Pawan-Harish : క్రేజీ కాంబినేషన్ కి … క్రేజీ టైటిల్.. రాసుకో సాంబ..!

Pawan-Harish  : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్(Pawan-Harish) కాంబోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. గబ్బర్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ కాంబో మరోసారి రీపీట్ కానుంది. ఈ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

కొద్దిసేపటి క్రితమే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్(Bhavadeeyudu Bhagat Singh) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. దేశభక్తికి సంబంధించిన అంశాలను టచ్ చేస్తూనే పక్కా కమర్షియల్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ బైక్ పై స్టైలిష్ గా కూర్చొని టీ తాగుతూ కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ తోనే సినిమా పైన హైప్ పెంచేసింది ఈ కాంబో.

ఇందులో పవన్ కళ్యాణ్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా పక్కా హిట్ రాసుకో సాంబ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read :

https://twitter.com/harish2you/status/1435819039394197506