2024-06-23 03:52:01
Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు  – Sirimalli.com

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – మేషం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023 : ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నవి సంవత్సర ప్రారంభమున అనవసర ధనవ్యయము, రాబడికి మించిన ఖర్చులు, శుభకార్య మూలక ధనవ్యయము శరీర అనారోగ్యములు వాహన ప్రమాద సూచనల్నువి. మానసికంగా కొంత గందరగోళ పరిస్థితున్నవి. బంధు వర్గముతో అకారణ వివాదములు. పనులందు ఆటంకములు. ఉద్యోగులకు పూర్తి అనుకూల ఫలితములు కలుగును. అధికారుల మన్ననలు పొందగలరు. నిరుద్యోగులకు కొంత ఊరట కలుగును. నూతన ప్రయత్నములు ఫలించును. వ్యాపారులకు అనుకూలము. విశేషామైన లాభార్జన చేయగలరు. పనులు అనుకున్న సమయానికి నెరవేరగలవు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందగలరు. శ్రమకు తగ్గ ఫలితములు కలుగును. సినిమా రంగంవారికి మిశ్రమ ఫలితములుండును. చేపల /రొయ్యల చెరువుల వారికి సామాన్యముగా ఉండును. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితములు కలుగును. శివారాధన చెయ్యడం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించడం మంచిది.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – వృషభం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. సంవత్సర ప్రారంభమున పనులందు కార్యజయం. ఆర్థిక వ్యవహారములు యందు పురోగతి కలుగును. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగును. మొండిబాకీలు వసూలగును. ఇంటియందు శుభకార్య ప్రయత్నము నెరవేరును. సంఘమున గౌరవం పెరుగును. చేయువృత్తి, వ్యాపారములలో ఆదాయము బాగుండును. మధ్య కాలమున అనారోగ్యములు తప్పవు. మానసిక అశాంతి కలుగును. విద్యార్థులకు మిశ్రమ ఫలితం కలుగును. ఉద్యోగులకు అనుకూలం కాదు. స్థాన చలనములు అధికారుల వలన సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు అనుకూలము కాదు. వ్యాపారులకు అనుకూలం కాదు. నష్టములు తప్పవు. నూతన వ్యాపార ప్రయత్నములు లాభించవు. చిన్నతరహా పరిశ్రమలవారికి శ్రమ పెరుగును. కళాకారులకు వ్యతిరేక ఫలితములుండును. అవమానములు అధికం. సినిమా రంగం వారికి నిరాశాజనకముగా ఉండును. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు జాగ్రత్త అవసరం. చేపట్టిన కార్యక్రమములు వాయిదాపడును. రాజకీయ నాయకులు ఒత్తిడి అధికము. దుర్గా అమ్మవారిని ఆరాధించాలి. శ్రీ కాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజ చేయించాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – మిథునం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభ ఫలితములు అధికము. తలచిన కార్యములన్నియు అనుకున్న పనులు నెరవేరును. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటియందు బంధుమిత్ర సమాగమములతో శుభకార్యములతో ఆనందముగా ఉండును. చేపట్టిన పనులలో మనోధైర్యముతో ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేయుదురు. భూ, గృహ నిర్మాణాది కార్యములు నెరవేరును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన రాజకీయ పదవీ లాభము కలుగును. ఆరోగ్య లాభము విశేష ధన ప్రాప్తి. విద్యార్థులకు అనుకూల ఫలితములు కలుగును. ఉద్యోగులకు పూర్తి అనుకూల కాలము. అనుకున్న చోటకు స్థాన చలనములు పొందగలరు. పై అధికారుల వలన సౌఖ్యము కలుగును. నిరుద్యోగులకు అనుకూల కాలము. వ్యాపారములు అభివృద్ధి బాటలో సాగుతాయి. కళాకారులకు అనుకూలము. సినిమా రంగం వారికి పూర్తి అనుకూలం. చేపల /రొయ్యల చెరువుల వారికీ విశేషంగా లాభిస్తాయి. విశేషమైన లాభార్జన చేయగలరు. రాజకీయ నాయకులకు అనుకూల కాలము. నూతన పదవులు పొందగలరు. సుబ్రమణ్య స్వామి ఆరాధన చెయ్యడం మంచిది. సుబ్రమణ్య కవచం పారాయణం చెయ్యాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – కర్కాటకం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభా శుభ మిశ్రమ ఫలితములతో నుండును. సంవత్సర ప్రారంభమున కొంత అనుకూల వాతావరణము ఉండును. ధన వ్యయము. అనారోగ్య సూచనలున్నవి. కుటుంబ వాతావరణము కొంత అనుకూలముగా నుండును. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలిగి ఉత్సాహముగా నుండును, బంధు, మిత్రులు సహకరించగలరు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించును. చేపట్టిన పనులు ఆలస్యము మీద నెరవేరును. ఆర్ధిక సమస్యల నుండి కొంత బయటపడగలరు. చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులయందు స్థాన చలనములు కలుగును. రాజకీయ నాయకులకు వ్యతిరేకత పెరుగును. విద్యార్ధులకు అనుకూలం కాదు. ఉద్యోగులు అధికారులతో సమస్యల వలన స్థాన చలనములు తప్పవు. నిరుద్యోగులు మరికొంత కాలము వేచిచూడక తప్పదు. ఉద్యోగ ప్రయత్నములు ఫలించవు. నూతన వ్యాపారములు అనుకూలము కాదు. కళాకారులకు కూడా అంత అనుకూలం కాదు. గౌరవము తగ్గును. సినిమా రంగము వారికి అంతంత మాత్రంగా ఉండును. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు జాగ్రత్త అవసరం. తరుచు ఆటంకములతో సమస్యల నెదుర్కొనక తప్పదు. రాజకీయ నాయకులకు కష్ట కాలము. పదవీ నష్టముతో ఇబ్బంది పడుదురు. శనివారం తైలాభిషేకం చేయించాలి. హనుమాన్ విష్ణు స్తోత్రాలు పారాయణం చెయ్యాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – సింహం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండును. తరుచుగా అనారోగ్యము, బంధు, మిత్ర కలహములతో చికాకుగా నుండును. అనుకున్న పనులన్నియూ వాయిదా పడును. దూరప్రాంత ప్రయాణములు జాగ్రత్త అవసరం. ఇతరుల వలన అవమానములు తప్పవు. ఇంటియందు శుభకార్యములు వాయిదా పడును. మనఃశాంతి లోపించును. సంఘ గౌరవము తగ్గును. నూతన గృహ నిర్మాణాది కార్యములు మందకొడిగా నడుచును. అధిక ధనవ్యయమగును. నూతన ఋణము చేయవలసి వచ్చును. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అధికంగా చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగములయందు వ్యతిరేకత ఫలితాలుంటాయి. విద్యార్థులకు అంత అనుకూలం కాదు. నిరుద్యోగ ప్రయత్నములు కలసిరావు. ఉద్యోగులకు అధికారుల నుండి పూర్తి వ్యతిరేకముగా నుండును. వ్యాపారులకు కష్టకాలము, నష్టములు తప్పవు. కళాకారులకు నిరాశ ఎదురగును. అవమానముల నెదుర్కొందురు. సంఘ గౌరవము తగ్గును. సినిమా రంగము వారికి వ్యతిరేక సమయం. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు, జాగ్రత్త అవసరం నష్టములు తప్పవు. రాజకీయ నాయకులకు పూర్తి వ్యతిరేకం. సంఘంలో గౌరవము తగ్గును. శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. దుర్గా అమ్మవారిని ఆరాధించాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – కన్య

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండును. అనారోగ్యము బాధించును. ఔషద సేవనం తప్పదు. వాహన ప్రయాణమున జాగ్రత్త అవసరం, మానసిక అశాంతత, బంధు, మిత్ర కలహములతో ఇబ్బందులు తప్పవు. కోర్టు కేసులయందు కొంత అనుకూలము, మీ మాటకు విలువ, గౌరవము పెరుగును. సంఘమునందు పేరు, ప్రఖ్యాతలు పెరుగును. ఉద్యోగులకు అనుకూల కాలము. అనుకున్న చోటుకు స్థానచలనములు పొందగలరు. పై అధికారుల మెప్పు పొందగలరు. నిరుద్యోగ ప్రయత్నములు సఫలం కాగలవు. వ్యాపారులకు విశేష లాభము కలుగును. నూతన వ్యాపారములు ప్రారంభించెదరు. కళాకారులకు విశేషమైన కాలము. అన్నింటా విజయము సాధించగలరు. సంఘ గౌరవము పెరుగును. సినిమా రంగం వారికి అనుకూలము. చేపల /రొయ్యల చెరువుల వారికి అనుకూలంగా ఉన్నది. ధనవృద్ధి కలుగును. గుర్తింపు లభించును. రాజకీయ నాయకులకు అనుకూలం. సంఘ గౌరవం పెరుగును. సమాజంలో ప్రముఖుల ప్రోత్సాహములు లభించగలదు. నూతన పదవీ లభించును. లక్ష్మి దేవి ఆరాధన చెయ్యాలి. కనకదార స్తోత్రం పారాయణం చెయ్యాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – తుల

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. అధిక ధన వ్యయం, అన్నింటా ఆటంకములు, శతృబాధలు. అనుకున్న పనులన్నియూ చివరి వరకు ఆటంకములతో ఆగిపోవుట జరుగును. గృహ నిర్మాణ పనులు వాయిదా పడును. శత్రు బాధలు మానసిక ఆశాంతి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గును. దాయాదులతో కలహములు ఏర్పడును. శుభకార్యములు వాయిదా పడును. విద్యార్థులకు పూర్తి వ్యతిరేకముగా నుండును. అనారోగ్య సమస్యలు, ఆటంకములతో ఇబ్బంది తప్పదు. నిరుద్యోగులకు అనుకూలము కాదు. ఉద్యోగులకు నిరాశ కలుగును. సమయానికి పై అధికారులు సహకరించరు. వ్యాపారులకు కష్టకాలము, నూతన ప్రయత్నములు వాయిదా పడును. కళాకారులకు ఆటంకములతో ఇబ్బంది పడుదురు. సినిమారంగం వారికి నిరాశ తప్పదు. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు. ఆర్ధిక సమస్యలు అధికం. నూతన కార్యక్రములు ఆటంకములతో ఆగిపోవును. నూతన ప్రయత్నములు ఫలించవు. రాజకీయ నాయకులకు వ్యతిరేకత తప్పదు. నమ్మిన వారి వలన మోసము కలుగును. వినాయకుని ఆరాధనా చెయ్యాలి. శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజ చేయించాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – వృశ్చికం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. కొంత అనుకూల వాతావరణము ఉండును. పనులందు కార్యసిద్ధి కలుగును. ఆకస్మిక ధన లాభము కలుగును. శతృవులు అణిగిమణిగి ఉందురు. బంధు మిత్ర సహాయం. అర్ధాష్టమ శని ప్రభావముచే సర్వకార్యములయందు అపజయము కలుగును. శుభకార్యమూలక ధనవ్యయము అగును. సంఘము నందు గౌరవ మర్యాదలు తగ్గును. విద్యార్ధులకు మిశ్రమ ఫలితములు కలుగును. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. నిరుద్యోగ ప్రయత్నములు కలసిరావు. ఉద్యోగులకు కష్టకాలము ఊహించని స్థాన చలనములు కలుగును. అధికారుల వలన సమస్యలు తప్పవు వ్యాపారులకు అనుకూల కాలము కాదు. నూతన వ్యాపార ప్రయత్నములు ముందుకు సాగవు. కళాకారులు అసంతృప్తి కలుగును. ప్రోత్సాహము లేక నిరాశగా నుందురు. సినిమా రంగం వారికి అనుకూలము కాదు. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు పదవీ భంగం కలుగును. నూతన పదవులు ఆశ కలిగిన ఫలితము ఉండదు. ప్రజల మద్దతు కోల్పోవుదురు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి. శని కవచం పారాయణం శనికి తైలాభిషేకం చేయించాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – ధనస్సు

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభా శుభ మిశ్రమ ఫలము కలుగును. సంవత్సర ప్రారంభమునందు మిశ్రమ ఫలితములతో. నుందురు. అప్రయత్న ధన లాభము, పనులందు విజయములతో, సుఖ సంతోషములతో నుండగలరు. మనోదైర్యము పెరుగును. అనుకున్న పనులన్నియు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధు, మిత్ర సహకారము కొన్ని కార్యక్రమములు పూర్తి చేయుదురు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. దాయాదులతో కలహ సూచనలున్నవి. నూతన వస్తు, వాహనములు సమకూర్చుకొందురు. విద్యార్థులకు అనుకూల కాలము, నిరుద్యోగులకు ప్రయత్నములు ఫలించును. నూతన ఉద్యోగ ప్రయత్నములు సానుకూలమగును. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందును. వ్యాపారులకు పూర్తి అనుకూల కాలము. నూతన వ్యాపారప్రారంభ ప్రయత్నములు ఫలించును. కళాకారులుకు ప్రోత్సాహకరముగానుండును. నూతన ప్రయత్నములు ఫలించి విజయం సాధించగలరు. సినిమా రంగం వారు పురోగతి సాధించును. చేపల /రొయ్యల చెరువుల వారికి అనుకూల వాతావరణం ఉన్నది. కొత్త ఆలోచనలతో కొత్త అవకాశములతో ముందుకు పోగలరు. కీర్తి, ప్రతిష్టలు పెరుగును. రాజకీయ నాయకులకు మర్యాద, గౌరవం పెరుగును. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం. సూర్య నమస్కారములు చేసుకోవాలి.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – మకరం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితములు కలుగును. చేపట్టిన పనులు కలహాలతో, ధన క్షయముతో మందకొడిగా సాగును. ధైర్యము తగ్గును. అనారోగ్య సమస్యలు బాదించును. బంధు, మిత్ర వైరములు దాయాదులతో కలహ సూచనలున్నవి. అధిక ధనవ్యయము చేసినా గాని పనులు పూర్తి కావు. ఋణ బాధలు పెరుగును. విద్యార్థులకు అనుకూల కాలము కాదు. నిరుద్యోగులుకు అనుకూలం కాదు. ఆశించిన ఉద్యోగము పొందటం కష్టం . ఉద్యోగులకు పూర్తి వ్యతిరేక ఫలితములుండును. పై అధికారుల ఆదరణ పొందలేరు. వ్యాపారులకు పూర్తి నిరాశ ఎదురగును. కళాకారులకు అవమానములు ఎదురగును. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలరు. వివాదములు కలుగును. గౌరవ మర్యాదలకు లోటు తప్పదు. సినిమా రంగం వారికి కష్ట కాలము. నష్టముల బాట పట్టెదరు. క్రొత్త ప్రాజెక్టులు నిలిచిపోవును. రాజకీయ నాయకులకు గడ్డు కాలము. పదవీ భంగము కలుగును. ప్రజల మద్దతు పొందలేరు. మనస్తాపము కలుగును. శని స్తోత్రం పారాయణం, తైలాభిషేకం చేయించాలి. హనుమాన్ చాలీసా పారాయణం లేనివారికి అన్న వస్త్ర దానాలు చెయ్యడం మంచిది.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – కుంభం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితములతో సతమతమగుదురు. తలిచిన కార్యములు ఆలస్యము మీద నెరవేరును. ధనమునకు లోటు ఉండదు. నూతన విద్యా లాభము కలుగును. కార్యజయం సిద్దించును. గౌరవ మర్యాదలు పెరుగును. జ్వరాది అనారోగ్య బాధలు కలుగును. వాహన ప్రమాద సూచనలున్నవి. అకారణ కలహము కలుగును. ఆర్ధిక వ్యవహారములు మందకొడిగా ఉన్న కొంత లాభకరముగా నుందును. సంఘ గౌరవ మర్యాదలు పెరుగును. విద్యార్థులకు అనుకూలము లేదు. నిరుద్యోగులకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవు. ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు కలుగును. వ్యాపారులకు నిరాశ తప్పదు. నూతన వ్యాపార ప్రారంభమునకు సరియైన సమయం కాదు. ఆర్ధిక నష్టములతో మనోవేదనకు గురి అగుదురు. కళాకారులకు గౌరవ మర్యాదలు తగ్గును. విలువ తగ్గును, సినిమా రంగం వారికి పూర్తి వ్యతిరేక కాలము. చేపల /రొయ్యల చెరువుల వారికి సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పూర్తి నిరాశ నిస్పృహలకు లోనగుదురు. ప్రజల మద్దతు కోల్పోవుదురు. పదవీ భంగము కలుగును. శని స్తోత్రం పారాయణం చెయ్యడం. శనికి తైలాభిషేకం చేయించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యడం మంచిది.

ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు – మీనం

2023 – ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు

ఈ సంవత్సరం అంత శుభాశుభ మిశ్రమ ఫలము కలుగును. మనస్సు స్థిరముగా లేకుండును. ప్రతి వ్యవహారములో ఆలోచన అధికమై కాలయాపన చేయుదురు. వృధా ఖర్చులు అధికం . బంధుమిత్ర కలహములతో ఇబ్బంది పడుదురు. జ్వరాది శరీర అనారోగ్యములు బాదించును. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. నూతన ఋణ ప్రయత్నములు చేయుదురు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులయందు ఒత్తిడి పెరుగును. పై అధికారుల వలన మాట పడవలసి వచ్చును. వ్యాపారులకు పూర్తి వ్యతిరేకము నష్టములు తప్పవు. కళాకారులకు గౌరవ మర్యాదలు తగ్గును. గుర్తింపు లేకుండును. వృధా సంచారము చేయును. సినిమా రంగం వారికి నిరాశా కాలము. చేపల /రొయ్యల చెరువుల వారికి అంత అనుకూలం లేదు జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు పదవీభంగం కలుగును. ప్రభుత్వ, ప్రజా మద్దతి కోల్పోవుదురు. ఆశలు అడియాశలు అగును. స్పెక్యులేషన్ లాభించదు. శివరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యడం మంచిది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page