Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

విశ్వాసం (చిన్న కధ ) Inspirational Story :

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది, ” నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? ” అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న – మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.

వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -అలాగే చూడసాగింది ఆ అమ్మాయి. అలా 20 నిముషాలు మరిగించాక – స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ‘ అలా ఎందుకు చేసాడా పని..’ అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది, ” ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది…….. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. ” అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

” ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..

వీటిల్లో – నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. ) గట్టిపడిపోతావా..? పరిస్థితులను మారుస్తావా…?

ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది..” అన్నాడు. ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..

నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్..” కృతజ్ఞతాభావంతో అంది.  Inspirational Story :

ఇవి కూడా చదవండి : 

Also Read : Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Mahabharata Success Story On Coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage