Today Horoscope: ఆ రాశి వారికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది! (1-1-2023)

Today Horoscope: ఆ రాశి వారికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది! (1-1-2023)

 

SREE KRUPA (1-1-2023) రాశి ఫలితాలు

మేషం – 1-1-2023

Today Horoscope: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభం – 1-1-2023

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

మిధునం – 1-1-2023

నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం – 1-1-2023

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

సింహం – 1-1-2023

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.

కన్య – 1-1-2023

నూతన ఋణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

తుల – 1-1-2023

ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం – 1-1-2023

దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ధనస్సు – 1-1-2023

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకరం – 1-1-2023

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

కుంభం – 1-1-2023

వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీనం – 1-1-2023

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page