Valimai Twitter Review : వావ్! అజిత్ యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో ఉందిగా! వలిమై ట్విట్టర్ రివ్యూ!

Valimai Twitter Review : అజిత్ అంటేనే యాక్షన్. అసలే బైక్ రైడింగ్స్ లో దుమ్మురేపుతాడు. అది చాలు అజిత్ డేరింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఇప్పుడు వలిమై సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ లో ఓ రేంజ్ లో యాక్ట్ చేశాడు. ఎప్పటినుంచో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొన్న సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా ఆంక్షల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాకు ఒక్క రోజు ముందు వలిమై రిలీజ్ అయ్యింది.

వలిమై సినిమాపై కోలీవుడ్ తోపాటు అన్ని సినీ పరిశ్రమల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని నిలబెట్టే విధంగా ఈ సినిమా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ల వర్షం కురుస్తోంది. అందుకే వలిమై రివ్యూ కీవర్డ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై మొదలవ్వగానే.. థియేటర్లన్నీ దద్దరిల్లాయి. తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 95 శాతం కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయంటే దీని రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దళపతి సినిమాలో రజనీకాంత్ యాక్షన్ కి తిరుగులేదు. మాస్టర్ సినిమాలోనూ విజయ్ యాక్షన్ మూమెంట్ అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు వలిమై సినిమాలో అజిత్ నటన కూడా అంత అద్భుతంగా ఉందని ట్విట్టర్ లో నెటిజన్స్ భావిస్తున్నారు. వలిమై సినిమాలో మరో అట్రాక్షన్ ఏమిటంటే.. మన తెలుగు నటుడు కార్తికేయ తొలిసారిగా తమిళ స్క్రీన్ పై ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చాడు.

అజిత్, కార్తికేయ బైక్ ఛేజింగ్ సీన్స్ అయితే సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలని నెటిజన్స్ అంటున్నారు. ప్రతీ సన్నివేశంలోనూ సస్పెన్స్ కనిపిస్తుందని.. స్క్రీన్ ప్లే ఆ స్థాయిలో రక్తికట్టించారంటున్నారు నెటిజన్స్. దాదాపు రెండేళ్ల తరువాత హీరోల కటౌట్లకు థియేటర్ల బయట పూలమాలలు, పాలాభిషేకాలు మొదలయ్యాయి. ఇప్పుడు అజిత్ సినిమాతో అది పీక్ స్టేజ్ కు వెళ్లడం ఖాయం. అంతగా అభిమానులను ఆకట్టుకుందీ సినిమా.

 

ఈ సినిమాలో బైక్ స్టంట్స్ ను ప్లాన్ చేసిన కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ కి మాత్రం పూలదండలు వేయాల్సిందే. అంతలా ఇది అద్భుతః

జీస్టూడియోస్, బోనీకపూర్ లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. తమిళంతోపాటు దక్షిణాదిన తెలుగు, కన్నడలోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. అటు బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు వలిమై. అంటే ఇప్పుడు హీరో అజిత్ కూడా మంచి పాన్ ఇండియా స్టార్ అయినట్టే. ఫ్యామిలీ డ్రామాతోపాటు మాస్ ఎంటర్ టైనర్ గా వలిమై నిలిచిందని ట్విట్టర్ లో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

Also Read : 

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు (24-02-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (24-02-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page