Today Horoscope : ఆ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తప్పవా! ( 11-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తప్పవా! ( 11-03-2022 )

SREE KRUPA (11-03-2022) రాశి ఫలితాలు

మేషం – 11-03-2022

Today Horoscope : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

వృషభం – 11-03-2022

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

 మిధునం – 11-03-2022

సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం – 11-03-2022

సోదరులతో స్థిరస్తి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

సింహం – 11-03-2022

ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య – 11-03-2022

సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరులు సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

తుల – 11-03-2022

దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది.నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం – 11-03-2022

చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దైవ సేవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.

ధనస్సు – 11-03-2022

పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం – 11-03-2022

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం – 11-03-2022

కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సమాజసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు అంతంత మాత్రం గా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.

మీనం – 11-03-2022

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దీర్ఘాకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

 

For More Updates Follow us on – Sirimalli Page