2024-07-27 10:38:15
Today Horoscope : 17-05-2021సోమవారం నేటి రాశిఫలాలు…. – Sirimalli.com

Today Horoscope : 17-05-2021సోమవారం నేటి రాశిఫలాలు….

Today Horoscope : 17-05-2021 సోమవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (17-05-2021) రాశి ఫలితాలు

మేషం :

గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారుల నుండి నిందలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

వృషభం :

సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి ఇంటా బయట అంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఊహించిన మార్పులుచోటుచేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

మిధునం :

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహమున శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

కర్కాటకం :

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలుగుతుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం :

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలతో నష్టాలు తప్పవు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి.

కన్య :

అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. దూరప్రాంతం నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు నూతనప్రోత్సాహకాలులభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల :

సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. పాత రుణాలు కొంతవరకు తీర్చగలరు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం :

దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు :

వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడంమంచిది. ప్రారంభించిన పనులు మందగిస్తాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

మకరం :

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దాయాదుల తో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందు కుంటారు. ఉద్యోగమున అనుకూలవాతావరణం ఉంటుంది.

కుంభం :

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఇంటాబయటా విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకుసేవకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

మీనం :

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులుఎదుర్కొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలలో కొంతమంది ప్రవర్తన విసుగు కలిగిస్తుంది సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read :  Today Horoscope : 16-05-2021సోమవారం నేటి రాశిఫలాలు….

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage