2024-06-13 19:55:54
Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు.. – Sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు..

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు..

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమ క్రమంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. దాయాదుల తో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అకారణ వివాదాలు కలుగుతాయి వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సోదరులు, మిత్రుల నుంచి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి.అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధు వర్గంతో వివాదాలు తప్పవు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చెయ్యడానికి మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.భూ క్రయవిక్రయాలకు అనుకూలంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. పాత మిత్రుల నుండి అందిన ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని రంగాల వారు సమస్యలను పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. వారం చివరిలో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులు ఆగ్రహం వలన స్థాన చలనాలు తప్పవు కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వారం ప్రారంభంలో ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతాన విద్యా యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కొన్ని సంఘటనలు బాధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రులతో కలహా సూచనలున్నవి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు చాలా కాలంగా బాదిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో ఒక వ్యవహారంలో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. కీలక సమయంలో నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు కలుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం చివరిలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. శనీశ్వరస్వామి కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరస్తి విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన గోపాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (06-03-2022) నుండి (12-03-2022) వరకు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఇంట బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దూరపు బంధువుల ఆగమనం ఆనందానిస్తుంది. స్థిరస్తి వివాదాలు కొంత బాధిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.చిన్న తరహా పరిశ్రమలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహనయోగం ఉన్నది. శివ సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Girish Purohithulu sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read :

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (06-03-2022)

Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

 

For More Updates Follow us on – Sirimalli Page