2024-07-27 06:16:41
Today Horoscope : ఆ రాశి వారికి స్నేహితుల నుండి ధనసహాయం! ( 12-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి స్నేహితుల నుండి ధనసహాయం! ( 12-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి స్నేహితుల నుండి ధనసహాయం! ( 12-03-2022 )

SREE KRUPA (12-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 12-03-2022

Today Horoscope : నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ పరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం – 12-03-2022

ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలించవు.

మిధునం – 12-03-2022

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం – 12-03-2022

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఋణ భారం అధికమౌతుంది. వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి.

సింహం – 12-03-2022

స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి దీర్ఘకాలిక రుణాల తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య – 12-03-2022

నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది.

తుల – 12-03-2022

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం – 12-03-2022

అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ధనస్సు – 12-03-2022

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

మకరం – 12-03-2022

చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది.

కుంభం – 12-03-2022

ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం – 12-03-2022

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page