Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

SREE KRUPA

సంవత్సర ఫలాలు – మేషం

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

మేషరాశి ఫలితములు

 

అశ్వని 1, 2, 3, 4 పాదములు (చూ, చే, చో, లా)

 

భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)

 

కృత్తిక 1వ పాదము (ఆ)

* ఆదాయం-14 ఖర్చు-14 * పూజ్యత-3 * అవమానం-6

 

మేషరాశి గ్రహ సంచార సారాంశము

Horoscope 2022: గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు ద్వాదశ స్థానమగు మీనరాశియందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు ఏకాదశ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు దశమ స్థానమగు మకరరాశియందు వక్రముగా సంచారము – 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు పునః కుంభరాశియందు ఏకాదశ స్థానమున శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు లగ్నమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు సప్తమ స్థానమగు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం – అశ్వనీ నక్షత్రజాతకులు వైడూర్యము, భరణి, నక్షత్రజాతకులు వజ్రము. కృత్తికవారు కెంపు ఉంగరములు ధరించుట మంచిది. ఈ రాశివారికి 2-3-8-9-11 అదృష్టసంఖ్యలు, ఆది, మంగళ, బుధ, శనివారములు అదృష్టవారములు. స్టార్ నెం. 9.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు గ్రహముల బలముచే ఆరోగ్యము బాగుగాయుండును.
విద్యా వ్యాపార ఉద్యోగ పదవులందు అభివృద్ధితో ధనముతో యుందురు, చిన్న చిన్నవైరములు కూడా రావచ్చును. ధనయోగముచే కొన్నిసార్లు ఇబ్బందులు అనుభవిస్తారు.పాత బాకీలు కొన్ని తీర్చగలరు. సూర్యుని యొక్క ఈ నెలయందు ఆదివారము రోజున27 సార్లు ప్రదక్షణములు చేస్తే మనోవాంఛలు అనుకూలిస్తాయి.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు దురాశతో చేసే పనులు వికటిస్తాయి. వృత్తియందు కలతలు పొందుతారు. భార్యాభర్తలు ఆనందముతో యుండుట మంచిది. పాత బాకీలు కొన్ని తీర్చెదరు.ప్రయాణములు తగ్గించుట మంచిది. ఇంటియందు నేత్ర బాధలు వస్తాయి. ఉద్యోగములందు ధనాదాయము బాగుగాయుండును. అంగారునకు మంగళవారము 11 ప్రదక్షణములు చేసి కందులు కొన్ని దానము బ్రాహ్మణులకు ఇస్తే మీ సంతాన సమస్యలు తీర్చగలరు.

2022 మార్చి – ఈ నెలయందు ఆర్ధిక లావాదేవీలు అనుకూలము. దూర ప్రయాణములు చేస్తారు. ప్రణాళిక ప్రకారము నడచుట మంచిది. ఇంటియందు చికాకులు రావచ్చును. ఈ నెలయందు కొంచెము రుణములు చేయవచ్చును. విలువైన వస్తువులు ఖరీదులు చేస్తారు. కొన్ని నష్టములు కూడా రావచ్చును. వృత్తి వ్యాపారాదులందు ఆలోచనలు అధికము. స్థిరాస్థి వలన సమస్యలు అధికము. అందుచే శనివారము రోజున శని గ్రహమునకు 27 ప్రదక్షణములు చేసి 1/2 కేజి నువ్వులు దానము ఇస్తే శని దోషము పోయి ఆనందాన్ని పొందుతారు.

2022 ఏప్రియల్ – ఈ నెలయందు ఉద్యోగములో ఉన్నత స్థితి ఉంటుంది. వ్యాపారములో అధిక లాభాలు వస్తాయి. మిత్రులతో కలసి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కుటుంబ సభ్యుల మేలు అనుకూలము. గృహ భూ వాహన యోగములు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి. వ్యాపార ఉద్యోగ వృత్తి సామాన్య జనుల బాధలు కొన్ని తొలగిపోగలవు. అందుచే దుర్గాదేవి కి కుంకుమ పూజ, ప్రదక్షిణములు 21 శుక్రవారము చేస్తే ఆరోగ్యము బాగుగా ఉంటుంది.

2022 మే – ఈ మాసమునందు సామాన్య ధనప్రాప్తి కొన్ని విషయములు అనుకూలము. కొన్ని వ్యవహారములు వేధించును. బంధుజన మృతులు అధికము. తరచు ప్రయాణములు చేస్తారు. పిల్లల వివాహ బంధములు చదువులు కొన్ని ఇబ్బందులు చేస్తాయి. సామాన్య యోగము ఈ నెలయందు నడుచును. శ్రీకాళహస్తి వెళ్ళి దేవుని దర్శించుకొనుట మంచిది. గొప్ప అవకాశాలు వస్తాయి.

2022 జూన్- ఈ నెలయందు ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది. దైవ నిర్ణయాలు చేసి కార్యక్రమములు ప్రారంభించండి. వృత్తియందు వ్యాపారము నందు చేతి వృత్తుల యందు కొంచెము వడిదుడుకు పనులు జరుగుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి మీ పనులు సాగుతాయి. పట్టు విడుపులు అవసరము. ప్రశాంత జీవనము లభిస్తుంది. బుధవారం రోజున బుధ గ్రహ పూజలు చేసి 21 ప్రదక్షణములు చేస్తే పెసలు దానము ఇస్తే కార్యములన్నియునూ పూర్తికాగలవు. సందేహమే లేదు.

2022 జూలై- ఈ నెలయందు గ్రహ స్థితి అనుకూలము. రాజకీయ వ్యవహారములు జయము. వృత్తి ఉద్యోగములందు సంతృప్తి కలుగును. స్త్రీ మూలకంగా కలహములు వచ్చును. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్థాయి. అదృష్ట కాలము నడుస్తుంది. పెద్దల సహకారము అందుతుంది. ఈ నెలయందు లక్ష్మీ స్థుతి మేలునిచ్చును. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు చేయగలరు. వ్యాపారబలము బాగుగాయున్నది. జాగ్రత్త వహించుట మంచిది.

2022 ఆగష్టు- ఈ నెల యందు శుభ కాలం. కొన్ని పనులు ఆటంకములు వస్తాయి. పిల్లల చదువులు అనుకూలము. అన్ని పనులూ సాగిపోతాయి. ధనము కొరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొహమాటము ప్రక్కకు పెట్టి కార్యదీక్షతో ముందుకు సాగుము. శ్రీ రామనామం జపము ముఖ్యము. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు తగిన లాభాదులు పొందగలరు. ఆరోగ్యము బాగుగాయుండును. పెద్దల ఆరోగ్యము తరచుగా బాధించును. ధనవ్యయము అధికముగా చేయగలరు.

2022 సెప్టెంబర్ – ఈ నెలయందు ప్రతి పనిని కూడా ఆలోచించి చేయండి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురు వస్తాయి. తోటివారి సహాయము అనుకూలము. మిత్రుల సహాయముతో ధనాన్ని సేకరిస్తారు. గృహలాభయోగములు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా తగు జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణములు చేస్తారు. నవగ్రహముల స్తోత్రము చదవండి. కొన్ని శుభాలు కలుగుతాయి. మనము చేయు పనిలో ఆనందమును అనుభవించెదరు.

2022 అక్టోబర్ – ఈ నెలయందు ప్రతి వ్యవహారమునందు సత్ఫలితము కలుగును. ఆర్ధికంగా కొంత మేలు లభించును. అసలు ధనము వస్తుంది. రావలసిన బాకీలు వస్తాయి. దగ్గరవారితో విరోధములు వస్తాయి. అందుచే శ్రీ వెంకటేశ్వర గుడికి వెళ్ళి ప్రదక్షణములు గాయించి సంతృప్తి పొందండి. ఇంటియందు భార్యా పిల్లలు ఆనందముగాయుంటారు. ధనము వృత్తియందు ఉద్యోగములందునూ చేతి వృత్తులయందు బాగుగానే వస్తాయి. దూర ప్రయాణములు చేయుట మంచిది.

2022 నవంబర్ – ఈ నెలయందు ఆర్ధిక అంశాలు బాగుగాయున్నాయి. సంకల్పము సిద్ధి బాగుగాయున్నది. శ్రేష్ఠమైన ఫలితములు వస్తాయి. ఆరోగ్యము బాగుగాయుంటుంది. ఉద్యోగములో ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీ లాభాలు కొన్ని వస్తాయి. గురుధ్యానము చేయండి. విద్యా సంబంధిత పనులు పూర్తియై విజయము సాధించెదరు. కోర్టు మున్నగు వ్యాపారములు అనుకూలిస్తాయి.

2022 డిసెంబర్ – ఈ నెలయందు ధనలాభముంది. కీర్తి పెరుగుతుంది. లక్ష్య సిద్ధిని సాధించెదరు. ఉద్యోగ పరంగా స్వల్ప శ్రమ తప్పదు. వారాంతములో శుభాలు వింటారు. పిల్లల చదువులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లలు బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించవచ్చును. జీవిత సాఫల్యము ఆలోచించాలి. వృత్తి ఉద్యోగ పనులు సక్రమముగా నడచును. ఈ నెలయందు శ్రీశైల దేవుని దర్శించుకొనుట మంచిది. కొన్ని శుభములు కలుగుతాయి.

జనవరి:- ఈ నెలలో కూడా అందరికీ బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నూతనవస్తు,వస్త్రప్రాప్తి, ప్రయాణాలుకలసివచ్చును. పాతమిత్రులను, బంధువులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్లో లాభించును. సంతోషకర వార్తలు వింటారు. నూతన పరిచయాలు లాభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది.

ఫిబ్రవరి:- ఈ నెల యందు కూడా అనుకూల వాతావరణమే. చేతి వృత్తి వ్యాపారాలు అనుకూలించును. ఆర్ధిక సమస్యలుండవు. ఆరోగ్యం బాగుంటుంది. వాహన సౌఖ్యం. గతంలో ఉన్న సమస్యలు తొలగును. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంతన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం. మాసాంతములో అంత అనుకూల ఉండదు. ధనం మంచినీళ్ళవలె ఖర్చుఅగును. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే.

మార్చి:- ఈ నెలలో వ్యయమందు గ్రహసంచారము వలన అన్ని రంగముల వారికి అనుకూలం ఉండదు. ఆదాయమునకు మించిన ఖర్చులు. శుభమూలకధనవ్యయం. వాహనం రిపేర్లు చేయవలసి వచ్చును. సంతానం పరీకలు బాగా వ్రాయుదురు. కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులు వలన నష్టములు. భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

===============================

సంవత్సర ఫలాలు – వృషభం

వృషభ రాశి ఫలితములు 

కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)

రోహిణి 1,2,3,4 పాదములు (ఓ,వా,వీ,వూ)

మృగశిర 1,2 పాదములు (వే,వో)

* ఆదాయం-8 ఖర్చు-8 పూజ్యత-6 * అవమానం-6.

 

వృషభరాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు ఏకాదశమున మీనరాశియందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు దశమ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు నవమ స్థానమగు మకరరాశి యందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు దశమ స్థానమగు కుంభము నందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు ద్వాదశమున మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు షష్టమ స్థానమగు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం – కృత్తిక వారు కెంపు, రోహిణి వారు ముత్యము, మృగశిరవారు పగడము ఉంగరములు ధరించుటచే కార్యసిద్ధిని పొందుతారు. ఈ రాశివారికి 1-2-5-6-9 అదృష్ట సంఖ్యలు, శని, బుధ, శుక్ర, సోమవారములు అదృష్టవారములు, స్టార్ నెం. 6.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు ఆర్ధికంగా మేలు జరుగుతుంది. రావల్సిన బాకీలు వస్తాయి. వృత్తియందు ధనలాభము ఉద్యోగము నందు శ్రమ చికాకులు ఉంటాయి. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. గౌరవ మర్యాదలు అనుకూలము. శుభవార్తలు వింటారు.ముఖ్య పనులు బుధవారములు చేయండి. పాత బాకీలు వసూలు అవుతాయి.ఈశ్వర దర్శనము చేసుకోండి. కొంత ఆరోగ్యము ప్రాప్తించును.

2022 ఫిబ్రవరి – ఈ నెల చాలా కాలంగా దాగియున్న కోర్కెలు పూర్తి చేస్తారు. ప్రత్యర్ధులు శాంతిని వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు చురుగ్గాయుంటాయి. ఆశించిన ప్రయోజనము దరిలోయున్నది. పిల్లల చదువులు అనుకూలము. వివాహ సమస్యలు పూర్తి చేస్తారు. దేవుని దయతో కొన్ని శుభవార్తలు వింటారు. లోగడ వాయిదా పనులన్నియునూ పూర్తి చేస్తారు. బాల్య మిత్రులను కలుస్తారు. మాతృవర్గము అనుకూల దనము అందించును. పోలేరమ్మ గుడికి ఆదివారం వెళ్లి పొంగళ్ళు పెట్టి ప్రదక్షణములు చేస్తే శుభములు అధికము. అనుకున్నది సాధించెదరు.

2022 మార్చి – ఈ నెల యందు వివాహ నూతన ఉద్యోగాలు ఊపందుకొంటాయి. కొన్ని పనులు కూడా పూర్తి కావచ్చును. కొత్త మార్పులు వస్తాయి. ఆర్థిక లావాదేవి నిదానముగా జరుగును. సోదర వర్గముతో శుభవార్తలు వింటారు. ఇంటాబయట ప్రాబల్యము పెరుగును. ధనవ్యయము కూడా చేస్తారు. భార్యా అనుకూలంగా మెలగును. నూతన బాధ్యతలు వృత్తియందు రావచ్చును. శుక్రవారము పాండురంగ స్వామి దగ్గరకు వెళ్లండి. కొంత మేలు కలుగును.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు ఆచితూచి అడుగు వేయాలి. ఆర్ధిక నష్టాలు రావచ్చును. అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని ఉపయోగించండి. వ్యవహారములు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యము మందగిస్తుంది. దగ్గరలో విజయ మార్గమున్నది. ఉద్యోగరీత్యా బదిలీలు అవకాశములున్నాయి. దైవ బలము రక్షిస్తుంది. లక్ష్మీనారాయణ పూజ శుక్రవారము చేయండి. అనుకున్న పనులు అగును. ఆర్ధికంగా మరింత జాగ్రత్త వహించుట మంచిది.

2022 మే – ఈ నెలయందు గృహాభివృద్ధి సామాగ్రి ఖరీదులు చేస్తారు. ప్రయాణములు లాభాదాయకముగాయుంటుంది. పంతాలకు పట్టింపులకు వెళ్ళవద్దు. ఆస్థి కొనుగోలు విషయంలో ప్రగతి సాధిస్తారు. శుభకార్య వ్యయము అధికము, స్థానచలనము కూడ వచ్చును. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. స్వల్ప ధన లాభములతో ఈ నెలయందు అనుభవిస్తారు. ఈ నెలయందు షిరిడి సాయిబాబా పూజలు చేస్తే అనుకున్న కార్యక్రమములు నెరవేరుతాయి.

2022 జూన్ – ఈ నెలయందు పిల్లల విద్యాభివృద్ధి కలుగుతుంది. ధనవృద్ధి కలుగును. వృత్తి ఉద్యోగములందు గౌరవ మర్యాదలు పొందుతారు. శతృవులచే కొన్ని బాధలున్ననూ అవి క్రమేపి తొలగిపోవును. వస్తువుల అమ్మకము కొనుగోలు చేస్తారు. మంచి ఆభరణములు తెచ్చెదరు. ప్రభుత్వ జనుల కలయిక, దుష్టుల కలయిక, అధిక శ్రమ కల్గించుకుంటారు. ఈ నెల యందు లక్ష్మీ నారసింహ దేవాలయము వెళ్ళి పూజలు చేయండి. ఆరోగ్య సమస్యలు తీరును, బాధలు తొలగును.

2022 జూలై – ఈ నెలయందు మానసిక భయము మనఃకేశము కొంత కలుగుతాయి. ఆర్ధిక పుష్టిని పొందుతారు. వృత్తి, వ్యాపార ఉద్యోగములందు చైతన్యవంతముగా అభివృద్ధిని ఆర్థిక వృద్ధిని పొందగలుగుతారు. జాయింటు వైరములు రావచ్చును. స్త్రీల బాధలు కొన్ని రావచ్చును. వ్యతిరేక వాదములు కలుగును. అందుచే లలితా సహస్రనామ పారాయణము 15 రోజులు చేయించుట మంచిది.

2022 ఆగష్టు – ఈ నెలయందు అనుకోని ఆపదలు వస్తాయి. భూ వసతులు పెరుగును. ధనవ్యయము చేస్తారు. ధనము నిఖ్ఖచ్చిగా ఖర్చు పెట్టెదరు. బంధు విరోధములు కొన్ని రావచ్చును. విదేశీయులతో సంచారము. విదేశీ బంధువులతో స్నేహము చేస్తారు. వ్యవహార విజయం కలుగుతుంది. వ్యాపార శ్రమ పెరుగుతుంది. గృహ లాభయోగము లభిస్తుంది. అందుచే సత్యసాయి షిర్డిసాయి దేవాలయమునకు వెళ్ళి నామ పారాయణము చేయండి.

2022 సెప్టెంబర్ – ఈ నెలయందు ఆందోళనములు స్థాన చలన మార్గములు స్త్రీల సమస్యలు రావచ్చును. నెల మధ్యలో వ్యాపారోద్యోగ వృత్తి యోగములన్నియు బాగుగాయుండగలవు, విందు వినోదములు పొందెదరు. వాక్కాఠిన్యముతో గుమాస్తాల మీద కోపముతో నుంటారు. కార్యములను సాధించి మనోవాంఛ నెరవేరుస్తారు. జాయింటు వ్యాపారాలు అచ్చిరావు, స్త్రీలకు ఆరోగ్య చర్చ బాగుగా జరుగుతుంది. శ్రీ కలియుగ వెంకటేశ్వర దేవాలయమునకు వెళ్ళి పూజలు పూర్తి చేస్తే త్వరగా మీ పనులు ముందుకు సాగుతాయి.

2022 అక్టోబర్ – ఈ నెలయందు అభివృద్ధి మార్గంలో పయనించెదరు. కాంట్రాక్టులందు స్పష్టత వస్తుంది. పెద్దల వద్ద వినమ్రతతో వ్యవహరిస్తూ పనులను పూర్తి చేసుకోవాలి. మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవబలము రక్షించుకుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ఆర్ధిక బలమును పుంజుకుంటారు. చేయని తప్పునకు నిందలు నిందారోపణములు అనుభవించెదరు. భ్రమరాంబా దర్శనము ఒక్కసారి చేస్తే నిందరోపణములు తొలగిపోవును.

2022 నవంబర్ – ఈ నెల యందు ధార్మిక మార్గాలు ఆచరించెదరు. బంధువుల రాక ఉంటుంది. ఈ రోజు చేయు పనులు అనుకూలము. కొద్ది రోజుల్లో ప్రయాణములు అచ్చిరావు. ఆర్ధిక భారము అధికము. గృహములో శుభకార్యాలు చేయాలని ఆలోచించెదరు. నూతన స్త్రీలతో కలయికలు ఉంటాయి. షేర్ మార్కెట్ ధరలు అధికము. నిలబాటు పనులను పూర్తి చేయండి. తిరుపతమ్మ గుడికి వెళ్ళి మొక్కులు కట్టండి. కొన్ని దోషాలు తొలగును.

2022 డిసెంబర్ – ఈ నెల యందు మహిళలకు వృత్తి వ్యవస్థనందు కఠినముగా వ్యవహరించేదరు. అధికారుల వలన అగౌరవము పొందుతారు. మిత్రురాండ్రతో వైరములు రావచ్చును. కుటుంబములో మాట విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయాలందు జాగ్రత్త అవసరము, హృదయ శూల ఆరోగ్యము బాధించవచ్చును. నవగ్రహ పూజలు పూర్తి చేయుట మంచిది. నవగ్రహ పూజా ప్రదక్షణములు చేయుట మంచిది.

జనవరి:- ఈ నెలలో కొంతమేరఫర్వాలేదనిపించును. వృత్తి వ్యాపారాదులు బాగుండును. ఆర్ధిక సమస్యలుండవు. దూరప్రయాణాలు. పాతమిత్రులతో కలిసి విందులు, వినోదాలు. స్పెక్యులేషన్లో మాత్రం నష్టపోవుదురు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. బంధుమిత్రుల సహాయసహకారములు లభించును. కుటుంబ సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం.

ఫిబ్రవరి:- ఈ నెలలో జన్మకుజుడు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూల సంచారంవల్ల చేయువృత్తి వ్యాపారాలు అనుకూలత. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి నిచ్చును. ఉష్ణజ్వరపీడలు. భార్యకుకూడా కొంత అనారోగ్యం. గృహసంబంధ పనులు పూర్తి చేయుదురు. వివాహాది శుభకార్యాలకు హాజరగుదురు. సంతాన సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యవహారానుకూలత. ఆర్ధిక సమస్యలు ఉండవు.

మార్చి:- ఈ నెలలో అనుకూల గ్రహ సంచారం వల్ల చేయు వృత్తి వ్యాపారములు అనుకూలించును. ఆరోగ్యంఫర్వాలేదు. ఒక్కోసారి కోపం పెరుగుట వలన కొన్ని కార్యములు అర్ధాంతరముగా నిలబడిపోవును. శత్రువులేమిత్రులై సహాయసహ కారాలు అందిస్తారు. కుటుంబ సౌఖ్యం, మాసాంతంలో ఊహించని సంఘటనలు, మనోధైర్యం కోల్పోవుదురు.

===============================

సంవత్సర ఫలాలు – మిథునం

 

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు 
మిధున రాశి ఫలితములు
మృగశిర 3,4 పాదములు (కా,కి)

ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖ్గం, చ్ఛ)

పునర్వసు 1,2,3 (కే, కో, హా)

ఆదాయం-11 ఖర్చు-5 పూజ్యత- 2 అవమానం-2

 

మిధునరాశి గ్రహ సంచార సారాంశము

గురువు – 13-04-2022 నుండి 21-03-2023 వరకు దశమ స్థానమగు మీనరాశి యందు గురు సంచారము.

 

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు నవమ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు అష్టమ స్థానమగు మకరరాశియందు వక్రముగా సంచారము17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు నవమ స్థానమగు కుంభమునందు శని సంచారము.

రాహువు – 12-04-2022 నుండి 25-03-2023 వరకునేకాదశమున మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు పంచను స్థానమగు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం – మృగశిర వారు పగడము, ఆరుద్ర వారు గోమేధికము, పునర్వసు వారు పుష్యరాగము ఉంగరములు ధరించుటచే మనస్సిద్ధి. ఈ రాశివారికి 1-3-6-9 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, బుధవారములు అదృష్టవారములు. స్టార్ నెం.5.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి: ఈ నెల యందు చేయు పనులచే బంధనము కల్గును. కొంచెము ఆలోచించి పనులు చేయుట నేర్పరితనము. మంచి వారితో పనులను గూర్చి చర్చించుట మంచిది. శరీర రోగములు కలసిరావు. వ్యాకులతలు చెందగలరు. ఇతరుల సహాయముతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు దూకుడుగా వెళ్ళక శాంతియుతముగా పనులు సాధించగలరు. ఈ నెల ఆదివారం మీ గ్రామ దేవతకు పూజలు చేయుట మంచిది.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు వృత్తి వ్యాపక విషయాలందు విజయం సాధిస్తారు. మంచి ఆదాయము పొందెదరు. ఆరోగ్యము మందగించును. తలపెట్టిన కార్యములు సామాన్య ఫలములనిచ్చును. జాయింటు రుణములు తీరుస్తారు. మితిమీరిన ఆలోచనలు వద్దు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చును. వ్యాపారములు అధికారులకు జిక్కును. కుటుంబ సమస్యలు కూడ వచ్చును. ఈ నెలయందు రుద్రాభిషేకము సోమవారము, రోజున చేస్తే తలచిన పనులు పూర్తియగును.

2022 మార్చి – ఈ నెల యందు వృత్తి ఉద్యోగ వ్యాపారములు అనుకూలము. రావల్సిన బాకీలు వచ్చును. జాయింటు రుణములు కొన్ని తీర్చెదరు. రావల్సిన ధనము చేతికందును. ఋణ సేకరణ ఉపయోగము. వ్యవహారములందు చురుకుదనము మంచిది. కోర్టు వ్యవహారములు రాణించును. ఆకస్మిక చికాకులు వస్తాయి. స్త్రీ సహాయముతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈర్ష్యలు అతిగా పుట్టును. లక్ష్మీ నరసింహస్వామి వారికి 11 ప్రదక్షణములు చేస్తే కొన్ని పనులు ఆనందాన్ని కల్గించును.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు వాహన యోగమున్నది. శారీరక మానసిక సంతోషములు కలుగుతాయి. శుభకార్యానుకూలము. దుష్ట సాంగత్యము దరిశేరి వచ్చును. వృత్తియందు ధనలాభాదులు కలుగును. ఉద్యోగ వ్యాపారములందు స్థాన చలనములు కలుగవచ్చును. బంధుమిత్ర దర్శనము సుఖవిందు వినోదాలు పొందుతారు. నీచులతో కలహములు వచ్చును. శాంతియుతంగా వ్యవహరించగలరు. ధార్మిక చింతన బాగుండును. నవగ్రహములకు ఒక్కసారి పూజలు చేయండి.

2022 మే – ఈ నెల యందు ధనార్ధము వృధా సంచారము అన్వేషణ సమస్యలు అధికము. గృహ సౌఖ్యము కలుగుతుంది. ఇంటి వ్యవహారములు పిల్లల వ్యవహారములు అనుకూలము. భాతృ బంధుమరణాదులు అధికము. పుత్ర పుత్రిక విద్యా గోష్టి తగదు. వివాహాది సుఖప్రాప్తి కొన్ని సందర్భములందు కలుగవు. ధార్మిక చింతన మంచిది. లలితా దేవి పూజలు జాగ్రత్తగా నిర్వహించండి. లాభాదులు కలుగును.

2022 జూన్ – సాహిత్యాది సభలను దర్శించగలరు. కుటుంబ సమస్య పరిష్కారమగును. విందులు చేస్తారు. సోమరితనము మరచిపోగలరు. వృత్తియందు ధన ఋణములు లభించగలవు. స్థాన చలనము రావచ్చును. మొండి బాకీలు వసూలు అగును. ఆకస్మిక కోర్టు వ్యవహారములు రావచ్చును. పుత్ర పుత్రికలు మనోవేదనలు ఉంటాయి. కొన్ని సందర్భములందు కార్య విజయమునకు ఆటంకము రావచ్చును. ఒక్కసారి పానకాల గుడిని దర్శించండి. కొన్ని శుభాలు కలుగుతాయి.

2022 జూలై – ఈ నెలయందు దాంపత్య సుఖము అధికము. పిల్లల జీవితముల చర్చ వచ్చును. వృత్తి వ్యాపారములందు అనుకూల ధనము వచ్చును. ఆరోగ్యము బాగుగా యుండును. ఇంటి వ్యవహారములు చక్కపడును. ధార్మిక విషయములు అనుకూలము. వాహన ఆభరణ యోగములు బాగుగా యుండును. కొన్ని కొత్త వస్తువులు ఖరీదు చేస్తారు. అనుకున్న చోటకు ప్రయాణము చేస్తారు. దైవ దర్శనమును పొందుతారు.

2022 ఆగష్టు – ఈ నెల యందు ఆర్ధిక అంశాలు శుభప్రదముగానుంటాయి. ఉద్యోగములో మంచి ఫలితము ఉన్నది. తలచిన కార్యములు పూర్తి చేస్తారు. పితృ సంబంధిత జనులు వ్యాధులతో బాధలు పొందుతారు. పట్టుదలతో పనులు నిర్వర్తించి విజయం సాధిస్తారు. తగిన సమయములు మిత్రులచే రాణిస్తాయి. ఒత్తిడితో పనులు వేగంగా చేయగలరు. పెద్ద ఆటంకములు వచ్చిననూ లెక్కించరాదు. మంగళగిరి దేవుని దర్శించి అనేక శుభాలు పొందగలరు.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు మీ కోరికలు సిద్ధించును. ఉద్యోగములో శుభము చేకూరును. వృత్తియందు జాయింటు సమస్యలు అతిగా వస్తాయి. దూర ప్రయాణములు చేస్తారు. వాహన ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. మనశ్శాంతికి భంగము కలిగించే వారున్నారు. పెద్ద ఇబ్బందులు ఏమియునూ ఉండవు. శ్రీ కాళహస్తి దేవుని దర్శించుకొనుట చాలా శుభములు పొందుతారు.

2022 అక్టోబర్ – ఈ నెలయందు ముఖ్య కార్యాల్లో విజయం చేకూరుతుంది. ఆర్థికాంశాలు శుభములు ఇస్తాయి. జీవితాశయము సిద్ధిస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదించెదరు. ఇంటి యందు ఆరోగ్య లోపములు కొన్ని రావచ్చును. ధార్మిక వృత్తి బాగుగా సాగుతుంది. కొన్ని కార్యాలు అనుకూల వాతావరణములోనుంటాయి. సత్యనారాయణ వ్రతము చేయుట మంచిది.

2022 నవంబర్ – ఈ నెలయందు ముఖ్య అంశాల్లో జాగ్రత్త వహించాలి. స్వల్ప ఆటంకాలు వస్తాయి , తొలగుతాయి. ఆరోగ్యం గూర్చి లోతుగా ఆలోచించవద్దు. మనస్సులో అనుకున్నది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేయాలని ఆలోచనలు అధికంగా కలుగుతాయి. ఇష్ట దేవతను ధ్యానించండి. అన్నవరంలో వ్రతము చేయండి. శుభములు పొందుతారు.

2022 డిసెంబర్ – ఈ నెల యందు ఆరోగ్యము బాగుండును. శ్రమతో కూడినప్రయాణములు చేస్తారు. ఇష్టకార్యములు సత్ఫలితములు ఇస్తాయి. బంధువర్గ బాధలు తప్పవు. ఆర్థిక అంశాలు బాగుగాయున్నాయి. విద్యార్ధులయందు పిల్లలు అనుకూలము. ఇంటి గృహ కార్యముల తలంపుతోనున్నారు. కొద్ది రోజులు ఆగవలయును. ఉద్యోగ వ్యాపార వృత్తులందు సామాన్య ధనలాభాదులు వచ్చును. గ్రామ దేవతకు ఈ నెలలో ఆదివారం పొంగళ్ళు పెట్టి ప్రదక్షణములు చేస్తే ఇంటి వివాహములు అనుకూలముగానుంటాయి.

జనవరి:- ఈ నెలలో అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతగా సాగవు. ధన నష్టం, వ్యయం కల్గించును. నూతనవస్తు వస్త్రప్రాప్తియు దూరప్రయాణాలు, పాత మిత్రులను కలుసుకొనుట, స్పెక్యులేషన్లో నష్టం, బంధుమిత్రులతో విరోధాలు, స్ర్తీ మూలకధనవ్యయం. కుటుంబంలో సఖ్యతుండదు. కొన్ని విషయాలలో అవమానాలు.

ఫిబ్రవరి:- ఈనెలయందు ప్రతివిషయంలోనూ అనుకూలించును. చేయు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆరోగ్యంబాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోగలరు. రాని బాకీలు వసూలగును, ఆర్ధికంగా బాగుంటుంది. బంధు మిత్ర సౌఖ్యం. వాహన లాభం. గృహసంబంధ పనులు పూర్తి. ప్రయాణ సౌఖ్యం. అధిక ధనవ్యయం.

మార్చి:- ఈ నెలయందు అనుకూల గ్రహ సంచారం వల్ల అన్నిరంగాల వారి అన్నివిధాలుగా బాగుండును. వ్యాపారాదులకు మంచి వ్యాపారం జరుగును ఉద్యోగులకు ఆనందంగాఉంటారు. మీలో ఉత్సాహం, ధైర్యం పెరుగును. కొన్ని సమస్యలు పరిష్కారమగును. ప్రతీ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. నూతన పరిచయ లాభాలు. పెద్దవారిని, అధికారులను కలుస్తారు.

===============================

సంవత్సర ఫలాలు – కర్కాటకం

 

2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు 
కర్కాటక రాశి ఫలితములు :

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె,హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

* ఆదాయం-5 *ఖర్చు-5 *పూజ్యత-5 *అవమానం-2

కర్కాటక రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు నవమ స్థానమగు మీనరాశి యందునూ గురు సంచారము.

 

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు అష్టమ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు సప్తమ స్థానమగు మకరరాశి యందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు అష్టమ స్థానమగు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు దశమ స్థానమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు చతుర్దమున తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం:పునర్వసు వారు పుష్యరాగము, పుష్యమి వారు ఇంద్రనీలము, ఆశ్లేషవారు పచ్చరాయి ధరించుటచే ఉన్నత పదవులు పొందగలరు. ఈ రాశివారికి 2-3-6-9, అదృష్ట సంఖ్యలు. సోమ, మంగళ, శుక్ర, ఆదివారములు అదృష్టవారములు. స్టార్ నెం. 2.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెల యందు మానసిక చింతయుండును. ధనవ్యయము, సంతాన సౌఖ్యము, స్త్రీ జన వ్యయము, వ్యాపార శ్రమ, ఉద్యోగములందు అవమానములు, వృధావాదములు ప్రజావిరోధములు, ఋణాలు వచ్చును. శుభకార్య దర్శన యోగము, వివాహసమస్యలు, అతిగా బాధించును. ఆచితూచి అడుగు వేయుట మంచిది. అందుచే దుర్గాదేవిఈ నెల యందు ముఖ్యము. నవగ్రహ ప్రదక్షణములు కూడ చేస్తే మంచిది.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. మనో బలము పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగ వృత్తులందు ధైర్యముగా ముందుకు వెళ్ళి ధన లాభాదులు పొందగలరు. లావాదేవీల్లో తెలివితో జాగ్రత్త వహించండి. వ్యవహారములు అనుకూలము, కోర్టు సమస్యలు కొన్ని విజయాన్ని ఇస్తాయి. నమ్మకముతో ముందుకు సాగండి. గణపతి హోమము ఈ నెలలో చేస్తే మంచిది. అన్ని కార్యములందు విజయము పొందగలరు.

2022 మార్చి – ఈ నెలయందు సంకల్ప సిద్ధి యున్నది. ఆస్తి కొనుగోలు చేయవచ్చు. అప్పులు చేస్తారు. భయం లేకుండా ముందుకు వెళ్ళండి. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ప్రతి విషయము నందునూ జాగ్రత్త అవసరము. ప్రగతి సాధిస్తారు. తగిన ఆదాయము వస్తుంది. అన్నవరం దేవుని దర్శించండి. స్వామీజీలతో సమస్యలు చెప్పి పరిష్కార మార్గమును అన్వేషించండి.

2022 ఏప్రియల్ – ఈ నెలయందు మీ ప్రయత్నములకు దైవత్వము సహాయము ఉంది.గ్రహస్థితి అనుకూలము. తలచిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న శరీర బాధలు రావచ్చును. ఆరోగ్యము మందగించును. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము బాగుగాయున్నాయి. ప్రభుత్వ సమస్యలు అధికము, దుష్టుల కలయిక రావచ్చును. వ్యాపార ఉద్యోగ బంధు విషయాలు అనుకూలంగా యుంటాయి. సుబ్రహ్మణ్య పూజ ఈ నెలయందు చేస్తే అనుకూలవిజయాలు వస్తాయి.

2022 మే – ఈ నెల యందు స్త్రీ మూలక వాదములు వస్తాయి. మానసిక భయము వస్తుంది. శరీర పటుత్వము తగ్గును. వ్యాపారము అనుకూలము. ఉద్యోగములందు శ్రమ అధికము. చిలిపి చేష్టులు ఉద్యోగమునందు రావచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. యాత్రలు కుటుంబముతో చేస్తారు. ఆనందాన్ని పొందుతారు. పుత్ర పుత్రికల గోష్టి ఆలోచనలు అతిగాయుండును. గ్రామ దేవత పూజలు చేయుట మంచిది.

2022 జూన్ – ఈ నెల యందు బాధ్యతలు వ్యవహారములు పెరుగుతాయి. ధైర్యముగాఉండి ఉత్తమ ఫలితములు సాధించండి. వృత్తి రీత్యా సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయములందు స్థాన చలనములు కలుగవచ్చును. అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. మనో బలముతో ముందుకు సాగండి. సాంప్రదాయములు పాటించండి. గణపతి సూర్య స్తోత్రములు చదువండి. అన్నియునూ శుభంగాయుంటాయి.

2022 జూలై – ఈ నెల యందు ఉత్సాహముగా పనిచేసి లాభాదులు సాధించండి. వృత్తి ఉద్యోగములందు తగు జాగ్రత్త అవసరము. ఆర్ధిక పుష్టికి మంచి సమయము. ఆత్మవిశ్వాసాన్ని పొందుతూ ముందుకుసాగండి. పనులు అన్నియునూ ఆటంకము లేకుండా పూర్తియగును. చేయని తప్పునకు నిందారోపణములు వస్తాయి. ధన లాభాదులు ఉన్నను పుట్టకు నాగేంద్రునికి పూజలు శనివారము రోజున చేయండి. శుభాలు పొందుతారు.

2022 ఆగష్టు – ఈ నెల యందు వ్యాపార రీత్యా జాగ్రత్తలు అవసరము. ఉద్యోగమునందు పై అధికారుల సమస్యలు రావచ్చును. మనో బలముతో విజయం సాధించండి. చంచల స్వభావాన్ని తొలగించుకోవాలి. ధైర్యంగా వ్యవహరిస్తే పనులు పూర్తి చేస్తారు. నిర్ణయాలు అతిగా ఆలోచించండి. అన్ని రంగాలవాళ్ళు సుఖంగా ఈ నెల అనుభవించెదరు. శ్రీ రాఘవేంద్రస్వామి పూజా దర్శనములు చేయుట మంచిది. శుభయోగము.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు వ్యాపార వృత్తి ఉద్యోగములందు అనుకూల ధనలాభములు తలచిన పనులు పూర్తి చేస్తారు. కీర్తి , సంఘ గౌరవము కలుగుతుంది. ఆందోళనలు తగ్గును. వృధా ధన వ్యయము చేస్తారు. భార్య పిల్లలు అనురాగంగాయుంటారు. చదువును గూర్చి జాగ్రత్తలు అవసరము. లక్ష్మీ నారసింహ పూజలు పూర్తిగా చేస్తే సంసార కష్టములు తొలగును.

2022 అక్టోబర్ – ఈ నెల యందు కొన్ని ఋణములు చేస్తారు. కొన్ని వస్తువులు ఆభరణములు ఖరీదు చేస్తారు. కుటుంబము ఆనందముగా యుంటుంది. వ్యాపారమునందు లాభము. వృధా ప్రయాణములు చేస్తారు. వృత్తియందు సామాన్య ఫలము వచ్చును. వ్యవసాయాదులు అనుకూలము కాదు. వ్యవహారములు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీ దేవి పూజలు చేయండి. ఆరోగ్యము బాగుగాయుండును.

2022 నవంబర్ – ఈ నెల యందు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కలుగుతుంది. ప్రతిభకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కొత్త విషయాలు సేకరిస్తారు. మనః స్థైర్యముతో ముందుకు సాగండి. మాట పట్టింపులకు తావు ఇవ్వవద్దు. ఈ నెల బుధ, గురు, శుక్ర వారములందు వినోదాల్లో సంచరిస్తారు. ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్య కరమైన సమస్యలు తగ్గును. నారాయణ సహస్రనామ పారాయణము చేయండి. అన్నియునూ శుభములు కలుగును.

2022 డిసెంబర్ – ఈ నెల యందు ఆశించిన సహాయము అందకపోవచ్చును. స్త్రీలు పిల్లల అభిప్రాయాలు బాగుగానుంటాయి. వ్యవహారములు అనుకూలము. వ్యాపారాలు మందంగానుంటాయి. తాత్కాలిక అవరోధాలు దాటగలరు. వాహన యోగము. బాగుగాయున్నది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళగలరు. ఉత్సాహముగా పనిచేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయుటచే ఇంటియందు వివాహాదులు పూర్తికావచ్చును. సందేహము లేదు.

జనవరి: ఈనెలయందు అనుకూల గ్రహసంచారంవల్ల అన్నివిధాలుగా బాగుండకుటుండదు. నూతనవస్త్ర, వస్తుప్రాప్తి. ప్రయాణాలు చేయుదురు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్లో లాభించును. బంధు, మిత్రులతో కలసి విందులు, వినోదాలు. కుటుంబ వ్యక్తులను కలుసుకుంటారు. జీవన సౌఖ్యం.

ఫిబ్రవరి: ఈనెలలోగ్రహసంచారం అనుకూలంగాలేదు. చేయు వృత్తి వ్యాపారా లందురాణింపు ఉండదు. శారీరకశ్రమ అధికం. అకాలభోజనం. ప్రతివిషయంలో కష్టమధికంగా ఉంటుంది. ప్రయాణాలందుకష్టాలు, వాహన ప్రమాదాలు. ఆరోగ్య భంగములు. సంతానపీడలు. అవమానకర సంఘటనలు. ఊహించని సమస్యలు ఎదురగుట, జీవన ఆటంకములు ఎదురగును. పనులు పూర్తికాక ఇబ్బందులు.

మార్చి: ఈ నెలలో ప్రధమార్ధం బాగుండదు. చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానడుచును. ఆర్ధిక సమస్యలుంటాయి. ఊహించని ఖర్చులు ఎదురగును. పనులు మధ్యలో నిలచిపోవును. ద్వితీయార్ధం పరిస్థితులు చక్కబడును. ఆర్ధికంగా నిలద్రొక్కుకుంటారు. ఆరోగ్యం కుదుటపడును. సమస్యలు పరిష్కారమగును. దైవసంబంధ కార్యములు చేయుదురు. వివాహాది శుభకార్యాలకు హాజరగుదురు. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. అధికారులను కలుసుకుంటారు. స్త్రీసౌఖ్యం.

===============================

సంవత్సర ఫలాలు – సింహం

సింహ రాశి ఫలితములు :

మఘ 1,2,3,4 పాదములు (మా,మీ, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో,టా,టీ,టు)
ఉత్తర 1వ పాదము (టే)

*ఆదాయం-8 *ఖర్చు-14 *పూజ్యత-1 * అవమానం-5

 

సింహ రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు అష్టమ స్థానమగు మీనరాశియందునూ గురు సంచారము.

 

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు సప్తమ స్థానమగు కుంభరాశియందునూ12-07- 2022 నుండి 16-01-2023 వరకు షష్టమ స్థానమగు మకరరాశి యందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు సప్తమ స్థానమగు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు నవమ స్థానమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు తృతీయ స్థానమున తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం : మఖవారు గోమేధికము, పుబ్బవారు వజ్రము, ఉత్తరవారు కెంపు ఉంగరములు ధరించుటచే కుటుంబాభివృద్ధి, శుభములు కలుగును. ఈ రాశివారికి 1-3-6-8-9) అదృష్ట సంఖ్యలు. ఆది మంగళ, శుక్ర, సోమ, శనివారములు అదృష్టవారములు. స్టార్ నెం. 1.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెల యందు గ్రహస్థితి మిశ్రమము. తలచిన పనులు అనుకూలము. దూరపు ప్రయాణములు తగ్గించుట మంచిది. వృత్తి వ్యాపార ఉద్యోగములందు ఆదాయము మెండు. నిందారోపణములు కలుగును. ఇంటియందు పిల్లల భవిష్యత్తు వేడుకలతో యుండును. ధనవ్యయము చేస్తారు. ఇంటి వివాహాది కార్యముల గూర్చి ఆలోచనలు, అన్ని అనుకూలము. యాత్రలు చేయుట మంచిది. అన్నవరం సత్యనారాయణ నోములు ఒకసారి చేయండి. కొన్ని వైభవములు కలుగును.

2022 ఫిబ్రవరి – ఈ మాసమునందు స్వల్ప అనారోగ్యతలు రావచ్చును. నిర్విఘ్నముగా తలచిన పనులు పూర్తి. బంధు వైరములు కలుగవచ్చును. విద్యా సక్రమంగా సాగును. పిల్లలు ఆరోగ్యముగా నుందురు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభాదులు పొందుతారు. మిత్రుల సహాయము లభించును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఆశ్చర్యకర సంఘటనలు రావచ్చును. స్థిరాస్తి ఖరీదు చేయుటకు ఆలోచనలు పుట్టును. దుర్గా గుడి దర్శనము చేయుట మంచిది.

2022 మార్చి – ఈ నెల యందు వాహన యోగము లభించగలదు. కార్యసిద్ధి ప్రతి పనిలోను కలుగును. బంధుమిత్ర సుఖ జీవనము అనుకూలము. ధార్మిక పనులు పూర్తి చేస్తారు. విద్యార్ధులకు అధిక శ్రమ పుత్ర పుత్రికల మనో వేదనలు అధికము. సామాన్య ధన లాభాదులు కల్గును. మొండి బాకీలు వసూలు అగును. అనారోగ్యము కొంత బాధించును. అధిక కోపము కూడ కలుగుంది. ఆకస్మిక కోర్టు వ్యవహారములు రావచ్చును. జాయింటు సమస్య రావచ్చును. నవగ్రహ ప్రదక్షణములు చేయుట మంచిది.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు వృధా సంచారము, గృహ సౌఖ్యము, వ్యాపారములందు రుణములు అధికము. వ్యసనములచే అధిక ఖర్చు. వృత్తియందు ప్రమోషన్స్, ఉద్యోగులకు అనుకూల స్థితి వ్యవహారము రాణించును. మాతృ సౌఖ్యము. కల్గును. ఇంటి సమస్యలు కోరికలు అధికము. ఆరోగ్యము తగ్గును. ఆర్ధికముగా సామాన్యము. మనోధైర్యముతో సంచరించండి. బంధు సమాగమము, దూర ప్రయాణములు అనుకూలము. అందుచే నవగ్రహ ప్రదక్షణములు చేయండి.

2022 మే – ఈ నెల యందు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చురుకుగా సంచరించెదరు. మనో బలము విజయం సాధిస్తారు. అవసరాలకు డబ్బు లభించును. ప్రయాణ లాభదాయకము. ఆరోగ్యము, సహకరిస్తుంది. గణపతి హోమము చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. బంధు ఆదరాభిమానాలు పెరుగును. కొత్త పనులు ఆరంభిస్తారు. మీ ప్రవర్తనే మిమ్ములను కాపాడుతుంది. కుటుంబ సభ్యులకు శుభయోగము.

2022 జూన్ – ఈ నెల యందు మాట పట్టింపులకు తావివ్వద్దు అనవసర విషయాలపై ‘శ్రద్ధ చూపవద్దు, ధనమును వృధాగా ఖర్చు చేయవద్దు. విదేశ ప్రయాణ ముచ్చట్లు కలుగుతాయి. విందులు, వినోదాలు చేయకండి. సంఘ గౌరవాదములు పెంచుకోండి. వృత్తి వాణిజ్యము ద్వారా ధనాదాయము పొందండి. ఆరోగ్య సమస్యలున్నా జాగ్రత్తగా ఓషధ సేవ చేయండి. సోమ మంగళ, బుధ వారములు ధన లాభము కలుగుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి పూజను మరువకండి.

2022 జూలై – ఈ నెల యందు తాత్కాలిక అవరోధాలు వస్తాయి. అతిథులు వస్తారు. ఉద్యోగస్థులు అధికారుల మన్ననలు పొందుతారు. ఒప్పందాల్లో మెలకువ వహించాలి. రోజువారి పనులు చురుగ్గా సాగుతాయి. కొన్ని సందర్భములందు అసంతృప్తి తప్పదు. అగ్రిమెంట్స్ వ్రాయుట తప్పదు. ఆశించిన రీతిలో ఆదాయము వస్తుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించండి. ఆదాయము మెరుగ్గాయుండి ఆనందం పొందుతారు. గణేశ పూజను మరువవద్దు.

2022 ఆగష్టు – ఈ నెల యందు మనసులోని ఆందోళనలు జాగ్రత్త పడండి. బుధ, గురువారాల్లో ధనాదాయము వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరములు అతి వ్రాస్తారు. జాగ్రత్తగా ధనాన్ని కాపాడి వస్తువులు కొనండి. తాత్కాలిక అవరోధాలు అతిక్రమించెదరు. ధార్మిక చింతన మంచిది. భార్య పిల్లలతో యాత్రను దర్శించుట మేలు. బాకీలు కొన్ని ఇబ్బంది కల్గించును. సంసారిక విషయాలు వృత్తి అంత్య శ్రద్ధతో వహించుట మేలు. రామపూజ చేయండి. కోర్కెలు సిద్ధించును.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు ప్రయత్న బలాన్ని బట్టి విజయం సాధించగలరు. ఆత్మ విశ్వాసంతో అభివృద్ధిని సాధించెదరు. వృత్తి వ్యాపారములు అనుకూలమే. దూరపు ప్రయాణము చేయండి. గృహలాభం పొందండి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ప్రతి పనియందు దూరపు చూపు చూస్తూ పని చేయండి. మంచి కాలము నడుస్తుంది. ఈ నెల యందు మనశ్శాంతి కలుగును. ఋణములు కొన్ని తీర్చెదరు. దుర్గమ్మ తల్లి దర్శనము చేయుట మంచిది.

2022 అక్టోబర్ – ఈ నెల యందు ఆదాయము అధికము. కొన్ని ఆభరణాలు కొంటారు. శారీరక శ్రమ హెచ్చును. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ధనవ్యయము జాగ్రత్తగా చేయండి. విశ్రాంతి లేకుండా పనులు బాధ్యత పెరుగుతాయి. వివాదములు సమసిపోతాయి. ఋణములు కొన్ని చేస్తారు. అప్పులు తీర్చుతారు. బంధు గృహములకు అతిగా వెళ్ళవద్దు. కొత్త పరిచయాలు ప్రియ భాషణలు వస్తాయి. రాఘవేంద్ర స్వామి పూజలు చేయండి.

2022 నవంబర్ – ఈ నెల యందు ఆదాయం నిల్వలు పెంచుతుంది. చేపట్టిన కార్యక్రమములు నిర్విఘ్నముగా సాగుతాయి. బంధు మరణములు కలుగుతాయి. వృత్తి పరంగా మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగము నందు నిందారోపణములు కలుగుతాయి. శ్రమ అధికము. ఈర్ష్య ద్వేషములు అధికమౌతాయి. భయము వద్దు. ధర్మము రక్షించును. బంధు మరణములు చూస్తారు. దినారాత్రులు కష్టపడి పనిచేయండి. స్వామి అయ్యప్పలకు అన్నదానము చేయండి. పూజల్లో పాల్గొనండి.

2022 డిసెంబర్ – ఈ నెల యందు ఖర్చులు అధికము. పండుగల గిరాకీయుండును. ఇంటియందు ఆభరణములు వస్త్రాలు ఖరీదులు చేయాలి. పిల్లల మనస్సు నొప్పించవద్దు. మీలో చాలాకాలంగా దాగియున్న కోర్కెలు సిద్ధించును. స్త్రీ వైరాగ్యము కలుగుతుంది. కొత్త స్త్రీ మాటలు కలుపవద్దు. ప్రతిభా ప్రావీణ్యము పెంచుకోండి. గణేశ పూజ చేయుట మంచిది. పుణ్య క్షేత్రములు దర్శించుట మంచిది. కుటుంబము యోగ్యతగా కలిసి వస్తుంది.

జనవరి:- ఈనెలలోచేయు వృత్తివ్యాపారాలు బాగా సాగును. ఆదాయమునకు లోటుండదు. రానిబాకీలువసూలగును. ఆరోగ్యం బాగుంటుంది. నూతన వస్తు, వస్త్రప్రాప్తి, దూరప్రయాణాలు, పాతమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో, కలిసి విందులు, స్పెక్యులేషన్లో అనుకూలత. ప్రయాణ సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం.

ఫిబ్రవరి:- ఈ నెలలో గ్రహస్థితులు అనుకూలంగా లేనందువల్ల అపజయం. ఆరోగ్యం బాగుండదు. ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు, నిందారోపణలు ఎదుర్కొంటారు నమ్మిన వారే దగా చేయుదురు. పనులు మధ్యలో నిలిచిపోవును. వ్యవహారాలు పూర్తికావు. భార్యతో మాటా మాటా పట్టింపులు, సంతానంనకు స్వల్పంగా ఆరోగ్య భంగములు. మనస్థిమితం ఉండదు.

మార్చి:- ఈనెలలో అష్టమమందు గ్రహసంచారంవల్లచేయువృత్తి వ్యాపారములందు రాణింపు ఉండదు. ఆరోగ్యభంగాలు తప్పవు. పటుత్వం కోల్పోవుదురు. ఏమి మాట్లాడిన విరోధాలవుతారు. ఉద్యోగులకు బదిలీలు లేదా గృహమార్పులు తప్పవు. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతీ చిన్న విషయానికి తాగాదాలు వచ్చును. కుటుంబంలో అందరికి స్వల్పంగా ఆరోగ్యభంగములు తప్పవు, ధనము విపరీతంగా ఖర్చగును.

===============================

సంవత్సర ఫలాలు – కన్య

కన్యా రాశి ఫలితములు :

ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)
హస్త 1,2,3,4 పాదములు (పూ,షం,ణా ,ఢ)
చిత్త 1,2 పాదములు (పే.పో)

 

*ఆదాయం -11 *ఖర్చు-5 *పూజ్యత -4 *అవమానం-5

 

కన్య రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు సప్తమ స్థానముగు మీనరాశి యందు గురు సంచారము.

 

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు షష్టమ స్థానముగు కుంభరాశియందునూ,12-07-2022 నుండి 16-01-2023 వరకు పంచమ స్థానమగు మకరరాశి యందువక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు పష్టమస్థానమగు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు అష్టమ స్థానమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు ద్వితీయ స్థానమున తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం: ఉత్తర వారు కెంపు, హస్తవారు ముత్యము, చిత్తవారు పగడము ఉంగరములు ధరించుటచే అధికారము, ధనలాభములు కలుగును. ఈ రాశి వారికి 1-3-5-6-7-9 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, గురు, శుక్రవారములు అదృష్టవారములు. స్టార్ నెం. 6

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు గ్రహ సంచారము అనుకూలము. వృత్తి ఉద్యోగ, వ్యాపారములందు విశేష ధన లాభాదులు కలుగును. వ్యాపార సంస్థ వర్కర్సు బాధలు తప్పవు. ఇంటియందు కొంత ఆరోగ్య లోపము రావచ్చును. యాత్రలు చేయుట మంచిది. చిత్త శుద్ధితో పనిచేసి సత్ఫలితములు పొందెదరు. కీర్తి పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు చూచుట ముఖ్యము. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృత్తి రీత్యా సమస్యలు తొలగిపోతాయి.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు వ్యవహారములు సవ్యంగా జరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార వృత్తులయందు సామాన్య ధన లాభాదులు కలుగుతాయి.ఆరోగ్యము బాగుగా యుండును. బంధు మరణాదులను వింటారు. పిల్లల చదువులను గూర్చి ధనవ్యయము చేస్తారు. పనిలో ఆటంకాలు తొలగుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పులు కొన్ని పొందుతారు.

2022 మార్చి – మీ అనుభవమే మిమ్ముల్ని ముందుకు నడిపిస్తుంది. దైవ బలము రక్షిస్తుంది. వ్యాపార రీత్యా జాగ్రత్తలు అవసరము. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆర్ధిక నష్టాలు రావచ్చును. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆంజనేయ స్వామి పూజలు చేయుట ముఖ్యము, అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించాలి. ఆరోగ్యము మీద జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.

2012 ఏప్రియల్ – ఈ నెల యందు బంధుమిత్రులతో సమస్యలు ప్రారంభమౌతాయి. సామాజికంగా మంచి పనులను చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో స్పష్టత వస్తుంది. ఆస్థి వస్తువుల కొనుగోలు విషయంలో ప్రగతి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార వృత్తి రీత్యా సమస్యల్ని అధిగమిస్తారు. లక్ష్మీ ధ్యానము శుభదాయకము, సూర్య స్తోత్రాలు పారాయణ చేయుట మంచిది.

2022 మే – ఈ నెల యందు మీకున్న అవకాశములను పరిధులను గమనించి బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా కొత్త విషయాలు సేకరించెదరు. ఆర్ధికంగా ఆభరణములను ఖరీదులను చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములందు లాభదాయకంగా ఒప్పందాలు ఎగ్రిమెంట్స్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కలుగుతాయి.

2022 జూన్ – ఈ నెల యందు ఆత్మ విశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగములో మీ మాటకు విలువ పెరుగుతుంది. మనస్సులోని కోరికలు ఫలిస్తాయి. వ్యాపారములు ఒడిదుడుకుగానుంటాయి. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. శ్రీ రామ పూజలు అధికంగా చేయండి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం సాధిస్తారు. ఆరోగ్యమును గూర్చి తగు జాగ్రత్తలు పొందుట మంచిది.

2022 జూలై – ఈ నెల యందు విద్యా వివాహ సమస్యలు అధికంగా వస్తాయి. పుత్ర పుత్రిక గోష్ఠి అధికము. కుటుంబ సౌఖ్యములు కలుగుతాయి. నీచులతో దుర్గార్గులతో కలహములు వస్తాయి. దేహ బాధలు అధికము. స్థాన చలన యోగములు రావచ్చును. శతృ బాధలు అధికము. వృత్తియందు శక్తి సామర్థ్యములు గుర్తింపు వస్తుంది.

2022ఆగస్టు – ఈ నెల యందు మీ వృత్తి వ్యాపారాలయందు ప్రత్యేకమైన సమాచారము పొందుతారు. వివాదములు మాట పట్టింపులు వదిలేస్తే మంచిది. ఆదాయాభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించెదరు. అనుకోని ప్రయాణములు వస్తాయి. మీలో చాలా కాలంగా దాగియున్న కోర్కెలు సిద్ధిస్తాయి. బాల్యమిత్రులను కలసి గత చరిత్రలు మననం చేసుకుంటారు. కొంత దుఃఖములు చవి చూస్తారు.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు వృధా సంచారములు చేస్తారు. వాహన యోగము లభించును, పిల్లలకు విద్యా భంగ యోగము పట్టవచ్చును. ఉద్యోగమునందు ప్రమోషన్స్ రావచ్చును. వృత్తియందు లాభాదులు కల్గును. అధికార సందర్శనలు లభించును. బుద్ధి చంచల్యము రావచ్చును. ఆందోళనములు అధికము. ఆకస్మిక కోర్టు వ్యవహారములు వస్తాయి. గణపతి హోమము చేయుటచే మంచిది.

2022 అక్టోబర్ – ఈ నెలయందు గృహమునందు వివాహాది శుభకార్యములు చర్చలకు వస్తాయి. కొన్ని వాహన ప్రమాదములు దర్శించెదరు. దేశాంతర ప్రయాణ జనుల చర్చలు వస్తాయి. మానసిక ఆందోళనలతో సుఖ జీవనము చేస్తారు. వృధా సంచారములు చేస్తారు. స్త్రీ మూలన సమస్యలు ధనవ్యయము అధికమౌతాయి. సమస్యల పరిష్కారము కోసం సహజముగా స్నేహితుల కలయిక శుభదాయకము. కీర్తి లాభములు సామాన్య జీవనములు లభించును.

2022 నవంబర్ – ఈ నెల యందు వృత్తి వ్యాపార ఉద్యోగములందు కొత్త విషయాలు సేకరిస్తారు. ఇంటా బయట మీ ప్రాబల్యము పెరుగుతుంది. అప్రత్తమంగా ఉంటారు. వ్యవహారాల్లో వచ్చే ఇబ్బందులు గమనించండి. ఉద్యోగములందు పదోన్నతులు కలుగుతాయి. శారీరక బాధలు ఉద్యోగ వృత్తి, ఋణ బాధలు పెరుగుతాయి. సత్యసాయి పూజలు అధికంగా చేయుట మంచిది.

2022 డిసెంబర్ – ఈ నెల యందు ప్రజా విరోధములు దారిద్య్ర జనుల కలయిక సంభవించును. బంధుమిత్ర సమాగమము, ధనలాభము. ఇంటియందు భార్యతో సమస్యలు, పుట్టింటి సమస్యలు, సంతాన చర్చలు సాగుతాయి. వ్యవహార విజయాన్ని సాధించెదరు. వాహన యోగము రావచ్చును. దూర ప్రయాణములు చెరుపునిస్తాయి. ఋణముల బాధలు కొన్ని రావచ్చును. స్త్రీ మూలక సమస్యలు రావచ్చును.

జనవరి:- ఈనెలలో కూడా అనుకూలగ్రహసంచారంవల్ల చేయువృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. ధనలాభం, వ్యవహారములు మీకు అనుకూలంగా పూర్తి అగును. ధైర్యంతో ముందుకు పోగలరు. దూర ప్రయాణాలు కలసివచ్చును. స్వగ్రామంలో గల పాతమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదం, నూతనవస్త్ర, వస్తుప్రాప్తికలుగును. స్పెక్యులేషన్లో లాభించును.

ఫిబ్రవరి:- ఈ నెలయందు కూడా పరిస్థితులు అనుకూలించును. అన్ని రంగముల వారి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనవిషయంలో ఇబ్బందులుండవు. మాటకు విలువ పెరుగును. సంఘంలో మీ పరపతి అధికంగా ఉండును. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు. గృహంలో శుభకార్యములుజరుగును. బంధుమిత్రులతో కలసి విందులు, వినోదములు. కుటుంబ సౌఖ్యం.

మార్చి:- ఈనెలలో గ్రహసంచారం అనుకూలమే. కానీ మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రధమార్ధంచాలా అనుకూలంగా ఉండును. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. వ్యవహారాలందు జయం. నూతనకార్యాలకు శ్రీకారం పుట్టెదరు. ద్వితీయార్ధంలో అష్టమమందు శుక్ర ప్రభావం ఉంటుంది. భార్యాభర్తల మధ్యసరైన అవగాహన ఉండదు. చిన్నచిన్న తగాదాలు ఏర్పడి వెంటనే సమసిపోవును.

======================

సంవత్సర ఫలాలు – తుల

తులా రాశి ఫలితములు

చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా)
విశాఖ1,2,3 పాదములు (తీ,తూ,తే)

 

*ఆదాయం-8 *ఖర్చు-8 * పూజ్యత – 7 * అవమానం-5

తులా రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు షష్టమ స్థానమగు మీనరాశి యందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు పంచమ స్థానమగుకుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు చతుర్ధ స్థానమగు మకరరాశియందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు పంచమ స్థానమగు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు సప్తను స్థానమగు మేషరాశి రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు లగ్న స్థానమున తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం: చిత్తవారు పగడము, స్వాతివారు గోమేధికము, విశాఖవారు పుష్యరాగముల ఉంగరములు ధరించుటచే సంకల్ప సిద్ధి కలుగును. ఈ రాశివారికి 1-3-4-6-9 అదృష్ట సంఖ్యలు, మంగళ, బుధ, శుక్ర వారములు అదృష్టవారములు, స్టార్ నెం. 5.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెల యందు ఆత్మీయులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహకములు అనుకూలము. వృత్తి వ్యాపార ఉద్యోగములందు ధనలాభాదులు వస్తాయి. పరస్పర సహకారములు లభించును. సదాశయంతో మీరు చేపట్టిన కార్యములు చేయగలరు. ఆరోగ్యము అనుకూలము. ఆర్ధిక లావాదేవీలు అనుకూలము. భాగస్వామ్యాలు అనుకూలము. దుర్గా పూజలు చేయండి.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు శారీరక బాధలు వస్తాయి. ధన వ్యయములు పెరుగుతాయి. పిల్లల భవిష్యత్తు ఆలోచనలు కలుగుతాయి. వ్యాపార వృత్తి యోగాలు సామాన్యము. గృహమునందు ఋణములు కొన్ని తీరుస్తారు. చోరాగ్ని భయములు దర్శించెదరు. సంతాన విషయ చర్చలు అధికము. వాహన యోగము దాంపత్య సుఖములు అధికము. సాహిత్య సభల ప్రవేశము లభిస్తుంది. మిత్ర ధర్మములు కొన్ని బాధిస్తాయి. దుర్గాదేవి పూజలు చేయుట మంచిది.

2022 మార్చి – ఈ నెల యందు వ్యాపార శ్రమ అధికము, ఉద్యోగ ప్రయాణములు అధికము అధికారుల వత్తిడి అధికము జాయింటు వ్యవహారములు క్లిష్ట పరిస్థితిగానుంటుంది. కొన్ని సందర్భములందు శ్రమకు తగ్గ ఫలము వస్తుంది. ఖచ్చిత ప్రమాణములతో ముందుకు సాగండి. బంధు మరణములు అధికముగా చవిచూస్తారు. స్థానచలన యోగములు ఉన్నాయి. ఆరోగ్య ఆందోళనలు అధికము. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు వస్తాయి.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు శుభకార్యానుకూలము. వివాహాది శుభకార్య అన్వేషణ అధికారులు భయము. దూరప్రయాణములు, ధర్మరక్షణ వ్యాపారముగా నుంటుంది. ప్రయాణములు బాధిస్తాయి. వ్యాపార రీత్యా కొన్ని ఋణములను పొందుతారు. విశేష వస్తులాభాదులు పొందగలరు. ప్రయత్న కార్యములు రాణించగలవు. స్త్రీలచే బాధలు కలుగుతాయి. వృత్తి వ్యతిరేక వాదములు కలుగుతాయి.

2022 మే – అన్నీ సక్రమ మార్గములో ఈ నెలయందు పనులు జరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పాటుగానుంటాయి. వ్యవహారములు రాణించును. పూర్వ స్నేహితులు కలుస్తారు. ధార్మిక చింతన కలుగుతుంది. డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. పిల్లల జీవితములు ఆలోచనలు చర్చకు వస్తాయి. తాత్కాలిక రుణము సమకూరుతాయి. లక్ష్మీ నారాయణ పూజ చెయ్యాలి.

2022 జూన్ – ఈ నెల యందు ఉద్యోగములో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దల మన్ననలు పొందుతారు. మానవ ప్రయత్నములు రాణించగలవు. మనోబలము విజయంగానుంటాయి. లక్ష్మీ కటాక్షము కల్గుతుంది. ఆశించిన ఫలితములు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు అనుకూల ధనము వస్తుంది. తగు సహాయముతో ముందు జాగ్రత్తగా నడచుట మంచిది. ఆదివారం గ్రామ దేవతను దర్శించి ప్రదక్షణములు చేయుటచే శుభములు కలుగుతాయి.

2022 జూలై – ఈ నెల యందు తలచిన పనులకు కార్యసిద్ధి బంధుమిత్రయోగము. వృత్తియందు సామాన్య ధన లాభాదులు ఉద్యోగమునందు శ్రమకు తగ్గ లాభాదులు వ్యాపారమునందు అధిక లాభాదులు గుమస్తాలతో కొన్ని ఇబ్బందులు ఆరోగ్య భంగములు వృత్తియందు కొన్ని రుణాలు చేయగలరు. మానసిక వత్తిడి వాహన యోగము ఇత్యాదులు కలుగును. దుర్గా స్తోత్రమును చదువండి. మనోబలం పెరుగుతుంది.

2022 ఆగస్టు – ఈ నెల యందు దైవబలము అనుకూలము. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ పనియైనా ఇంట్లో వారితో సంప్రదించండి. అదృష్టము వరిస్తుంది. సంతోష వార్తలు వింటారు. దాయాదుల వైరములు సంభవించవచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. సంతోషాన్ని కలిగించే వార్తలు వింటారు. ఇష్ట దైవాన్ని స్మరించడము మంచిది. ఆత్మ శక్తి రెట్టింపు అవుతుంది. ప్రయత్నములు రాణించగలవు.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగుట మంచిది. మీ నిర్ణయములు అనుకూలాన్ని ఇస్తాయి. నూతన ఉద్యోగముల ఏర్పాటు కలుగుతుంది. ప్రత్యర్థుల కవ్వింపు చర్యలు ఉంటాయి. ఆరోగ్యము ఆందోళనగా యుంటుంది. వస్తు వాహన యోగ్యతలు కలుగవచ్చును. పిల్లల విద్యా సమస్యలు ఆర్ధికంగా ఖర్చులు పెట్టగలరు. దూర దేశ బంధువులు వస్తారు. వృత్తి పరంగా మీరు చేసే ప్రయత్నాలు రానించగలవు.

2022 అక్టోబర్ – ఈ నెల యందు వృత్తి యందు ధన లాభాలు వస్తాయి. ఇంటియందు రోగ బాధలధికము. కోర్టు వ్యవహారములు రావచ్చును. ఉద్యోగులకు ధనాదాయము కల్గుతుంది. అధికార ప్రాప్తి వ్యాప్తి చెందును. కుటుంబ సమస్యలు కొన్ని వస్తాయి. శారీరక శ్రమ అధికము. మానసిక వత్తిడి ఆరోగ్య లోపములు రావచ్చును. అనుకున్నది సాధించలేకపోతాయి. ప్రయత్న ఫలము సామాన్యముగా నుంటుంది. లక్ష్మీ నరసింహపూజ చేయుట మంచిది.

2022 నవంబర్ – ఈ నెలయందు కుటుంబ గౌరవ వృద్ధి ధర్మ రక్షణ ప్రయత్నపూర్వక ప్రయాణములు జరుగుతాయి. విదేశీ వస్తువులు కొంటారు. విలాస జీవనములు చేస్తారు. జాయింటు వైరములు రావచ్చును. వృధా వ్యయము చేస్తారు. గృహమునందు కొన్ని రుణములు చేస్తారు. వ్యాపారములందు రుణములు హెచ్చుగా చేస్తారు. కొన్ని విషయములందు విషయ సిద్ధి కలుగుతుంది. నవగ్రహ పూజ ఒక్కసారి చేయండి.

2022 డిసెంబర్ – ఈ నెల యందు చేయు వృత్తి వ్యాపారములు అనుకూలతలు ఇస్తాయి. ధనాదాయము వస్తుంది. మిత్ర ద్రోహముతో ధనవ్యయము. ఆరోగ్యము. ఆనందమయము. భార్య ప్రతి విషయమునందునూ అనుకూలించును. కొత్త మహిళలు మిత్రధర్మముగా పరిచయమగుదురు, ధార్మిక తత్వము పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యములు అనుకూలము. ఇంటి యందు ఉద్యోగ వ్యాపారములు వృత్తి అన్నియునూ అనుకూలముగాయుంటాయి.

జనవరి:- ఈనెలయందుచేయువృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయం బాగుంటుంది. వ్యవహారములు కలసి వచ్చును. దూరప్రయాణములు చేయవలసివచ్చును. పాతమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తియు, బంధుమిత్రులతో కలసివిందులు, వినోదాలు, స్పెక్యులేషన్లాభించును. ప్రయాణాలందు స్వల్పంగా కష్టములు ఉంటాయి. సోదరమూలకంగా, కళత్రమూలకంగా ఇబ్బందులు తప్పవు.

ఫిబ్రవరి:- ఈ నెలయందు గ్రహసంచారం బాగుంది. చేయువృత్తి వ్యాపారాలు బాగుంటాయి. గృహంలో శుభకార్యాలు, లేదా శుభకార్యాలకు హాజరగుట జరుగును. నూతనకార్యాలకు శ్రీకారంచుట్టెదరు. సంఘంలో ఉన్నత వ్యక్తులను, అధికారులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారములు, ప్రభుత్వ సంబంధకార్యాలు సకాలములో పూర్తి అగును. 6వ ఇంట శుక్రుని వల్ల స్త్రీ విభేదములు తప్పక కల్గించును.

మార్చి:- ఈనెలయందు అన్నిరంగాలవార్కి చేయువృత్తి వ్యాపారాలు రాణించును. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక సమస్యలుండవు. పనులు త్వరగా పూర్తిచేయగలరు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. శుక్ర, రాహువులు కలయికచే పరామర్శలు చేయుదురు. సూతకాలు కల్గును. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమగును. బంధు, మిత్రులతో కలయిక. స్త్రీ సౌఖ్యం.

====================

 

సంవత్సర ఫలాలు – వృశ్చికం

వృశ్చిక రాశి ఫలితములు 

విశాఖ 4వ పాదము (తో)
అనూరాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే)
జ్యేష్ట 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యు)

 

*ఆదాయం-14 *ఖర్చు-14 *పూజ్యత-3 *అవమానం-1

వృశ్చిక రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు పంచమ స్థానమగు మీనరాశి యందు గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు చతుర్థ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు తృతీయ స్థానమగు మకరరాశి యందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు చతుర్దమున కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు షష్టమ స్థానమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు ద్వాదశమున తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం: విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగము. అనూరాధవారు నీలము, జ్యేష్టవారు పచ్చరాయి ఉంగరములు ధరించుట మంచిది. ఈ రాశివారికి 1-2-4-6-8-9 అదృష్ట సంఖ్యలు, గురు, బుధ శుక్ర శనివారములు అదృష్టవాదములు, స్టార్ నెం. 9.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెల యందు ధనమును మంచినీళ్ళవలె ఖర్చు చేస్తారు. మానసిక ఆందోళనలు కొన్ని వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారములు లభించవు. ప్రభుత్వ కార్యాల్లో స్త్రీలకు ఇబ్బందులు వస్తాయి. వ్యాపార రంగము వృత్తి రంగము సామాన్యముగా ధనలాభాదులు వస్తాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు సంభవించును. దూర ప్రయాణములు చేస్తారు. ఉద్యోగమునందు నిందలు కూడా రావచ్చును. నవగ్రహ పూజ చేయండి.

2022 ఫిబ్రవరి – ఈ నెల యందు ఋణములు తీర్చెదరు. రావల్సిన ధనము వచ్చును. ఖర్చులు పెరుగును. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ వాదులు తగు జాగ్రత్తగా పనియందు శ్రద్ధ చూపించాలి. అసంఘటిత పనులకు దూరంగా యుందుట మంచిది. సోమవారములందు ఈశ్వరాభిషేకములు చేయుట మంచిది. కొన్ని ఇబ్బందులు తొలగిపోగలవు.

2022 మార్చి – ఈ నెలయందు దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వివాహము నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. సోదర వర్గము శుభవర్తమానాలు పంపుతారు. అనుకోని ప్రయాణములు చేస్తారు. భాగస్వాములతో చర్చలు జరుపుతారు. మాతృవర్గమున కొన్ని బాధలు తెస్తారు. వారాంతములో ప్రయాణములు వాయిదా వేయండి. అమ్మవారికి కుంకుమ పూజలు చేయండి.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు అన్ని రంగముల వారికి అధిక శ్రమ ఉంటుంది. కొన్ని రుణములు తీర్చేదరు. దూర ప్రయాణములు చేస్తారు. బంధుమరణ చింతలు కల్గును. ఉద్యోగ వ్యాపార వృత్తులు మిశ్రమాదాయములుగా నుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ రంగాల జనులు శ్రద్ధతో సంచారము చేయుట మంచిది. ఆరోగ్యములు బాగుగాయుండగలవు నగరములందు సంచారములు తగ్గును. దైవపూజలు మంచివి.

2022 మే – ఈ నెల యందు కొత్త మార్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కొత్త ఆలోచనలు చేస్తారు. పాత బాకీలు వసూలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చురుగ్గా సాగుతాయి. ఆదాయము సామాన్యము. భోజన సౌఖ్యము. శతృవార్తలు ఆరోగ్య భంగము కలుగుతాయి. యత్నకార్యములు జయమగును. బుద్ధి చాంచల్యము అధికము. ఉద్యోగ ప్రమోషన్స్ ఆలోచనలు వస్తాయి. కొన్ని సార్ధకత గల్గును. ఇష్టదేవతా పూజలు చేయుము.

2022 జూన్ – ఈ నెలయందు అధికారుల ప్రశంసలు కలుగును. వృత్తిలో ధన లాభాదులు వచ్చును. ఋణములు తీర్చెదరు. గౌరవ భంగము. వృత్తియందు సామాన్య ధనలాభాదులు కలుగును హృదయ సంకటములు జనించును. మనోవేదన అధికము. బంధుమిత్ర సుఖ జీవనములు కలుగుతాయి. విదేశీ బంధువులు ఆత్మీయంగా పలికెదరు. ధార్మిక చింతనలు అధికము. దుర్గాపూజలు చేయుట మంచివి.

2022 జూలై – ఈ నెలయందు ప్రయాణములలో శారీరక బాధలు దుర్గార్గుల దుశ్చేష్టలు కల్పించును. శారీరక ఆందోళనలతో ఆరోగ్యము దెబ్బతినును. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారములు రాణించక పోవచ్చును. మిశ్రమ స్పందనతో సంచారములు చేస్తారు. స్త్రీ మిత్రత్వము ధనము నిచ్చును. స్త్రీలతో పుణ్య దేవాలయములకు వెళ్ళి పూజలు చేయుట మంచిది. శుక్రవారములందు గోవులను పూజించండి. గ్రహశాంతి చేసుకోండి.

2022 ఆగష్టు – ఈ నెల యందు కొద్దిగా ఆరోగ్యము మార్పు రావచ్చును. మిశ్రమాదాయము సంభవించును. ఆదాయమునకు తగిన ఖర్చు మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయములందు మిశ్రమముగా ఆదాయము లభించును. గురువారములందు రామాలయమునకు వెళ్ళి దేవుని పూజించండి. రాజకీయ నిందలు వాదములు తరచు అన్ని వృత్తుల వాళ్ళకు వచ్చును. ఉద్యోగములందు సాటి అధికార గణముతో స్నేహము చేయుట మంచిది.

2022 సెప్టెంబర్ – ఈ నెల ఆదాయమునకు లోటుండదు. సాంఘిక అభివృద్ధితో పయనించెదరు. వాహనయోగములు రావచ్చును. నెలమధ్య ఆరోగ్య లోపము రావచ్చును. ఇంటియందు వివాహ కార్యములు పూర్తి చేస్తారు. కుటుంబ పిల్లలకు ఉద్యోగములు రావచ్చును. పిల్లల భవిష్యత్తు అనుకూలము. గుమ్మడికాయ గుమ్మానికి కట్టిన జయము ఆరోగ్యము కొద్దిగా మార్పు రావచ్చును.

2022 అక్టోబర్ – ఈ నెల కుటుంబమునందు ఔషధ సేవలు పెరుగును. ధన వ్యయముకల్గును బంధు వైరములు అధికము. దాయాదుల ఆస్తి తగాదాలు రావచ్చును. ధనము నిఖ్ఖచ్చిగా నుంచుము. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ రంగములవారికి సకాలములో ధనాదాయము మంగళవారము కుజుని పూజలు చేయండి. దీర్ఘకాలిక ఋణములు తీరును. కొత్త రుణములు తెచ్చెదరు.

2022 నవంబర్ – ఈ నెల ఆదాయమునకు లోటుండదు. సాంఘిక అభివృద్ధితోపయనించెదరు. నెల మధ్యలో ఆరోగ్యలోపము వచ్చును. వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారములందు తగు జాగ్రత్తలు అవసరము. వాహన యోగము ఇబ్బందులు కల్గును.మిశ్రమాదాయము. వృత్తి యందు రాజ భయము వచ్చును. కుటుంబ సమస్యలు మిశ్రమము. వృధాగా ధనవ్యయములు చేస్తారు.

2022 డిసెంబర్ – ఈ నెలయందు తలచిన పనులు నెరవేరును. ఉన్నత స్థితిని చేరుకుంటారు. అధికార గణం సూచనలతో సంచరించుట మంచిది. వ్యాపారస్థులకు ప్రభుత్వ బాధలు కొన్ని వస్తాయి. వృత్తివాండ్లకు అనుకూలముగాయుంటారు. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. వస్తు వస్త్ర ఆభరణ లాభాలు ఉంటాయి. లక్ష్మీ పూజలు చేయుట మంచిది.

జనవరి:- ఈనెలలో కూడా మీ మాటకు ఎదురుండదు. పట్టిందల్లా బంగారమా?అనునట్లుండును. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తియు, విలువైన వస్తువులు లభించును.ప్రయాణములు సౌఖ్యంగా, సుఖంగా ఉండును. దూరప్రయాణములు చేస్తారు. బంధుమిత్రులతో, విందులు, వినోదాలు జరుగును. స్పెక్యులేషన్ బాగుంటుంది. గృహజీవితానందం పొందుదురు. నూతన మిత్రులు కలయిక. కుటుంబ సౌఖ్యం.

ఫిబ్రవరి:- ఈ నెలయందు కూడా అనుకూలమే. పనులు త్వరితగతిన పూర్తి చేయగలరు. గృహములో శుభకార్యములు జరుగును. లేదా శుభకార్యములకు హజరగుదురు. గృహనిర్మాణములు కలిసివచ్చును. నూతన కార్యములకు శ్రీకారం చుట్టెదరు. హుషారుగా ఉంటారు. ప్రతీ విషయంలో మీదే పైచేయి అగును. ఆర్ధికంగా లోటుండదు. గతంలో రావలసిన ధనం చేతికందును. స్త్రీ సౌఖ్యం.

మార్చి:- ఈ నెలందు గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అన్నిరంగాల వారి చేయండి. మాటకే ప్రాధాన్యత ఉంటుంది. ధైర్యసాహసములతో ప్రవర్తిస్తారు. వృత్తులందు రాణింపు ఉంటుంది. ధనలాభం. ఆరోగ్యం వాహనసౌఖ్యం. బంధుమిత్రలాభాలు. శుభకార్యలాభం. సంతానం పరీక్షలు బాగా రాయుదురు. శతృవులపై ఆధిక్యత, భార్యమూలకలాభాలు. సంఘంలో ఉన్నతస్థితి.

===============================

సంవత్సర ఫలాలు – ధనస్సు

ధనూరాశి ఫలితములు 

మూల 1,2,4 పాదములు (యే, యో, బా,బి)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (భూ,ధ.భా.ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదము (భే)

*ఆదాయం-2 *ఖర్చు-8 *పూజ్యత-5 *అవమానం-1

ధనూరాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు చతుర్ధ స్థానమగు మీనరాశి యందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు తృతీయ స్థానముగు కుంభరాశియందునూ 12 -07-2022 నుండి 16-01-2023 వరకు ద్వితీయ స్థానమగు మకరరాశియందు వక్రముగా సంచారము – 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు తృతీయమున కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు పంచమ స్థానమగు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు ఏకాదశ స్థానమునందు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం – మూల నక్షత్ర జాతకులు వైడూర్యము, పూర్వషాడా నక్షత్ర జాతకులు వజ్రం . ఉత్తరషాడ నక్షత్ర జాతకులు కెంపు ఉంగరములు ధరించుట మంచిది. ఈ రాశివారికి 1-2-5-9 అదృష్ట సంఖ్యలుఆది , బుధ గురువారములు అదృష్టవారములు. స్టార్ నెం. 3.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు ఆత్మ విశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితం పొందుతారు. మిశ్రమ కాలం నడుస్తుంది. ఉద్యోగులకు మిశ్రమాదాయము. దారాబిడ్డల సౌఖ్యము ఉంటుంది. అన్ని విషయాలు ఆలోచించి నడుచుకోవాలి. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆర్ధిక అంశాలు బాగుగాయున్నాయి. గణేశ హోమము చేయించండి. నూతన ప్రయత్నములు రాణించగలవు.

2022 ఫిబ్రవరి – ఈ నెలయందు చిత్తశుద్ధితో పరిశ్రమ చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ధనాదాయము ఉన్నది. ఉద్యోగంలో శ్రమయుంటుంది. సమస్యలున్నా జాగ్రత్త పడాలి. ఆర్ధిక సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి. క్రొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టండి ఆరోగ్యము బాగుగా యుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి. సంతాన విషయాలు అన్నియునూ అనుకూలముగా ఉంటాయి.

2022 మార్చి – ఈ నెలయందు అదృష్టయోగం వరిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలరు. ప్రయాణములు కలిసివస్తాయి. గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మిశ్రమాదాయము లభించును. శారీరక శ్రమ కలుగుతుంది. మిత్రుల ద్వారా ఆపదలు కలుగవచ్చును. విష్ణు దర్శనం చేయవచ్చును. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించుకోండి. తిరుపతి ప్రయాణము చేయగలరు.

2022 ఏప్రియల్ – ఈ నెలయందు అభీష్ట సిద్ధి లభిస్తుంది. ప్రయాణములు విజయం చేకూరును. ముఖ్య కార్యాల్లో అతి వేగంగా పనిచేస్తారు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఇష్ట దైవ స్మరణ శుభప్రదం ధర్మ మార్గంలో సంచారం చేయుట మంచిది. మొహమాటం పనికిరాదు. ప్రతి విషయాన్ని నిఖ్ఖచ్చితో వ్యవహరించండి. ఇంట్లో శుభాన్వేషణలు జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయాలు పరిస్థితుల ప్రభావంతో నడచుట మంచిది.

2022 మే – ఈ నెల యందు ఉత్సాహంతో కృషిచేసి విద్యార్థులు ముందు చూపును ఆలోచించండి. అన్ని వసతులు అనుకూలంగాయున్నాయి. మీ నవీన పథకాలు ఆలోచనలు ఆకట్టుకుంటాయి. క్రయ విక్రయాలు చురుగ్గా సాగుతాయి. ఆశించిన ఆదాయములు లభించును. ఉద్యోగ వ్యాపార వృత్తులు సామాన్య ధనాన్ని పొందుతారు. దూర ప్రయాణములు చేస్తారు. ఆధునిక విజ్ఞానముతో సంచరిస్తారు. రోజువారి పనులు బాగుగా సాగుతాయి. ఆంజనేయ స్వామి పూజలు అనుకూలించగలవు.

2022 జూన్ – ఈ నెలయందు మాట పట్టింపునకు తావీయవద్దు. స్వార్ధ జీవనం ముఖ్యము. ధనవిషయాలు ముఖ్యము. విదేశీ ప్రయాణీకులు కలుస్తారు. పూర్వ స్నేహితులు ఆనందించెదరు. రాజకీయ విజ్ఞాన రంగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విందులు వినోదాల ద్వారా ఉల్లాసం పొందుతారు. వృత్తులు ఇబ్బందికరంగా నుంటాయి. ప్రతి పని కూడా ఇబ్బందులు ఆందోళనలుగా మారుతాయి. శ్రీకాళహస్తి దేవుని దర్శనము ఒక్కసారి చేయండి.

2022 జూలై – ఈ నెలయందు బంధుమరణ వార్తలు వింటారు. ఋణములు భూవసతులు కలుగుతాయి. శుభకార్యవ్యయము అధికము. వ్యాపార ద్వేషములు అధికము. మనోవేదనలు కలుగును. వస్తు ఆభరణ లాభాదులు కలుగుతాయి. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. కొద్ది అనారోగ్యము కలుగుతుంది. ఆకస్మిక కోర్టు వ్యవహారాలు రావచ్చును. హృదయ సంకట విషయాలు వస్తాయి. భయము చెందవద్దు, తిరుపతి దేవుడు మిమ్ములను కాపాడుతారు. బంధు సందర్శనము కలుగుతుంది.

2022 ఆగష్టు – ఈ నెల యందు కొంత అనారోగ్యము రావచ్చును. ప్రయత్నించి పనులు పూర్తి విజయం కలుగుతుంది. విద్యా విజయము కలుగుతుంది. ఇంటియందు పిల్లల చదువుల సమస్యలు ఆందోళనలు వస్తాయి. అధికారుల సందర్శనలు చేస్తారు. ఋణములు కొన్ని తెస్తారు. ఉద్యోగములందు ప్రమోషన్స్ లభించును. అనుకోని ఆపదల నుండి గట్టెక్కుతారు. సంతాన చర్చలు సఫలము అగును. నాగేంద్ర పూజలు కూడ చేయుము.

2022 సెప్టెంబర్ – ఈ నెల యందు కుటుంబములో ఔషధ సేవలు పెరుగును. ధనవ్యయము కలుగుతుంది. గ్రహస్థితి మిశ్రమము. బంధువైరములు అధికము. వృత్తి వ్యాపార ఉద్యోగరంగాల్లో పనులు అనుకూలము. ప్రయత్నించి పనులు లాభిస్తాయి. సాంకేతిక రంగాల్లో విజయం సాధిస్తారు. స్త్రీ వలన ధనయోగము. పుట్టినింటి మన్ననలు పెంపొందించుకుంటారు. మిశ్రమాదాయము అన్ని రంగాలవార్కినుంటాయి.

2022 అక్టోబర్ – ఈనెల యందు ఉద్యోగములందు స్థాన చలన యోగములు కలుగును. చివాట్ల యోగములు లభించును. వృత్తియందు చీటికిమాటికి ఇబ్బందులు ధనరూపముగా వస్తాయి. బంధువులు వ్యతిరేకించెదరు. మిత్రులు ఆనందముతో ఓదార్చెదరు. వ్యాపారాల్లో వర్కర్లు చిన్న ఇబ్బందులను పెట్టెదరు. వృత్తి వ్యాపార రంగములు సమయమునకు ధనాన్ని సంపాదించెదరు. సీతారాములు పూజలు చేయండి.

2022 నవంబర్ – ఈ నెల ఉద్యోగములందు స్థాన చలనములు కల్గును గృహములు మార్చెదరు. ఉద్యోగ సీట్లు మారవచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. చీటిమాటికి -ఉద్యోగ నిందలు వస్తాయి. అన్ని రంగాల్లో ధనాదాయము బాగుగాయుండును. రాజకీయ వాదములు పెరుగును, చెన్నకేశవ పూజలు చేయండి. సంతాన విషయాలు అనుకూలము. పిల్లలు దూర ప్రయాణములు చేస్తారు. ఋణములు కొన్ని శాంతించును. వడ్డీల బాధలు అధికము.

2022 డిసెంబర్ – ఈ నెల యందు ఆత్మ విశ్వాసంతో పనులు చేయండి. విద్యార్థులు పరీక్ష ఉత్తీర్ణతలను గూర్చి భయపడవద్దు. కర్తవ్యము ఆలోచించాలి. స్త్రీ సౌఖ్యము మాట పట్టింపులు తొలగును. శారీరక శ్రమ తగ్గును. జీవితం ఆనందమయంగా ఈ నెలలో నుంటుంది. రాజకీయ బాధలు కొన్ని వస్తాయి. ఇంటియందు ఆరోగ్యములు కొన్ని లోపించును. ఔషధ చికిత్సలు అత్యవసరము. తిరుపతమ్మ దేవి పూజ చేయుట మంచిది.

జనవరి:- ఈనెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉంది. గానం చేయువృత్తి వ్యాపారములందు రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుండును. ఆర్ధిక సమస్యలుండవు. నూతనవస్తు, వస్త్రప్రాప్తి, పాతమిత్రులను కలుస్తారు. దూరప్రయాణాలు కలిసివచ్చును. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదములు. స్పెక్యులేషన్ అనుకూలించును.

ఫిబ్రవరి:- ఈ నెల చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసివచ్చును. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండును. ప్రతీ విషయంలో ధైర్యంతో ముందుకుపోగలరు. నూతనపనులకు శ్రీకారంచుట్టెదరు. వివాహాది శుభకార్యాలకు హాజరగుట. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రభుత్వసంబంధ కార్యాలు పూర్తి.

మార్చి:- ఈనెల గ్రహ సంచారం బాగుంది. చేయువృత్తి, వ్యాపారాలు అనుకూలించును. ఎంతటి కఠినమైన సమస్య వచ్చినా అలవోకగా పరిష్కారమై లాభించును. శతృవులపై ఆధిక్యత్త, కుటుంబ సౌఖ్యం, సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. సప్తమ కుజుని వల్ల కోపంతో ప్రవర్తించెదరు. పరుషంగా మాట్లాడుట వల్ల కార్యాలయందు కొంత ఆలస్యమైనప్పటికీ విజయంసాధిస్తారు. కొన్ని విషయాలలో మనస్తాపం కలుగును.

===============================

సంవత్సర ఫలాలు – మకరం

మకర రాశి ఫలితములు :

ఉత్తరాషార 2,3,4 పాదములు (బో, జా, జి)
శ్రవణం 1,2,3,4 పాదములు (జూ, జె ,జో , ఖ)
ధనిష్ట 1,2 పాదములు (గా , గి)

 

*ఆదాయం – 5 *ఖర్చు-2 *పూజ్యత-2 *అవమానం-4

మకర రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2012 నుండి 21-03-2023 వరకు తృతీయ స్థానుగు మీనరాశి యందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2023 వరకు ద్వితీయ స్థానమగు కుంభరాశి యందునూ12-07-2022 నుండి 16-01-2013 వరకు లగ్న స్థానమగు మకర రాశి యందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు ద్వితీయమున కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు చతుర్ధమునందు మేష రాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు దశమ స్థానమునందు తులారాశి యందున కేతువు సంచారము.

అదృష్టం: ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు కెంపు, శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యం, ధనిష్ట నక్షత్ర జాతకులు పగడము ఉంగరములు ధరించుటచే ఋణవిమోచన, ధనప్రాప్తి కలుగును. ఈ రాశి వారికి 1-3-6-7-9 అదృష్ట సంఖ్యలు, సోమ, బుధ, గురు శుక్ర అదృష్టవారములు.స్టార్ నెంబర్: 8.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి: ఈ నెలయందు ఓర్పుతో కొన్ని వివాదములు పరిష్కరించెదరు. ఆర్ధిక స్థితి మరింత మెరుగ్గానుంటుంది. స్థిరాస్తి వివాదములందు జాగ్రత్త వహించాలి. సన్నిహితులు సహాయము చేస్తారు. వాహన కొనుగోలు ఆలోచన వస్తుంది. పారిశ్రామిక వర్గాలు ఆనందముతోనుంటాయి. దక్షణ దిశ యాత్ర అనుకూలించును. మాస మధ్యలో ఇంట్లో అనారోగ్యములు బాధించును. బంధువుల నుండి ఆహ్వానములు అందుతాయి. లక్ష్మీ నారసింహ పూజలు చేయగలరు.

2022 ఫిబ్రవరి: ఈనెల యందు దూర ప్రాంతము నందు మిత్రులు ఆహ్వానించెదరు. ఇంటిలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆప్తుల నుండి ధనలాభం వస్తుంది. ఆర్ధిక లావాదేవీలు బాగుంటాయి. ఓర్పుతో పనిచేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో అనుకూలము ధనయోగములు ఉన్నాయి. ఇంటియందు ఆరోగ్య విషయాల్లో ఆలోచనలు ఆందోళనలు అతిగానుంటాయి. శనిపూజ చేయుట మంచిది.

2022 మార్చి: ఈ నెల యందు మీ అనుభవమే మిమ్ములను బలపరుస్తుంది. దైవబలము రక్షించును. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తియగును. రావల్సిన బాకీలు వస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. లావాదేవీల్లో తెలివిగా మారండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగుగాయుండవచ్చును. ఇంటి ఆరోగ్యములు కొన్ని బాధిస్తాయి. గణపతి సూర్య స్తోత్రాలు చదువుట మంచిది.

2022 ఏప్రియల్: ఈ నెలయందు వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ప్రత్యేకత చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య పనులు విజయవంతం అగును. యాత్రలు చేస్తారు. వాహనములు ఆభరణములు ఖరీదు చేస్తారు. స్త్రీల ఆభరణముల వద్ద చికాకులు వస్తాయి. ఈ నెల యందు పశ్చిమ దిశ ప్రయాణం రాణించును. ఆరోగ్య విషయము శాంతించును. తిరుపతమ్మ పూజలు చేయుట మంచిది.

2022 మే – ఈ నెల యందు దూరపు బంధువుల ఆహ్వానములు వస్తాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అదృష్టయోగము విశేషంగాయుంది. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించండి. కోరుకున్న పనులు జరుగును. ఆర్థిక లావాదేవీలతో ఆందోళనలు వద్దు. ఇష్టదైవ స్మరణ శుభప్రదము. వృత్తి ఉద్యోగాల్లో పైకి వస్తారు. స్వల్ప ప్రయత్నములు రాణించును. భారీ ప్రయత్నములు ఆలోచించాలి. అన్నింటి యందునూ ఆందోళనలు వస్తాయి.

2022 జూన్ – ఈ నెల యందు మంచి కాలము నడుస్తుంది. చిత్తశుద్ధితో పనులు చేయండి. ఉద్యోగంలో శ్రమయున్నా శాంతిని పొందుట మంచిది కార్యశూరత అన్నిచోట్ల పనిచేయదు. మానసికంగా ధృఢంగా స్థిరంగా ప్రతిపనియందునూ ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న ధనాన్ని సాధిస్తారు. లాభాదులు అనుకూలిస్తాయి. అన్నవరం దేవుని దర్శించి పుణ్యఫలాలు సాధించండి.

2022 జూలై – ఈ నెల ఆరోగ్యములో కొద్ది మార్పు రావచ్చును. మిశ్రమాదాయము. ఆదాయము కష్టముగా వచ్చును. శ్రమించుట ముఖ్యము. వృత్తియందు చీటికిమాటికి ఇబ్బందులు ధనరూపంగా రావచ్చును. ఆరోగ్యము వేధింపు చర్యగానుంటుంది. వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వృత్తుల్లో వర్కర్సు ప్రాబ్లం వస్తుంది. స్వంతగా తన పని తాను చేసుకొనుట మంచిది.

2022 ఆగష్టు – ఈనెల ఆరోగ్యము బాగుండును. స్త్రీ సౌఖ్యము. మాట పట్టింపులు తొలగును. శారీరక శ్రమ తగ్గును. ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. వాహన యోగము శారీరక పోకడలు తగ్గించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ వ్యవహార జయములు అధికము. స్త్రీలతో పుణ్య దేవాలయములు సంచారము మంచిది. ఋణ బాధలు శాంతించును. ఇంటియందు లలితా దేవి పూజలు చేయుట మంచిది.

2022 సెప్టెంబర్ – ఈ నెలలో అన్ని రంగాల వారికి ధనాదాయము మిశ్రమము. తలచిన పనులు నెరవేరును. ఆరోగ్యం కొద్దిగా మార్పువచ్చును. ముఖ్య కార్యాల్లో అవకాశములు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగములందు శ్రమకు తగ్గ ఫలితము వస్తుంది. దుర్మార్గులతో స్నేహము విడిచి సన్మార్గుల స్నేహము మంచిది. స్త్రీ మిత్రత్వము చేటు తెస్తోంది. గోవు పూజ ఒకసారి చేయండి. ఆరోగ్యము కుదురుగా ఉండును.

2022 అక్టోబర్ – ఈ నెలయందు కొత్తపనులు చేపట్టి ఆర్ధిక పురోగతి పొందుతారు. లాభాదులు అనుకూలము. ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో నూతనోత్సవాలు ఉంటాయి. ఈ నెలయందు మహిళా సంయోగము బాధించును. ఋణములు కొన్ని తీర్చెదరు. నాగేంద్రస్వామి పూజలు చేయండి. కొన్ని ఋణ బాధలు తీరును.

2022 నవంబర్ – ఈ నెల యందు ఆదాయము వచ్చిననూ మంచినీళ్ళవలె ఖర్చు చేస్తారు. మానసిక ఆందోళనలు రావు. అన్నదమ్ముల సహాయ సహకారములు లభించును. భార్యాబిడ్డల సమస్యలు తీరును. ఇంటియందు ఉద్యోగ ప్రాప్తి కల్గును. బంధుమిత్రుల అభినందనలు తరచుగా వచ్చును. స్త్రీలకు గర్భదోష వ్యాధులు తొలగును. భయాందోళనలు తగ్గును. పాండురంగస్వామి, వేణుగోపాలస్వామి పూజలు అనుకూలిస్తాయి.

2022 డిసెంబర్ – ఈ నెలయందు చేయు వృత్తి వ్యాపారములు అనుకూలతలు. ధనాదాయము బాగుగాయుండును. బంధువర్గములో బాధలు అధికము. బంధువులు అప్పుల కొఱకు వచ్చెదరు. వారి కోపాలు మిమ్ములను ఇబ్బంది పెట్టును. ప్రయాణ పుణ్యక్షేత్రములు ఆనందాన్ని ఇస్తాయి. మనోసంకటము తొలగును. బంధుమరణ వార్తలు వింటారు. ఉద్యోగము సాఫీగా చేయగలరు.

జనవరి:- ఈనెలయందు జన్మంలో గ్రహసంచారం వలన దూర ప్రయాణములు చేయుదురు. ప్రయాణాలు కష్టమనిపించును. నూతనవస్తు, వస్త్రప్రాప్తి, పాతస్నేహితులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదములు. స్పెక్యులేషన్లో నష్టములు. కొన్ని విషయములలో మనశ్శాంతి ఉండదు. ఆర్ధికంగా ఈ ఇబ్బందులకు గురి అగుదురు. భార్యా భర్తల మధ్య సరైన అవగాహన ఉండదు.

ఫిబ్రవరి:- ఈనెలయందు గ్రహసంచారం బాగుంది. శనిజన్మరాశి నుండి ద్వితీయమునకు మారుచున్నందు వల్ల గతంలో అనుభవించిన కష్టములు తగ్గును. ప్రశాంత వాతావరణం ఉంటుంది. సమస్యల నుండి బయటపడుదురు. పూర్తిగా ఆనందంగా లేకపోయినా కొంతమేర బాగుంటుంది. బంధుమిత్రులతో కలయిక. వారి వివాహాది శుభకార్యాలకు హాజరగుదురు. భూసంబంధవ్యవహారాలు అనుకూలించును.

మార్చి:- ఈ నెలయందు గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అన్నిరంగాల వార్కి చేయు వృత్తి వ్యాపారములందు రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా లోటుండదు. గృహంలో నిలిచిపోయిన శుభకార్యాలు జరుగును. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకుపోగలరు. సంతానంపరీక్షలుబాగా వ్రాయుదురు.

===============================

సంవత్సర ఫలాలు – కుంభం

కుంభ రాశి ఫలితములు :

 

ధనిష్ఠ 3,4 పాదములు (గూ,గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గో,సా,సీ, సూ)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే,సో,దా)

 

*ఆదాయం-5 * ఖర్చు-2 * పూజ్యత-5 * అవమానం-4

కుంభ రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు ద్వితీయ స్థానమగు మీనరాశి యందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు లగు స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు ద్వాదశమునందు మకరరాశియందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు లగ్నము నందు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు తృతీయ స్థానమునందు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు నవమ స్థానమునందు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం: ధనిష్ట వారు పగడము, శతభిషం వారు గోమేధికము. పూర్వాభాద్రవారు పుష్యరాగము ఉంగరములు ధరించుట ధనయోగము. ఈ రాశివారికి 3-4-5-8-9 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, గురు శుక్ర వారములు అదృష్టవారములు. స్టార్ నెం. 8.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు ఇంటిలో సంతోషదాయకంగానుంటారు. అప్పుల నుండి తొలగుతారు. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటూ ఆనందముగానుంటారు. కొన్ని వివాదముల నుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. మధ్యలో ఆస్తి వివాదాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ నెలయందు ఉత్తర దిశ ప్రయాణములు బాధిస్తాయి. ఇష్ట దేవతలను ప్రార్ధించండి.

2022 ఫిబ్రవరి0 – ఈ నెలయందు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారముల విస్తరణపై దృష్టి పెడతారు. నేర్పుతో ఓర్పుతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో సమర్థత చాటుకుంటారు. స్నేహితులతో విబేధాలు వస్తాయి. గులాబి రంగు వస్త్రాలు ధరించండి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించవచ్చును. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కొన్ని ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. గ్రామ దేవతల పూజలు చేయండి.

2022 మార్చి – ఈ నెల యందు కొన్ని ఇబ్బందులు పడుదురు. ఆకస్మికంగా దూర ప్రయాణము బాధించును. పుట్టింటి బాధలు కొన్ని వస్తాయి. ఆరోగ్యము సహకరిస్తాయి. దూర ప్రయాణములు చేస్తారు. వాహన యోగము లభిస్తుంది. శత్రు బాధలు కొన్ని తగ్గును. యాక్సిడెంట్స్ చూస్తారు. బాధలు అనుభవిస్తారు. గృహమునందు చికాకులు వస్తాయి. పిల్లలు దారి తప్పి సంచరించవచ్చును. ఇష్టమైన దేవతల పూజలు చేయండి.

2022 ఏప్రియల్ – ఈ నెలయందు మిశ్రమ గ్రహస్థితి దైవభక్తితో కార్యాలు సాధించుట ముఖ్యము. మానసిక స్థితిలో ఇబ్బందులున్నా ప్రముఖుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగములందు కొంత ఆర్ధిక బలం పుంజుకుంటుంది. వృత్తివారలకు ఋణములు లభించును. విద్యార్థులు ఉత్తీర్ణతలు పొందెదరు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకముగా ఉంటుంది. ప్రయత్న పూర్వక పనులు రాణించును.

2022 మే – ఈ నెలయందు గ్రహస్థితి అనుకూలము. బంధు సహకారములు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు ఊరట నిస్తాయి. మాసంతంలో అసహన సంచారము. యువత బాధలు చూస్తారు. విద్యావ్యాపారంలో ఇబ్బందులు సీటు విషయ చర్చలు జరుగుతాయి. బిడ్డల చదువులు ఆనందాన్నిస్తాయి. శారీరక బలహీనతలు రావచ్చును. మాట పట్టింపులు అధికము. పిల్లలు దారి తప్పే అవకాశములున్నాయి.

2022 జూన్ – ఈ నెల ఆర్ధిక వ్యవహారములు మెరుగుపడును. రావల్సిన బాకీలు వచ్చును. ఋణములు తీర్చెదరు. వివాహ ఉద్యోగ ప్రయత్నములు రాణించును. స్పందనలు కన్పట్టును. ప్రయాణములు అధికము. కొన్ని ఆటంకములు వస్తాయి. వేంకటేశ్వర ప్రసాద వితరణ చేసినచో కొన్ని బాధలు తీరును. కుజ గ్రహ పూజలు చేయుట మంచిది. ధనయోగము లభించును. ఋణబాధ కోర్టు బాధలు తొలగును.

2022 జూలై – ఈ నెల యందు ఓర్పుతో వివాదములు సమసిపోతాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగములో చిక్కులు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆశలు కల్గును. అనారోగ్యము శాంతించును. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానములు వస్తాయి. మధ్యలో ఆస్తి వివాదములు వస్తాయి. అనుకోని శుభాలు కలుగుతాయి.

2022 ఆగష్టు – ఈ నెలయందు ఆర్ధిక సమస్యలు అనుకూలము. రావల్సిన బాకీలు వస్తాయి. దూరపు ప్రాంత బంధువులు వస్తారు. ఆత్మీయుల సూచనతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగములో తెలియని ఒప్పందాలు వస్తాయి. ధైర్యంగా రక్షిస్తుంది. సాహచర్య మిత్రత్వముతో ముందుకు సాగండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. శక్తి వంచన లేని ప్రజలు మిత్రులుగా లభించగలరు. ఆర్ధిక స్థితిలో జాగ్రత్తలు అవసరము.

2022 సెప్టెంబర్ – ఈ నెలయందు ఆర్ధిక నష్టాలు రావచ్చును. అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించాలి. చిన్న పొరపాట్లు సర్దుకోండి. చింతించి ప్రయోజనము లేదు. కార్య శూరత సాధించుట ముఖ్యము. లావాదేవీల్లో అనుకూలము. ప్రకయ విక్రయ విధులు నిర్వహించగలరు. అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. పెద్దల వద్ద వినమ్రతతో వ్యవహరిస్తూ వారి ఆదరాభిమానాలతో ముందుకు సాగండి. వృత్తి వ్యాపారోద్యోగులతో అనుకూల ధనప్రాప్తి కల్గును.

2022 అక్టోబర్ – ఈ నెల యందు ఆస్తి ఆభరణములు ఖరీదులు చేయగలరు. స్త్రీలకు ఆనందాన్ని ఇస్తారు. పిల్లల కోర్కెలు తీర్చలేరు. జీవిత సమస్యలు బాధించును. అభివృద్ధి అంశాలు బాగుగాయుండును. మనోబలము విజయం సాధిస్థాయి. దుర్గా ధ్యానము మేలు చేకూరుతుంది. కీర్తి పెరుగుతుంది. మధ్యలో ధనవ్యయము కల్గును. ఆరోగ్య విషయాలు బాధనిస్తాయి.

2022 నవంబర్ – ఈ నెల యందు ప్రయత్న బలము పెరుగును. ఉత్సాహముతో పనులు పూర్తి చేయండి. నిరుత్సాహము వద్దు. దైవ శక్తి కాపాడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది. బంగారు జీవితాన్ని పొందుతారు. అంతా అనుకున్న విధంగా కార్యాలు సాధిస్తారు. వాహన యోగములందు జాగ్రత్తలు పొందుట ముఖ్యము. నెలాంతము మంచి వాస్తలను వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము.

2022 డిసెంబర్ – ఈ నెల యందు మీ మాటకు విలువ పెరుగుతుంది. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఆస్తి సమస్యలు పరిష్కారము చేసుకొనుట ముఖ్యము. బంధుమిత్రుల ఆనందము వల్ల కొన్ని బాధలు తీరును. అప్పులు తీరును. కొత్త రుణాలు చేస్తారు. అవరోధములు తొలగుతాయి. అదృష్టయోగము సామాన్యముగా ఉంటుంది. సమయ స్ఫూర్తితో ప్రతి పని సాధించగలరు. నవగ్రహ పూజ చేయండి.

జనవరి:- ఈ నెలకూడా బాగుంటుంది. అన్నిరంగాల వారికి అనుకూలమే. మంచి వ్యాపారాలు జరుగును. ఆదాయం బాగుంటుంది. నూతనవస్తు, వస్త్ర, వాహన ప్రాప్తి, పాతమిత్రులను కలుసుకొనుట. మంచి ప్రయాణాలు చేయవలసి వచ్చును. సుఖంగా జీవనం ఉంటుంది. ఒడిదుడుకులుండవు. సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు.

ఫిబ్రవరి:- ఈ నెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలుండును. కొన్నింటిలో అనుకూలత. మరికొన్నింటి వ్యతిరేకత ఉంటుంది. వ్యవహారాలు కలిసి రావు, ప్రభుత్వసంబంధ కార్యాలందు ఆటంకములు, ఆర్థిక ఇబ్బందులుంటాయి. శుభమూలకధనవ్యయం. అయినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ గలరు. ప్రయాణాలందునష్టాలు కల్గించును. ఊహించని సమస్యలు ఎదురగును.

మార్చి:- ఈనెలజన్మరాశియందు గ్రహసంచారం వల్ల అనేక ఇబ్బందులు కలుగును. అన్నిరంగాలవారికి చేయువృత్తి వ్యాపారాలందు అనుకూలత ఉండదు. ఆర్ధికసమస్య లుంటాయి. ఉష్ణ జ్వరం, నేత్ర పీడలు కలిగించును. ధైర్యం కోల్పోవుదురు. లోలోపల భీతి కలవరం కలిగించు సంఘటనలు అనేకం జరుగును.

===============================

సంవత్సర ఫలాలు – మీనం

మీన రాశి ఫలితములు :

పూర్వాభాద్ర 4వ పాదం (దీ)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దూ, ఞం,ఝ,థా)
రేవతీ 1,2,3,4 పాదములు (దే, దో, చా, చి )

 

* ఆదాయం-2 * ఖర్చు-8 * పూజ్యత-1 * అవమానం-7

మీన రాశి గ్రహ సంచార సారాంశము

గురువు: 13-04-2022 నుండి 21-03-2023 వరకు లగ్నమునందు మీనరాశి యందునూ గురు సంచారము.

శని: 29-04-2022 నుండి 11-07-2022 వరకు ద్వాదశ స్థానమగు కుంభరాశియందునూ 12-07-2022 నుండి 16-01-2023 వరకు ఏకాదశ స్థానమునందు మకరరాశియందు వక్రముగా సంచారము 17-01-2023 నుండి సంవత్సరాంతము వరకు ద్వాదశ స్థానము నందు కుంభమునందు శని సంచారము.

రాహువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు ద్వితీయ స్థానమునందు మేషరాశి యందు రాహువు సంచారము.

కేతువు: 12-04-2022 నుండి 25-03-2023 వరకు అష్టమ స్థానమునందు తులారాశియందునూ కేతువు సంచారము.

అదృష్టం – పూర్వాభాద్రవారు పుష్యరాగము, ఉత్తరాభాద్రవారు ఇంద్రనీలము, రేవతివారు పచ్చరాయి ఉంగరముల ధరించుటచే మేలు కలుగును. ఈ రాశి వారికి 1-3-4-5 7-9 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, గురు, శుక్ర వారములు అదృష్టవారములు. స్టార్. 3.

నెలవారీ జాతక ఫలితములు

2022 జనవరి – ఈ నెలయందు ఋణములు తీర్చెదరు. రావల్సిన ధనము వచ్చును. ఖర్చులు పెరుగును. బంధుమరణ చింతలు అధికము. ఉద్యోగ వ్యాపార వృత్తులందు మిశ్రమాదాయములు వస్తాయి. తృప్తితో జీవించుము. దోపిడి దారుల సాహవాసము చేయవద్దు. స్త్రీ వాదములు పెడచెవి పెట్టండి. సంతాన సమస్యలు వచ్చును. అశ్వత్థ నారాయణ పూజలు చేయండి. కుటుంబ కార్యాలు పూర్తి చేస్తారు. పిల్లల చదువులు గూర్చి శ్రమించెదరు. దూర ప్రయాణములు చేస్తారు.

2022 ఫిబ్రవరి – ఈ నెలయందు గ్రహములు అనుకూలము. ధనవ్యయము. జాగ్రత్తలు పొందుట ముఖ్యము. వ్యవహార చిక్కులు వచ్చినా భయము వలదు. కార్యం అనుకూలంగా యుంటాయి. ఆకస్మిక తనిఖీలు వ్యాపారమునందు వస్తాయి. దూరపు బంధువుల రాకలు అనుకూలిస్తాయి. శని ప్రభావముచే కొంత ఆరోగ్య స్థితి మందగించును. వ్యవహారములందు ఆదాయవ్యయములు సమము. రావల్సిన బాకీలు వస్తాయి.

2022 మార్చి – ఈ నెల యందు ఆరోగ్యము బాగుగాయుండును. స్త్రీ సౌఖ్యము. మాట పట్టింపులు తొలగించును. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు మిశ్రమ స్పందన వస్తుంది. అన్నియునూ అనుకూలమే. యాత్రలు చేస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయ వ్యయాలు సమానంగానుంటాయి. క్రయ విక్రయాలందు జాగ్రత్తను పాటించుట ముఖ్యము.

2022 ఏప్రియల్ – ఈ నెల యందు చెప్పుకోదగ్గ మార్పులు లేవు. వ్యాపారము సాఫీగా జరుగును. వృత్తియందు ధనాదాయము. పొగడ్తలకు లొంగవద్దు. ఆందోళనలు బాధించవు. పిల్లల భవిష్యత్తు అనుకూలము. స్వాములకు మొక్కులు తీర్చండి. వ్యాపారములందు ఆర్థిక స్థితిగతులు విచారించాలి. కీర్తి గౌరవాలు వృత్తియందు లభిస్తాయి. పిల్లల వివాహములు విచిత్రముగా జరుగుతాయి. అనయకుల సాహవాసమునందు పిల్లల భవిష్యత్తు చూచుట ముఖ్యము.

2022 మే – ఈ నెల యందు కోప స్వభావముతో కార్యములు చేస్తారు. ఉద్యోగములందు సరియైన పద్ధతి లోపించును. వ్యాపారము అధికారులతోనుంటుంది. వృత్తి పనులు సామాన్యముగానుంటాయి. వ్యవహార చిక్కులు వస్తాయి. శారీరక మానసిక బాధలు వరిస్తాయి. సాహసించి పనులు పూర్తి చేస్తారు. స్త్రీ వాక్యములను పాటించుట ముఖ్యము. నరదృష్టి దోషాలు బాధలు కొన్ని వస్తాయి. కాలభైరవ పూజలు చేయుట మంచిది. ముఖ్యము.

2022 జూన్ – ఈ నెలయందు పిల్లల భవిష్యత్తు అనుకూలము. వివాహాది విషయములు చర్చకు వస్తాయి. వృత్తి వ్యాపారములు ధనాదాయము సామాన్యము. అశాంతి కార్యములు సాధిస్తారు. దేవీ పూజ తప్పక ఆచరించండి. గౌరవములు వస్తూయున్నా అసూయలు అధికముగానుంటాయి. వ్యవహారములందు ఆదాయ వ్యయములు అనుకూలంగానుంటాయి. కామాక్షి దేవి పూజలు చేయుట మంచిది.

2022 జూలై – ఈ నెల యందు సమస్యలు వస్తాయి. ధనవ్యయం చేస్తారు. పుత్ర పుత్రికల కార్యాలు పూర్తి చేస్తారు. శారీరక మానసిక వ్యాధులు ప్రబలును. వాహన యోగ్యత వచ్చును. కుటుంబ బంధువర్గమైత్రి అనుకూలము. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మంచి వ్యాపారములు వచ్చినా ధనము సాధించుట యందు విఫలము అగుదురు. వ్యవహార చిక్కులు వస్తాయి. శనివారములందు శనేశ్వర పూజలు చేయుట.

2022 ఆగష్టు – ఈ నెలయందు ఆరోగ్యములో కొద్దిగా మార్పులు రావచ్చును. మిశ్రమాదాయము వచ్చును. ఆదాయము కష్టములు ఖర్చుపెట్టుట మంచిది. ధనమును అప్పులుగా ఇవ్వవద్దు. ఇంటి అద్దెలు అధికము. స్థాన చలనములు వస్తాయి. ఆర్థికంగా అనుకూలంగాయున్నా సమస్యలు వెంటాడుతాయి. సౌఖ్యము కలదు. భార్యాబిడ్డలతో శుక్రవారములందు పూజలు చేయుట మంచిది.

2022 సెప్టెంబర్ – ఈ నెలయందు ఆరోగ్యము బాగుగాయుండును. స్త్రీ సౌఖ్యము లభించును. మాట పట్టింపులు వస్తాయి. అన్ని రంగముల వారికి ధనాదాయము పెరుగుతుంది. అధిక ఖర్చులకు దూరంగాయుండుట మంచిది. నీచులతో స్నేహము వద్దు ఆరోగ్యము కుదురుగాయుండును. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములు ఆర్ధిక పుష్టిగాయుండును. నవగ్రహ పూజ చేయండి.

2022 అక్టోబర్ – ఈ నెల యందు మనోబలం మిమ్ములను కాపాడుతుంది. ప్రతి అడుగునూ జాగ్రత్తగా చేయాలి. లోపాలు వెతికేవారు ఉండవచ్చు. ఆలోపములు మనకు జీవనం కావు. ప్రతి పనియందునూ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి. శాంత చిత్తంతో ఆలోచించి పనులు చేయండి. అధికారులతో సామరస్యముగా మెలగండి. ఆదిత్య హృదయం చదవండి. ఆరోగ్యముపై శ్రద్ధ పెంచండి. అపార్థాలకు తావివ్వకండి. బుద్ధి బలముతో అధికమించండి.

2022 నవంబర్ – ఈ నెల యందు సంకల్పసిద్ధియుంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ధర్మమార్గములో పయనించండి. మనోబలము మిమ్ములను కాపాడుతుంది. ఋణ సమస్యలు బాధించును. సామరస్యముగా వ్యవహరించండి. తగాదాలకు దూరంగా యుండండి. విశిష్టమైన కార్యసిద్ధికి అవకాశము ఉన్నది. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగుట మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ నెలయందు ధనలాభాదులు బాగుగాయుండును.

2022 డిసెంబర్ – ఈ నెల యందు దూరపు ప్రాంతాల ముఖ్య సమాచారములు వస్తాయి. బాంధవ్య విషయ చర్చలు జరుగుతాయి. వివాహ విషయ చర్చలు రావచ్చును. దూరపు వ్యాపారులు వస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు అనుకూలముగా ధనలాభాదులు సాగుతాయి. అన్నియునూ అనుకూలముగానుంటాయి. రాజకీయ వర్గాలకు పదవీయోగములు లభించును. తిరుపతి దేవుని సందర్శించుట శుభయోగము.

జనవరి:- ఈ నెలయందు కూడా బాగుండును. అన్నిరంగాల వారికి అనుకూలమే. దూర ప్రయాణాలు చేయవలసివచ్చును. ఆదాయం బాగుండును. వస్తు, వస్త్ర ప్రాప్తి, పాతమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలసి విందులు వినోదములు. స్పెక్యులేషన్లో లాభములు. ప్రయాణ సౌఖ్యం. నూతన పరిచయ లాభములు.

ఫిబ్రవరి:- ఈ నెలయందు చేయువృత్తి వ్యాపారాలందు రాణించెదరు. ఆదాయం ఎంతవచ్చి మంచినీళ్ళవలె ఖర్చగును. గృహంలో శుభకార్యాలు జరుగుట లేదా ఈ హాజరగుట జరుగును. వ్యవహారాలు అనుకూలించును. స్ర్తీమూలకంగా లేదా వ్యసనములు ద్వారా ధనవ్యయం జరుగును. సంతాన సౌఖ్యం. కుటుంబ సౌఖ్యం.

మార్చి:- ఈ నెల గ్రహసంచారంగా అంతా అనుకూలంగా ఉండదు. చేయువృత్తి వ్యాపారములందు రాణింపు ఉండదు. అనుకోని సమస్యలు, ఖర్చులు వచ్చును. భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగాలు తప్పవు. ఇతరులను పరామర్శలు చేయవలసి వచ్చును. సంతానము పరీక్షలు బాగా వ్రాయలేరు. మీలో పట్టుదల లోపించును. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే.

===============================

Girish Panthulu sirimalli.com
Girish Panthulu sirimalli.com

For More Updates Follow us on – Sirimalli Page