2024-07-27 10:29:37
Today Horoscope: ఆ రాశివారికి ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి! (16-6-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశివారికి ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి! (16-6-2023)

Today Horoscope: ఆ రాశివారికి ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి! (16-6-2023)

SREE KRUPA (16-6-2023) రాశి ఫలితాలు

మేషం – 16-6-2023

Today Horoscope:ప్రయాణాలు శ్రమాధిక్యత. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

వృషభం – 16-6-2023

సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోమున సమస్యలు తొలగుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిధునం – 16-6-2023

ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.చేతిలో డబ్బు నిలువదు. వృధా ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం – 16-6-2023

ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సింహం – 16-6-2023

సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.

కన్య – 16-6-2023

నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

తుల – 16-6-2023

మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

వృశ్చికం – 16-6-2023

కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

ధనస్సు – 16-6-2023

భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం – 16-6-2023

కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

కుంభం – 16-6-2023

మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మీనం – 16-6-2023

సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page