Tollywood Heroine : ఇది ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఆమె ఎవరో చెప్పగలరా?

Tollywood Heroine : ఫోటో చూసి భలే క్యూట్ గా ఉందని అనుకున్నారు కదా. నిజంగానే చాలా క్యూట్ గా ఉంది. కానీ పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసింది. బాగానే సక్సెస్ అయ్యాయి. నటి (Tollywood Heroine) గా మంచి పేరే వచ్చింది. శ్రీరామదాసు సినిమాలో యాక్ట్ చేయడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.

Archana Shastry sirimalli
Archana Shastry sirimalli

హీరోయిన్ ముద్దు పేరు ‘భల్లూ’
స్మార్ట్ గా నవ్వుతుంది. ఇస్మార్ట్ గా పడేస్తుంది. తపన అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది. అందులో హీరోయిన్. తరువాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బిగ్ బాస్ షో పార్టిసిపెంట్ గా తెలుగింట ప్రతీ గుమ్మానికి పరిచయం అయ్యింది. ఈ హీరోయిన్ ముద్దు పేరు తెలుసా? భల్లూ. అవును. ఆమె తల్లిదండ్రులకు బాగా ఇష్టమైన పేరు. బాగా ప్రేమ ఉన్నప్పుడు అలా పిలుస్తారు. టాలీవుడ్ లో కూడా ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.

Archana Shastry
Archana Shastry

రెండుసార్లు పేరు మార్చుకుని..
హీరోయిన్ అయితే అయ్యింది కానీ… మధ్యలో పేరు మార్చేసుకుంది. అదేంటి జాతకాల పిచ్చా అంటే. కాదు.. అదే పేరుతో ఓ హీరోయిన్ అప్పటికే ఇండస్ట్రీలో ఉండేది. అందుకే పుస్తకాలు చూసి మంచి పేరు వెదికి పెట్టుకున్నా అంటుంది. ఆ హీరోయినే.. అర్చన. ఆమె తన పేరును తరువాతి కాలంలో వేదగా మార్చుకుంది. మళ్లీ శ్రీరామదాసు సినిమా నుంచి అర్చనగా మార్చేసుకుంది. కొన్ని అలా జరిగిపోతుంటాయంతే.

Archana Shastry
Archana Shastry

సినిమాలు రానప్పుడు డిప్రెషన్ లోకి..
డ్యాన్స్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రాలేదన్న కసితో బాగా ట్రై చేసి హీరోయిన్ అయ్యింది. కానీ ఫస్ట్ పిక్చర్ తపన అంటే మాత్రం ఎందుకో ఆమెకు ఇష్టంలేదు. అల్లరి నరేష్ తో చేసిన ‘నేను’ అనే సినిమాపై హోప్స్ పెట్టుకున్నా ఎందుకో వర్కవుట్ కాలేదు. సినిమాలు రానప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయినా.. మళ్లీ తనను తాను పికప్ చేసుకుంది. అందుకే ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడగలిగింది.

Archana Shastry
Archana Shastry

ఈ హీరోయిన్ కూ ఓ విధానం..
ఇండస్ట్రీలో ఎలా ఉంటే పైకి రావచ్చో చాలామంది చెబుతుంటారు. కానీ కొందరు హీరోయిన్లకు అది నచ్చదు. అందుకే వాళ్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. అయినంతమాత్రాన వాళ్లకు టాలెంట్ లేదు అనలేం. ఒక్కొక్కరిదీ ఒక్కో పద్దతి అంతే. అలాగే అర్చనకూ ఓ విధానముంది. దానినే నమ్ముకుంది. ఇప్పటికీ దానినే అనుసరిస్తుంది. ఈ విషయంలో నిజంగా గ్రేట్.

Archana Shastry
Archana Shastry

బిగ్ బాస్ షోతో గుర్తింపు
బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత అర్చనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రతీ ఇంటా అభిమానులూ పెరిగారు. కానీ ఆ హైప్ ని నిలబెట్టుకుని ఛాన్స్ రాబట్టుకోవడంలో ఇబ్బందులు తప్పలేదు. అయినా సరే.. అర్చనలో మంచి డ్యాన్సర్ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి సినిమా హీరోయిన్లలో చాలామందికి డ్యాన్స్ పై పట్టుండదు. డిస్కోలు, బ్రేకులు వేయగలిగినా.. క్లాసికల్ అంటే మాత్రం బేల మొహం వేస్తారు. ఈ విషయంలో అచ్ఛమైన పదహారణాల తెలుగింటి అందం.. అర్చనను మెచ్చుకోవాల్సిందే.

Archana Shastry
Archana Shastry

ఏదేమైనా.. అర్చనకు మంచి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావాలని.. ఆ సినిమాతో మరో బ్రేక్ కూడా రావాలని.. అది ఆమెకు మరిన్ని మంచి ఛాన్స్ లను తెచ్చిపెట్టాలని సిరిమల్లి.కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Archana Shastry
Archana Shastry
Archana Shastry
Archana Shastry