2024-07-27 06:02:10
Today Horoscope: ఆ రాశివారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు! (17-6-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశివారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు! (17-6-2023)

Today Horoscope: ఆ రాశివారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు! (17-6-2023)

SREE KRUPA (17-6-2023) రాశి ఫలితాలు

మేషం – 17-6-2023

Today Horoscope:ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం – 17-6-2023

దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

మిధునం – 17-6-2023

వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.

కర్కాటకం – 17-6-2023

కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

సింహం – 17-6-2023

విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.

కన్య – 17-6-2023

ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళాకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

తుల – 17-6-2023

ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు.

వృశ్చికం – 17-6-2023

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం.

ధనస్సు – 17-6-2023

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యలనుండి చాకచక్యంగా బయట పడతారు.

మకరం – 17-6-2023

కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.

కుంభం – 17-6-2023

ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసి రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

మీనం – 17-6-2023

ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page