2024-07-18 01:16:24
Telangana High court : గణేశ్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు – Sirimalli.com

Telangana High court : గణేశ్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

Telangana High court : గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు(Telangana High court ) ఆంక్షలు విధించింది. ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో అనుమతించవద్దని, వాటిని కేవలం ప్రత్యేక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలు నిమజ్జనం చేయాలంది.

ఇక మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని సూచించింది.  ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో గ‌ణేష్ ఉత్స‌వాల‌కు ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

వినాయక ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవే..!

1. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలి
2.రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దు
3. ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా చూడాలి
4. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలి
5. నిమజ్జనం రోజు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలి
6. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దు
7. మండపాల నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలి
8. భౌతికదూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి

Also Read :