Samantha: సామ్ యాడ్‌పై నెటిజన్లు ట్రోల్స్.. నేనలా కాదంటూ పోస్ట్..
Cinema Latest

Samantha: సామ్ యాడ్‌పై నెటిజన్లు ట్రోల్స్.. నేనలా కాదంటూ పోస్ట్..

Samantha: ఇప్పుడు సమంత పేరే ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. బహుశా ఏ హీరోయిన్‌కు ఇంత పాపులారిటీ ఉండదేమో అనిపిస్తోంది సమంత క్రేజ్ చూస్తుంటే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన పేరునే ఓ బ్రాండ్‌లాగా మార్చేసుకుంది సమంత. ప్రస్తుతం సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఆఖరికి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఓ సెన్సేషన్నే సృష్టిస్తోంది. అలా తాజాగా సమంత చేసిన యాడ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సమంత కెరీర్.. తన మాజీ భర్తతో కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’తోనే స్టార్ట్ అయ్యింది. మొదటి సినిమాతోనే సమంత అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా సమంత పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోవడానికి పెద్దగా సమయం ఏం పట్టలేదు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చూపు సమంత వైపే. పాన్ ఇండియా రేంజ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించాలంటే అందరి ముందుగా గుర్తొచ్చే పేరు సామ్‌లాగా మారిపోయింది.

Also Read: https://www.sirimalli.com/varsha-bollamma-says-this-kind-of-movies-are-tough-to-act-ahead-for-stand-up-rahul-movie-release/

సమంత ప్రొఫెషనల్ లైఫ్‌లో రాణిస్తున్నా కూడా.. ప్రేక్షకులు తన పర్సనల్ లైఫ్‌తోనే దాన్ని ముడిపెడుతున్నారు. అందుకే తాను ఎక్కువగా ట్రోలింగ్‌కు కూడా గురవుతూ ఉంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత.. సమంతనే ఆ విడాకులకు కారణమని రూమర్స్ ఎక్కువగా వ్యాపించాయి. సామ్ వాటన్నింటికి సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆ విధంగా రూమర్స్ ఆగిపోయినా కూడా.. తనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. సమంత ఏం చేసినా.. ట్రోలింగ్‌కు గురవ్వక తప్పట్లేదు.

సమంత ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. తను బోల్డ్‌గా చేసిన సన్నివేశాలు కూడా చాలా తక్కువే. అయితే ఉన్నట్టుండి ‘పుష్ప’లో ఐటెమ్ సాంగ్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరోసారి గ్లామర్ డోస్ పెంచేసి, ఎక్స్‌పోజింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది సామ్. ఓ ఆల్కహాల్ బ్రాండ్ ఫోటోషూట్‌లో పాల్గొన్న సామ్.. చాలా ఎక్స్‌పోజ్ అయ్యేలాగా డ్రెస్సులు వేసుకుంది.

Samantha Ad: https://www.instagram.com/reel/Ca3mVBSo4Jp/?utm_source=ig_web_copy_link 

ఆ యాడ్ షూట్‌ను సమంత తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇక అప్పటినుండి తనపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. నెగిటివ్‌గా కామెంట్స్ పెడుతూ ఈ ఫోటోస్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. తాజాగా సామ్ వీటిపై నెగిటివ్‌గా స్పందించినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘యశోద’ సినిమాతో బిజీగా ఉంది సామ్.

అయితే ఆ మూవీ టీమ్ నుండి ఓ వ్యక్తి ‘ఆడపులిలాంటి సమంతతో కొత్త ప్రాజెక్ట్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ‘నిన్నటి తర్వాత ఆడపులిలాగా ఫీల్ అవ్వట్లేదు’ అంటూ ఆ పోస్ట్‌ను షేర్ చేసింది సామ్. అయితే ఉన్నట్టుండి సామ్ ఎందుకిలా రియాక్ట్ అయ్యింది? ట్రోల్స్ వల్లే ఇలా అనుకుంటుందా? అని పలువురు అనుమానిస్తున్నారు.