Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఊహించని లాభాలు ( 09-10-2022 నుంచి 15-10-2022)

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఊహించని లాభాలు ( 09-10-2022 నుంచి 15-10-2022)

 

SREE KRUPA

 

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందారు. సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం ప్రారంభంలో గణపురంలో ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. లక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. విద్యార్థుల కష్టం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చిన్ననాటి మిత్రుడుతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి. వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన శుభకార్యాలపై కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అవకాశములు అందుతాయి. వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. రామారక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకుగా అనిపిస్తుంది సోదరులతో ఉన్నటువంటి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయటపడగలుగుతారు బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – తుల

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి ఋణ బాధలనుండి బయటపడతారు. భూ సంబంధిత వ్యవహారాలలో దాయదులతో ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలుంటాయి కాలభైరవష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు.ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలో ఒప్పందాలు కలసి వస్తాయి. సంతాన వివాహయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది . చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయ పోంది ఊరట పొందుతారు. నిరుద్యోగుల కష్టం పరుస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులను కలిసే సూచనలు ఉన్నవి నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆత్మీయులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటాబయట పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన విద్యా విషయాలనలో శుభవార్తలు అందుతాయి విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి. బంధువులు, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు.కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార రాశిఫలాలు (09-10-2022 to 15-10-2022) అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చల్లో అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్షఫలితాలు ఆశజనకంగా ఉంటాయి గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. చేపట్టిన పనులలో ఇబ్బందులు కలిగిన పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. దత్తపంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page