2024-07-27 04:49:38
Today Horoscope: ఆ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు! (15-07-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు! (15-07-2023)

Today Horoscope: ఆ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు! (15-07-2023)

SREE KRUPA (15-07-2023) రాశి ఫలితాలు

మేషం – 15-07-2023

Today Horoscope: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం – 15-07-2023

ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి.

మిధునం – 15-07-2023

నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం – 15-07-2023

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.

సింహం – 15-07-2023

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య – 15-07-2023

వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయట పడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల – 15-07-2023

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని వత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం – 15-07-2023

సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు – 15-07-2023

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

మకరం – 15-07-2023

భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ ఉన్నవి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభం – 15-07-2023

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం – 15-07-2023

వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page