Today Horoscope: ఆ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది! (31-12-2022)

Today Horoscope: ఆ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది! (31-12-2022)

 

SREE KRUPA (31-12-2022) రాశి ఫలితాలు

మేషం – 31-12-2022

Today Horoscope: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పొటీపరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

వృషభం – 31-12-2022

వృత్తి, వ్యాపారాలలో కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి.

మిధునం – 31-12-2022

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగులల్లో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

కర్కాటకం – 31-12-2022

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగువుతాయి.

సింహం – 31-12-2022

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది.

కన్య – 31-12-2022

ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం.

తుల – 31-12-2022

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహయత్నాలు అనుకులిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ణకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.

వృశ్చికం – 31-12-2022

వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

ధనస్సు – 31-12-2022

వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు నుండి ఉపశనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మకరం – 31-12-2022

వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి.

కుంభం – 31-12-2022

వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి వివాదాలుంటాయి. నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి.

మీనం – 31-12-2022

క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page