పు లేకున్నా కమ్మగా ఉంటుంది . ఇలా వారం అలవాటు చేస్తే మీరు ఉప్పు వేసిన పెరుగు అన్నం తినడానికి ఇష్టపడరు .

vitamin--d
      vitamin–d

4 . ప్రపంచ వ్యాప్తంగా నగరాల్లో నివసించే మధ్య తరగతి ప్రజల్లో నూటికి ఎనబై మంది లో డి విటమిన్ లోపం తీవ్రంగా ఉంటుంది . డి విటమిన్ లోపం వల్ల గుండె సమస్యలు , సులభంగా అంటు రోగాల బారిన పడడం, జుట్టు రాలిపోవడం , అలసట , వొళ్ళు నొప్పులు , గాయాలు సులభంగా మానకపోవడం, కీళ్ల నొప్పులు , ఎముకల సమస్యలు లాంటి అనేకం వస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కరోనా మరణలో అధిక శాతం డి విటమిన్ లోపం వల్ల జరిగినవే . నేడు కరోనా చికిత్స లో ప్రధానాస్త్రం డి విటమిన్ టాబ్లెట్స్ . డి విటమిన్ కోసం ఖర్చు పెట్టనక్కర లేదు .

Morrning Walking
 Morrning Walking

రో జూ ఇరవై నిముషాలు సాయంకాలం నాలుగు గంట సమయం లో లేదా ఉదయం ఎనిమిది గంటల సమయం లో కనీసం ఇరవై నిముషాలు ఎండలో నడవండి . శరీరానికి డి విటమిన్ అందుతుంది . ఇంకా వ్యాయామం కూడా . వేగంగా నడవాలి . చేతులు ఆడిస్తూ నుదిటి పై చెమట వచ్చే దాక నడవాలి . నడిచేటప్పుడు సెల్ ఫోన్ తో మాట్లాడం లేదా పక్క వారి తో మాట్లాడడం చేయొద్దు . ఇలాంటి వ్యాయామాన్ని కార్డియో అంటారు . ఇది కొవ్వు ను కరిగిస్తుంది . షుగర్ ను తగ్గిస్తుంది . బిపి ని కంట్రొల్ లో ఉంచుతుంది . గుండె సమస్యలను నివారిస్తుంది .

Immune Food :
Immune Food :

5 . రోజూ ఆహారం లో సమృద్ధిగా ప్రోటీన్ లు తీసుకోండి . ఎదిగే పిలల్లకు గర్భిణీ స్త్రీలకు మరింత ఎక్కువ మొత్తం లో ప్రోటీన్ అవసరం . మీరు తీసుకోవలసిన దాని కంటే అయిదు రెట్లు ఎక్కువ ఉప్పు ను తింటున్నారు . అదే ప్రోటీన్ విషయానికొస్తే అవసరమైన దానిలో కనీసం ఇరవై శాతం తీసుకోవడం లేదు . నూటికి తొంబై మంది ప్రోటీన్ లోపం తో బాధ పడుతున్నారు . దీని వల్ల ఇమ్మ్యూనిటి దెబ్బతింటుంది . పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది . లివర్ సంబంధ సమస్యలు కూడా రావొచ్చు . చికెన్ , ఫిష్ , ఎగ్ వైట్ , ఇంకా శాఖాహారం లో మొలకెత్తిన పెసలు , పన్నీర్ మొదలైనవి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు . జామ కాయ లో ఎక్కువ మొత్తం లో ప్రోటీన్ ఉంటుంది .

vitamins
vitamins

6 . ఆహారం లో రోజూ ఆకుకూరలు ఉండేలా చూసుకోండి . ఆకుకూరల్లో A , సి , కే విటమిన్లు ఇంకా ఐరన్ కాల్షియమ్ లాంటి పోషకాలు ఉంటాయి . దీని వల్ల రక్తం లో ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి . ఎముకలు బలపడతాయి . ఆకుకూరల్లో పీచు ఎక్కువగా ఉంటుంది . మలబద్దకం , ఉదర కాన్సర్ లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయుక్తం .

Immune Food :
Immune Food :

7 . ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తీసుకోండి . షుగర్ వ్యాధి తీవ్రంగా ఉన్న వారిని మినహాయిస్తే పళ్ళు అందరికీ అవసరం . పళ్లలో అనేక విటమిన్ లు , మినరల్స్ ఇంకా పీచు ఉంటాయి . డయాబెటిస్ , కాన్సర్ , హృద్రోగము , సరీరం లో వాపు లాంటి అనేక అనారోగ్య సమస్యలను ఇది దూరంగా ఉంచుతుంది . పళ్లలో బెస్ట్ జామపండు . మామిడి , నేరేడు , పనస , సపోటా ఇలా ఆయా కాలాల్లో దొరికే పళ్ళు సమృద్ధిగా తినండి . దానిమ్మ అరటి లాంటి పళ్ళు ఇటీవల ప్రమాదకర రసాయనాలతో వస్తున్నాయి . ఇలాంటి వాటి విషయం లో జాగ్రత్త .

Immune Food :
Immune Food :

8 . ప్రతి రోజు ఆహారం తో పాటు ఖీరకాయ ముక్కలు తినండి . ఇందులోని అంటాక్సిడాంట్ కాన్సర్ నుంచి రక్షణ నిస్తాయి . బరువు తగ్గడానికి CUCUBER అదే ఖీర ఉపయోగపడుతుంది . బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది . మలబద్దకం సమస్యలను నివారిస్తుంది .

9 . మసాలాలు తీసుకోండి . కానీ తక్కువ మొత్తం లో . ఎక్కువ తీసుకొంటే అసిడిటీ అల్సర్ లాంటి సమస్యలు వస్తాయి . అలాగే కారం కూడా .. తక్కువ మొత్తం లో తీసుకోండి . పిజ్జా బర్గర్ కోలా లు అసలు వద్దు .పిల్లలకు ప్యాకెట్ లో దొరికే పొటాటో చిప్స్ ఇన్స్టంట్ నూడుల్స్ వద్దు . ఇంటి వంటలు లేదా స్వగుహ ఫుడ్స్ ఓకే . అది కూడా అప్పుడప్పుడు . రోజూ కాదు . బతకడం కోసం తినాలి . తినడం కోసం బతకడం కాదు .

ఎప్పుడో పండగలు పబ్బాలు ఉంటే చిరు తిళ్ళు ఓకే . రోజు కాదు . తినడం ఒక భోగం గా మారితే రోగం ఖాయం . బటానీలు , నువ్వుండలు , వేరుశెనిగ చిక్కి , బెల్లం ముక్కలు కలిపిన శనిగెలు , బాదాం , ఎండు ద్రాక్ష , ఖర్జూర ఇల్నాటివి డైనింగ్ టేబుల్ పై జార్ లో ఉంచండి . సాయంకాలం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఈటిని ఒకటో రెండో తీసుకోండి. పిలల్లకు కూడా లావాటు చెయ్యండి . షుగర్ ఉన్న వారు స్వీట్స్ తీసుకోవద్దు .

10 . పిల్లలకు అప్పుడప్పుడు చాకోలెట్స్ ఓకే . చక్కర విషం . బెల్లం తో చేసిన స్వీట్స్ అప్పుడప్పుడు తినొచ్చు . మైదా కూడా విషం . తెల్ల అన్నం , మైదా , చక్కర , అధిక ఉప్పు .. ఇవి వైట్ పాయిజన్స్ . తెల్ల అన్నం తగ్గించండి . మైదా, చక్కర వద్దు . ఉప్పు రోజుకు ఒక స్పూన్ మాత్రమే .

11 . మన ఆలోచనలే ఆరోగ్యం . నాలుగేళ్ళ పిల్లల మొఖం నిర్మలం గా ఉంటుంది . కారణం వారిలో నెగటివ్ థాట్స్ వుండవు . కొంత మంది నిర్మలంగా కనిపిస్తారు . వారు ఆరోగ్యవంతులు . జీవితం లో ఉద్యోగం వ్యాపారం లాంటి వాటికీ సంబంధించి వచ్చే సమస్యలు చాలవా ? టీవీ సీరియల్స్ రాజకీయ చర్చ , ఉద్రేక పరిచే వీడియో గేమ్ ల రూపం లో డబ్బిచ్చి ఉద్రేకాలను కొని తెచ్చుకోవాలా ? మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్ వినండి . హాస్య కార్యక్రమాలు చూడండి . పెంపుడు జంతువులతో , పిల్లలతో ఆడుకోండి.

ఆహారమే ఆరోగ్యం .. ఆహారమే విషం .. ఛాయస్ మీదే .

మన ఆలోచనలే మన ఆరోగ్యం .. మన భవిత ! నిర్ణయం మీదే .

ఇవి కూడా చదవండి : 

Also Read : Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

Also Read : Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Mahabharata Success Story On Coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage