2024-07-27 05:38:18
Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం (11-10-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం (11-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం (11-10-2022)

 

SREE KRUPA (11-10-2022) రాశి ఫలితాలు

 

మేషం – 11-10-2022

Today Horoscope : అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం – 11-10-2022

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మిధునం – 11-10-2022

ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటకం – 11-10-2022

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది.

సింహం – 11-10-2022

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య – 11-10-2022

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు.

తుల – 11-10-2022

మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం – 11-10-2022

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి.

ధనస్సు – 11-10-2022

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు.

మకరం – 11-10-2022

బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభం – 11-10-2022

మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

మీనం – 11-10-2022

కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఊహించని లాభాలు ( 09-10-2022 నుంచి 15-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page