2024-07-27 05:35:29
Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (25-05-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (25-05-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి! (25-05-2022)

 

SREE KRUPA (25-05-2022) రాశి ఫలితాలు

మేషం – 25-05-2022

Today Horoscope : కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూరప్రయాణ సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.

వృషభం – 25-05-2022

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మిధునం – 25-05-2022

ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

కర్కాటకం – 25-05-2022

పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

సింహం – 25-05-2022

రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

కన్య – 25-05-2022

స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

 తుల – 25-05-2022

సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం – 25-05-2022

అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి.

ధనస్సు – 25-05-2022

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం – 25-05-2022

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం – 25-05-2022

ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బందికలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం – 25-05-2022

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

——————————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో తిరుగులేదు! (22-05-2022 నుంచి 28-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page