Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!
Bhakthi Latest

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

మాస ఫలాలు – మేషం

Monthly Horoscope for May 2022 : మే మాస రాశిఫలాలు – 2022 రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి వస్తుంది నేత్ర శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి గృహనిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. మాసాంతమున శుభకార్యాలకు హాజరవుతారు అవసరానికి ఏదోవిధంగా ధన సహాయం లభిస్తుంది. ప్రతి గురువారం గోవుకు శనగలు దాణాగా పెట్టాలి. దుర్గా ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – వృషభం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది అవసరానికి బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు సజావుగా సాగుతాయి చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. మాసాంతమున దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి మానసికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ప్రతినిత్యం సూర్యనమస్కారాలు చేసుకోవడం,ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మిథునం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్య మూలకంగా ధనవ్యయం చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటుండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యత కలుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. శనివారం ఒకటింపావు కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – కర్కాటకం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా అవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. ఇంటాబయట గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహమున శుభకార్య నిర్వహణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. మాసం మధ్యలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. మంగళవారం రోజు కేజీ పావు కందులు దానంగా ఇవ్వడం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – సింహం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో ఆచితూచి మాట్లాడటం మంచిది. ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో ఫలితాన్ని పొందుతారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. మాసం చివర పరిస్థితులు కొంత వరకు అనుకూలిస్తాయి ఆర్థికంగా సమస్యల నుంచి బయటపడతారు మంగళవారం ఒకటింపావు కేజీ కందులు, గురువారం ఒకటింపావు కేజీ సెనగలు దానంగా ఇవ్వడం. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – కన్య

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా లేదు. నేత్ర శిరో సభంధిత ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికాక మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మాసం మధ్యలో గృహమున ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసం చివరలో ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి ఆదివారం ఒకటింపావు కేజీ గోధుమలు దానం ఇవ్వడం విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మాస ఫలాలు – తుల

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాసం ప్రారంభం లో చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. మాసం మధ్యనుండి కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారుల సహాయంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఉలవలు కేజీ పావు మంగళవారం దానం ఇవ్వడం. గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – వృశ్చికం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ప్రతీ వ్యవహారంలోనూ ధైర్యంగా నిర్ణయాలు అమలుపరచి లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారునూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారస్థులకు విశేషమైన లాభాలు అందుతాయి. మాసం చివర నా ఇతరులు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – ధనస్సు

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కుటుంబసభ్యులు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. భాగస్వామి వ్యాపారాలలో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుతాయి. మాసం చివర గృహమును కొన్ని సంఘటన ఆశ్చర్యం కలిగిస్తాయి ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు శనివారం ఒకటింపావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించడం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మకరం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాస ప్రారంభంలో అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది ధనాదాయ విషయంలో లోటుపాట్లు ఉండవు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు నుండి కొంత వరకు ఉపశమనం కలుగుతుంది మాసం మధ్యనుండి దూర ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మందకొడిగా సాగుతాయి ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. శనీశ్వర స్వామి శనివారం తైలాభిషేకం చేయించడం ఒకటింపావు కేజీ నల్ల నువ్వులు శనివారం దానంగా ఇవ్వడం. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – కుంభం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. వివాదాలకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ కలలు సాకారం అవుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివర నా దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్త్రీ సంబంధిత వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శనివారం ఒకటింపావు కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శనీశ్వర స్వామి తైలాభిషేకం చేయించడం. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మీనం

మే మాస రాశిఫలాలు – 2022 ఈ రాశివారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉండదు. కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని nబాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మానసికంగా తలచి వేస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడుల విషయంలో లోటు పాట్లు తప్పవు. మాసం చివర నా దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. గురువారం ఒకటింపావు కేజీ సెనగలు దానంగా ఇవ్వడం. శనివారం ఒకటింపావు కేజీ మినువులు దానంగా ఇవ్వడం. దుర్గా స్తోత్రం. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com
Girish kulakarni purohithulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఈ వారం ఈ రాశుల వారికి తిరుగులేదు (01-05-2022 నుంచి 07-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page