2024-07-27 06:05:04
Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా బాలీవుడ్ ఎంట్రీ? – Sirimalli.com

Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా బాలీవుడ్ ఎంట్రీ?

Sara Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. ఇప్పటికే 24 ఏళ్ల సారాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మోడల్ గా చేస్తోంది. ఇందులో సౌందర్యంతోపాటు ఫ్యాషన్ ప్రోడక్టులు కూడా ఉన్నాయి. తన ఇన్ స్టా్గ్రామ్ ఖాతాను చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే తన మోడలింగ్ కు సంబంధించి ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.

ఈమధ్య సారా టెండూల్కర్ ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అది బాలీవుడ్ ఎంట్రీ కోసమే అని ఇండస్ట్రీ అంతా భావిస్తోంది. సారాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమంటే.. అందులో మరింత పట్టు సాధించడానికి వీలుగా యాక్టింగ్ కోర్సు కూడా చేస్తోంది. టెండూల్కర్ కూడా తన కూతురు ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చాడని.. అందుకే ఆమెను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తు్న్నాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

సెలబ్రెటీల చూపంతా ఎక్కువగా బాలీవుడ్ లో ఎంట్రీపైనే ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అవ్వచ్చు. సాధారణమైన ప్రజలతో పోలిస్తే.. సెలబ్రెటీలకు ఇందులో ఎంట్రీ ఇవ్వడం సులభం. పైగా సచిన్ కు బాలీవుడ్ సెలబ్రెటీలతో మంచి పరిచయాలున్నాయి. ఆయనో మాట చెబితే.. స్టార్ ప్రొడ్యూసర్లు కూడా సారాతో సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే సారా కూడా తన ఎంట్రీ ఈజీగానే ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.

సారాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ను బట్టి, ఆమె పోస్టులకు వచ్చే లైకులను బట్టి ఆమెను ఎక్కువమంది అభిమానిస్తున్నారని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. సారా తన తల్లిలాగే డాక్టర్ కావాలనుకుంది. అందుకే మెడిసిన్ చేస్తూనే.. మోడల్ గా రాణించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు నటించిన యాడ్స్ కూడా సారాకు మంచి పేరే తీసుకువచ్చాయి. గతంలో కూడా తన బాలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు వచ్చినా.. ఈసారి మాత్రం కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు.

Also Read : 

అందాల డోసు పెంచిన అనుపమ.. కుర్రకారు గుండెల్లో దడక్ దడక్…

 

Tollywood Heroine : ఇది ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఆమె ఎవరో చెప్పగలరా?

 

Valimai Twitter Review : వావ్! అజిత్ యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో ఉందిగా! వలిమై ట్విట్టర్ రివ్యూ!

 

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

 

 

For More Updates Follow us on – Sirimalli Page