Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Corona Virus : కొన్ని రోజులుగా పరిస్థితిని చూసి.. అంటే రోడ్డుమీద పరిస్థితులు మాత్రమే కాదు.. ఆసుపత్రులు, గవర్నమెంట్.. సిస్టమ్ లో పరిస్థితిని చూసి చెబుతున్నా (Corona Virus).. జాగ్రత్తగా ఉండండి..

భయపడండి.. కరోనా రాకముందే భయపడండి. మనకు వస్తుందేమో అన్న భయంతో సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా.. రాకుండా ఉండటానికి చూసుకోండి. అంటే.. మన పనులు, ఉద్యోగాలు మానుకోమని నేను చెప్పడం లేదు. నిర్లక్ష్యంగా ఉండొద్దు.

Face Masks Do Not Cause 'Overexposure' To Carbon Dioxide - mfame.guru

భయపడకండి.. భయమనేది ముందే ఉండాలి… కానీ వచ్చాక భయపడొద్దు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా వచ్చే అవకాశం ఉంది.. ( జాగ్రత్తగా ఉంటే వచ్చే అవకాశం తగ్గుద్ది..) కరోనా వచ్చిన తర్వాత మనం భయపడితే ఆ ప్రభావం మన ఇమ్యూనిటీ మీద పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లో భయపడొద్దు. మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది.

Immunity | Zee News Telugu

పిల్లలు చాలా కాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. కొన్నాళ్లుగా వాళ్లని బయటకు ఆడుకోవడానికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఆపేయండి. కుదిరితే.. మార్నింగ్ ఒక అరగంట.. లేత ఎండ వారి మీద పడేలా చూడండి. టెర్రస్ పైనో..ఇంటి ముందరో.. జనాలతో కలవకుండా నడిపించండి.

 morning sunrise
morning sunrise

విటమిన్ డి చాలా అవసరం. శాఖాహారులు విటమిన్ B12 కోసం ఆల్టర్నేటివ్ ఫుడ్, సప్లిమెంట్స్ చూసుకోండి. జాగ్రత్త… ఐదు రోజుల క్రితం నా ఫ్రెండ్ బ్రదర్ కు కరోనా వచ్చింది. మైల్డ్ సింప్టమ్స్ కదా.. అని ఆసుపత్రిలో చేరలేదు. ఆయనకు వేరే చిన్న సమస్యలున్నాయి. కానీ అదే సీరియస్ అయింది… ఇవాల్టి పరిస్థితుల్లో మీకు ఏ ఆసుపత్రిలో కూడా బెడ్ దొరకదు. తన కోసం.. అత్యున్నత పొలిటికల్ ప్రెజర్ ఉపయోగించినా బెజవాడలో బెడ్ దొరకలేదు. రెండు రోజులు ఎదురు చూసి.. అత్యవసరంగా.. హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది.

Vitamin D and Diabetes - Types, Effects, Deficiency & Health Benefits

మీకు ఏమైనా రెస్పిరేటరీ డిసీజ్, అలెర్జీ, బీపీ, షుగర్ లాంటివి ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కనీసం ఆన్ లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోండి.

గుర్తుపెట్టుకోండి… కరోనా మనల్ని నేరుగా చంపదు. పరోక్షంగా మాత్రమే దానివల్ల చనిపోతాం. కరోనాకు మన రోగనిరోధకవ్యవస్థ ఎలా స్పందిస్తుంది.. అన్న దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువుగా స్పందించినా.. తక్కువుగా స్పందించినా సమస్యే.. !

 

Clonal Selection Theory – An Immunological Breakthrough - The Oxford Scientist

కరోనా మరణాల్లో 90శాతం మన రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువుగా స్పందించడం వల్లే చనిపోయారు. కరోనాను ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ… ఎక్కువుగా స్పందిస్తే..వచ్చే “సైటోకైన్ స్టార్మ్ ”  వల్ల ప్రాణాలు కోల్పోతాం.. మనల్ని కాపాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టం.. ఎక్కువుగా స్పందించడం వల్లనే ఇది జరుగుతుంది.

మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా స్పందిస్తో.. మీకు తెలుసా.. ? తెలీదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. ! మాస్కు పెట్టుకోండి..! చివరగా… వాట్సప్​లో వచ్చే ప్రతీదీ నమ్మేయకండి. ముఖ్యంగా కర్పూరాన్ని గుడ్డలో కట్టుకోండి .. కందగడ్డను ఒంటికి చుట్టుకోండి.. వంటి Trash ను నమ్ముకుని.. రిస్కు చేయొద్దు.

COVID-19 is pushing Indians to rely on 'immunity-boosting' brands and home remedies - The Economic Times

Home Remedies మన ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి.. కాదనడం లేదు. మన ఇంట్లో వాడే.. గార్లిక్, పసుపు, వంటి వాటిల్లో యాంటీ యాక్సిడెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లు ఉంటాయి. కానీ.. అవన్నీ రోగం రాకముందు మన శరీరాన్ని సిద్ధం చేయడానికి. రోగం వచ్చాక.. అలాంటివి సరిపోవు. మెడిసిన్ కావాలి. వాటిని నమ్ముకుని రిస్కులో పడొద్దు.

Be Strong..,. Be Safe.

Nagesh GV

ఇవి కూడా చదవండి : 

Also Read : Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also Read : Corona Virus : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Also Read : Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage